నా ప్రస్దానం '70' యేళ్లకు చేరుకుంది..

Posted By:

నా ప్రస్దానం '70' యేళ్లకు చేరుకుంది..

 

ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఆదివారం 70వ వసంతంలోకి ప్రవేశించారు. తన పుట్టిన రోజుని పురస్కరించుకోని ఆదివారం లండన్ కేంబ్రిడ్జి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రోపెసర్ 'సర్ లెస్‌జాక్ బొరిస్‌వైజ్' ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. అస్వస్దత కారణంగా ఆస్పత్రిలో చేరిన హాకింగ్ శుక్రవారమే డిశ్చార్జి అయ్యారని, అందువల్ల ఆయన ఆ కార్యక్రమానికి హాజరు కాలేక పోయారని కేంబ్రిడ్జి యూనివర్సిటీ సభ్యులు తెలిపారు.

హాకింగ్ ఈ సమావేశానికి వస్తారని తెలిసి ఆయనను చూసేందుకు ఎక్కడి నుండో వచ్చిన శాస్త్రవేత్తలు, విలేకరులు ఆయన రాకపోవడంతో నిరాశకు గురయ్యారని వర్సిటీ తెలిపింది. దీంతో హాకింగ్ సమావేశాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇది ఇలా ఉంటే హాకింగ్ గౌరవార్దం ఏర్పాటు చేసిన ఈ సదస్సుకి హాజరు కావడం లేదని ప్రముఖ బ్రిటిష్ ఛానల్ బిబిసి తన ప్రకటనలో పేర్కోంది.

గత 30 సంవత్సరాలుగా కేంబ్రిడ్జి యూనివర్సిటీకి తన సేవలను అందిస్తున్న స్టీఫెన్ హాకింగ్ ఇటీవలే ఓ కొత్త పుస్తకాన్ని ప్రచురించారు. దాని పేరు 'గ్రాండ్ డిజైన్'. హాకింగ్ ఇటీవలే స్పేస్ విమానంలో ట్రావెల్ సున్నా-గురుత్వాకర్షణను ఎలా ఫీల్ అవుతాడో అలాంటి మొదటి అనుభవాన్ని స్పెషల్ విమానంలో ప్రయాణం చేసి అనుభూతిని పొందారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot