రియల్ హిరో సినిమా ఖరారు.. అభిమానుల్లో ఉత్కంఠ

Posted By: Staff

రియల్ హిరో సినిమా ఖరారు.. అభిమానుల్లో ఉత్కంఠ

 

సాధారణ స్థాయి నుంచి జీవితాన్ని ప్రారంభించి ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఆపిల్ సహ - వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్‌జాబ్స్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ సందేశాత్మక సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా టైటిల్‌ను ‘జాబ్స్’గా ఖరారు చేసినట్లు సమాచారం. స్టీవ్‌జాబ్స్ పాత్రను ప్రముఖ హాలివుడ్ నటుడు ఆస్టన్ కచర్ పోషించనున్నారు. ఈ జీవిత చరిత్ర ఆధారిత సినిమాకు మ్యాట్ వైట్లీ కధను సమకూర్చగా జాషువా మైకిల్ స్టెర్న్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫై‌స్టార్ ఇన్సటిట్యూట్ చిత్రాన్ని నిర్మిస్తుంది.

స్టీవ్‌జాబ్స్ తన జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను సమర్ధవంతంగా ఎదుర్కొని టెక్ ప్రపంచానికి ఆదర్శమూర్తిగా నిలిచిన తీరును ప్రధానంగా ఈ సినిమాలో చూపనున్నారు. మే నుంచి ఈ చిత్ర షూటింగ్  ప్రారంభం కానుంది. ఈ తాజా ప్రకటన వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేయటంతో ఆపిల్ అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.  ఇదిలా ఉండగా స్టీవ్‌జాబ్స్ పాత్రకు ఆస్టన్ కచర్ సరైన న్యాయం చేయగలడని పరిశ్రమ అంతర్గత వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot