Home
News

'స్టార్ట్ బటన్' లేని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ హిట్టా.. ఫట్టా..?

By Prashanth
Windows 8


టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాప్ట్ కొత్తగా రూపొందిస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్ 'విండోస్ 8' లో స్టార్ట్ బటన్‌ని తొలగించనుందా.. అనే ప్రశ్నకు సమాధానం అవుననే అంటున్నారు టెక్నాలజీ నిపుణులు. గత 17 సంవత్సరాలుగా విండోస్ అపరేటింగ్ సిస్టమ్‌లో మమేకైనటువంటి విండోస్ స్టార్ట్ బటన్ విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్‌లో లేకపోవడాన్ని విండోస్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. విండోస్ 95 ఆపరేటింగ్ సిస్టమ్ మొదలు కోని ఇప్పటి వరకు విండోస్ విడుదల చేసిన అన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌లో నిక్షిప్తమై ఉన్న స్టార్ట్ బటన్ విండోస్ 8లో లేకపోవడం అభిమానులకు నిరాశే.

ఐతే మైక్రోసాప్ట్ వర్గాల ప్రకారం విండోస్ అభిమానులు నిరాశ చెందాల్సిన పని లేదని స్ఫష్టం చేశారు. స్టార్ట్ బటన్ మాదరి ఫంక్షనాలిటీని అందించే 'హాట్ కార్నర్' ని నిక్షిప్తం చేశామన్నారు. కంప్యూటర్ మౌస్, టచ్ స్క్రీన్ ద్వారా దీనిని యాక్సెస్ చేసుకోవచ్చన్నారు. ఈ కాన్పెస్ట్ విండోస్ 8లో ఉన్న ఇంటర్‌ఫేస్‌ని ఆధారం చేసుకోని రూపొందించామని మైక్రోసాప్ట్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఈ సంవత్సరం స్టోర్స్‌లలో విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నామని మైక్రోసాప్ట్ వర్గాలు తెలిపాయి. దీనితో పాటు విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్‌ని గతంలో ఉపయోగించే యూజర్స్ అందిరికి తప్పక నచ్చుతుందని అన్నారు. విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ గతంలో ఏ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇవ్వలేనటువంటి ఎక్స్ పీరియన్స్‌ని అందిస్తుందని అన్నారు. సో దీనిని బట్టి త్వరలో స్టార్ట్ బటన్ లేనటువంటి విండోస్ 8 ఆపరేటింగ్‌ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో యూజర్స్ వారి యొక్క అనుభవాలను క్రింద కామెంట్స్ బాక్సులో పంచుకోవచ్చు.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X