BSNL నుంచి కొత్తగా మరొక ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ అయింది!! ప్రయోజనాలు ఇతర టెల్కోలకు దీటుగా...
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ప్రభుత్వ టెల్కో ప్రైవేట్ టెల్కోలకు పోటీని ఇవ్వడానికి చేస్తున్న అనేక ప్రయత్నాలలో భాగంగా తన వినియోగదారుల కోసం కొత్తగా మరొక ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. దేశంలోని ప్రతి టెలికాం సర్కిల్‌లో ఈ వోచర్ అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క ప్రయోజనాలు స్వల్పకాలిక వాలిడిటీకి ఎంచుకునే ప్లాన్‌తో టన్నులకొద్ది ప్రయోజనాలను వెతుకుతున్న వ్యక్తుల కోసం ఇది ఉత్తమ ఎంపికగా ఉంటుంది. BSNL కొత్తగా రూ.87 ధరతో ప్రారంభించిన ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL రూ.87 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు
BSNL టెల్కో కొత్తగా రూ.87 ధర వద్ద అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్‌తో వినియోగదారులు మొత్తంగా 14 రోజుల చెల్లుబాటు కాలానికి అన్ని రకాల ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్‌తో లభించే ప్రయోజనాల విషయానికి వస్తే ఇది 1GB రోజువారీ డేటాతో మొత్తం వాలిడిటీ కాలానికి 14GB డేటాను అందుకుంటారు. రోజువారి డేటా తర్వాత స్పీడ్ 40 Kbpsకి తగ్గించబడుతుంది. ఇంకా వినియోగదారులు రోజుకు 100 SMSలతో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్‌ను కూడా పొందుతారు. చివరగా రూ.100లోపు ధరలో లభించే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు SMSలు పంపడానికి వీలు కల్పిస్తుంది.

అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే BSNL ONE97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ద్వారా లభించే హార్డీ గేమ్‌ల మొబైల్ సర్వీస్‌ను కూడా బండిల్ చేస్తుంది. ఇది BSNL అందించే ప్రత్యేకమైన ప్రీపెయిడ్ ప్లాన్. పైన చెప్పినట్లుగా ప్రభుత్వ నిర్వహణలోని టెల్కో ప్రస్తుతం ప్రతి సర్కిల్‌లో ఈ ప్లాన్‌ను అందించడం లేదు. ఛత్తీస్‌గఢ్ మరియు అస్సాం వంటి రాష్ట్రాలు ఈ ప్లాన్ ను పొందవు. జాబితాలో మరిన్ని ఉండవచ్చు కానీ వినియోగదారులు BSNL అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లడం ద్వారా దానిని ధృవీకరించవచ్చు.

BSNL యొక్క రూ.87 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌తో వినియోగదారులు కేవలం రూ.6.21 ధరతో 1GB డేటాను పొందుతున్నారు. వాయిస్ కాలింగ్, SMS మరియు డేటా సేవల కోసం ఒకేసారి రూ.100 కంటే ఎక్కువ చెల్లించకూడదనుకునే వినియోగదారులకు ఇది బాగా పని చేస్తుంది. ఇందులో మరొక మంచి విషయం ఏమిటంటే ఈ ప్లాన్ వినియోగదారునికి అవసరమైన ప్రతిదాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ అందించే ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే 14 రోజుల వాలిడిటీ అనేది కూడా చెడ్డ డీల్ కాదు.

BSNL రూ.797 వోచర్ ప్లాన్ వివరాలు
BSNL టెల్కో రూ.797 ధర వద్ద అందించే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క ప్రయోజనాలలో మొదటి 60 రోజుల పాటు 2GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMSలు అందించబడుతుంది. ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) డేటా వినియోగం తర్వాత డేటా స్పీడ్ 80 Kbpsకి తగ్గించబడుతుంది. 60 రోజుల తర్వాత ప్రయోజనాల గడువు ముగుస్తుంది కానీ SIM కార్డ్ సంవత్సరం పొడవునా యాక్టీవ్ దశలో ఉంటుంది. ఈ ప్లాన్ యొక్క సాధారణ వాలిడిటీ 395 రోజులు. అయితే జూన్ 12, 2022 లోపు రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు BSNL ఈ ప్లాన్‌తో 30 రోజుల అదనపు చెల్లుబాటును కూడా అందిస్తుంది. BSNL రూ.797 వోచర్ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకున్న వారు 60 రోజుల తరువాత వారి సిమ్ యాక్టీవ్ లో ఉండడంతో ఇన్ కమింగ్ కాల్ కోసం చింతించవలసిన అవసరం లేదు. టాక్‌టైమ్ వోచర్‌లు మరియు డేటా వోచర్‌లు పుష్కలంగా ఉన్నందున వీటిని మీకు అవసరమైనప్పుడు రీఛార్జ్ చేసుకోవచ్చు. BSNL అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఒక మంచి విషయం ఏమిటంటే అవి చాలా సరసమైన ధరలో లభిస్తాయి. అయినప్పటికీ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్‌లతో వినియోగదారులు పొందే వేగవంతమైన 4G నెట్‌వర్క్‌లు వారికి మద్దతు ఇవ్వవు.

BSNL STV_399 & STV_429 ప్లాన్లు
BSNL యొక్క అధిక డేటా మరియు వాలిడిటీ జాబితాలోని మొదటి ప్లాన్ STV_399. ఇది రూ.399 ధరతో 80 రోజుల చెల్లుబాటు కాలానికి రోజుకు 1GB డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ BSNL ట్యూన్‌లు మరియు లోక్‌ధున్ కంటెంట్‌కు ఉచిత యాక్సిస్ ను కూడా అందిస్తుంది. జాబితాలోని STV_429 రెండవ ప్లాన్ కొంచెం మెరుగైన ప్రయోజనాలతో లభిస్తుంది. ఇది 81 రోజుల వాలిడితో రోజుకు 1GB డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. అదనంగా Eros Now ఎంటర్‌టైన్‌మెంట్ సేవలకు కూడా ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది.


Click it and Unblock the Notifications








