స్టీవ్ జాబ్స్‌ గురించి సంచలన విషయాలు బయటపెట్టిన కూతురు..

స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీని మరింత సజీవం చేసిన స్టీవ్ జాబ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. స్టీవ్ జాబ్స్ పెద్దగా చదువుకోపోయినప్పటికి తన అపారమైన మేధోశక్తితో ప్రపంచ మేధావుల లిస్టులో ఒకరిగా నిలిచారు.

|

స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీని మరింత సజీవం చేసిన స్టీవ్ జాబ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. స్టీవ్ జాబ్స్ పెద్దగా చదువుకోపోయినప్పటికి తన అపారమైన మేధోశక్తితో ప్రపంచ మేధావుల లిస్టులో ఒకరిగా నిలిచారు. మొదటి నుంచి చదువును దూరం పెట్టిన జాబ్స్ స్కూల్స్ ఇంకా కాలేజెస్‌ను ఉపయోగపడని ప్రదేశాలుగా అభివర్ణిస్తూ వచ్చారు.

 

కేక పుట్టిస్తోన్న వన్‌ప్లస్ 6T థండర్ పర్పుల్ ఎడిషన్కేక పుట్టిస్తోన్న వన్‌ప్లస్ 6T థండర్ పర్పుల్ ఎడిషన్

కొత్త పుస్తకం స్మాల్ ఫ్రై..

కొత్త పుస్తకం స్మాల్ ఫ్రై..

ఇదే విషయాన్ని జాబ్స్ కూతురైన లిసా-బ్రెన్నన్ తన కొత్త పుస్తకం స్మాల్ ఫ్రైలో పేర్కొన్నారు. తన తండ్రి ఎప్పుడు తన చుదువు గురించి పట్టించుకోలేదని లిసా గుర్తుచేసుకున్నారు. కళాశాల విద్య మనుషులను బూజోస్ (స్టుపిడ్స్)గా మార్చేస్తుందని స్టీవ్ జాబ్స్ అభిప్రాయపడేవారిని లిసా తన స్మాల్ ఫ్రై బుక్‌లో పేర్కొన్నారు.

 

 

ఫార్మాల్ ఎడ్యుకేషన్‌ స్టీవ్ జాబ్స్‌‌కు నచ్చదు..

ఫార్మాల్ ఎడ్యుకేషన్‌ స్టీవ్ జాబ్స్‌‌కు నచ్చదు..

తాను ఫార్మాల్ ఎడ్యుకేషన్‌కు ఎంత మాత్రం అభిమానిని కానని, కాలేజ్ ఎడ్యుకేషన్ అనేది క్రియేటివిటీని కిల్ చేస్తుందని, ఇక్కడి అధ్యాపకులు ఇతర వ్యర్తులు ఎలా ఆలోచిస్తారు అనే విషయాన్ని మాత్రమే చెబుతారని, ఇది చాలా వరకు ప్రొడక్టివ్ ఇయర్స్‌ను కిల్ చేసి మనుషులను బూజోస్‌గా మార్చేస్తుందని అనేక సందర్భాల్లో తనకు చెబుతుండేవారిని పేర్కొన్నారు.

 

 

ప్రపంచాన్ని చుట్టి రావటం ఉత్తమం..
 

ప్రపంచాన్ని చుట్టి రావటం ఉత్తమం..

మరొక సందర్భంలో తన ఏడవ తరగతి టీచర్ లీ షుల్ట్‌తో ఓ పేరెంట్ టీచర్ కాన్ఫిరెన్సులో మాట్లాడుతుండగా, చిన్నారులకు మిడిల్ స్కూల్‌లో ఉండటం కంటే ప్రపంచాన్ని చుట్టి రావటం ఉత్తమమని మిడల్ స్కూల్ గురించి జాబ్స్ ఒక జోక్ వేసారట. వాస్తవానికి స్టీవ్ జాబ్స్ తరహాలోనే ఇప్పుడు పట్టుకొతోన్న చాలా వరకు టెక్నాలజీ కంపెనీలకు చెందిన సీఈవోలు టెక్నాలజీ బ్యాగ్రౌండ్‌ను కలిగి ఉండటం లేదు. వేరువేరు బ్యాగ్రౌండ్స్ నుంచి వస్తోన్న వీరు తమ అభిరుచులకు అనుగుణంగా టెక్నాలజీ విభాగంలో రాటు తేలుతున్నారు.

 

 

స్టీవ్ జాబ్స్ జీవితంకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు..

స్టీవ్ జాబ్స్ జీవితంకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు..

1944 ఫిబ్రవరి 24న శాన్‌‌ఫ్రాన్సిస్కోలో జన్మించిన స్టీవ్ జాబ్స్‌ని పాల్, క్లారా జాబ్స్ అనే దంపతులు దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో ఉన్న హైస్కూల్ చదువు పూర్తి చేసి 1972లో వోరెగాన్ రాష్ట్రంలోని పోర్ట్‌లాండులో రీడ్ కాలేజీలో చేరారు.

 

 

ప్రేమ వివాహం చేసుకున్న జాబ్స్..

ప్రేమ వివాహం చేసుకున్న జాబ్స్..

స్టీవ్ జాబ్స్ ది ప్రేమ వివాహం. ఈయన లారెన్ పాలెన్‌ను 1991లో వివాహం చేసుకున్నారు. వీరి ముగ్గురు సంతానం కూడా. అపిల్ ఇన్‌కార్పోరేషన్‌ను నెలకొల్పడానికి ముందు స్టీవ్ జాబ్స్ పిక్షర్ యానిమేషన్ స్టూడియోస్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ది వాల్ట్ డిస్నీ కంపెనీ డైరెక్టర్స్ బోర్డులో కూడా ఉన్నారు. 1976లో స్టీవ్ వోజ్‌నైక్ భాగస్వామ్యంతో ఆపిల్ కంపెనీని స్థాపించాడు.

 

 

మొట్టమొదటి కంప్యూటర్‌ను 666.66 డాలర్లకు..

మొట్టమొదటి కంప్యూటర్‌ను 666.66 డాలర్లకు..

మొదట ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు మాత్రమే తయారు చేయాలనుకున్నా, చివరకు పూర్తి కంప్యూటర్లు తయారు చేయగలిగారు. 1984లో యాపిల్ లాంచ్ చేసిన మొదటి మ్యాకెంతోష్ కంప్యూటర్ ర్యామ్ సామర్థ్యం 128కే, ఆ తరువాత 512కే ర్యామ్‌తో మరో అప్‌డేటెడ్ వర్షన్‌ను యాపిల్ తీసుకువచ్చింది. స్టీవ్ వోజ్‌నైక్ భాగస్వామ్యంతో స్టీవ్ జాబ్స్ మొట్టమొదటి కంప్యూటర్‌ను 666.66 డాలర్లకు అమ్మారు. అప్పటినుండి ఆపిల్ కంపెనీ కంప్యూటర్ రంగంలో కీలకస్థానాన్ని ఆక్రమించింది.

 

 

ఆర్థిక మాంధ్యం కారణంగా..

ఆర్థిక మాంధ్యం కారణంగా..

1980లో IPO వలన జాబ్స్ కోటీశ్వరుడయ్యాడు. 1984లో ప్రవేశపెట్టబడిన మ్యాకింటోష్ మరొక అత్యద్భుత మైలురాయిగా నిలిచిపోయింది. ఆపిల్ కంపెనీని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన జాబ్స్ పద్దతులు కొందరు ఉద్యోగులకు నచ్చేవి కాదు. 1984 చివరలో ఏర్పడిన మాంద్యం వల్ల ఆశించినమేరకు వ్యాపారం జరుగకపోవడంతో 1985లో జాబ్స్‌ను మ్యాకింటోష్ విభాగ అధిపతి పదవి నుండి తొలగించారు.

 

 

అన్ని షేర్లను అమ్మేసాడు..

అన్ని షేర్లను అమ్మేసాడు..

జాబ్స్ 1986లో ఒక్కటి తప్ప తనవద్ద ఉన్న అన్ని షేర్లు అమ్మేసాదు. ఆ ఒక్క షేర్ పెట్టుకోవడం వెనుక రకరకాల కారణాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. తాను కూడా ఆపిల్ కంపెనీ స్టాక్ రిపోర్ట్ అందుకోవడానికి, కంపెనీ సమావేశాల్లో పాల్గొనడానికి ఆ ఒక్క షేర్ ఉపయోగపడుతుందని జాబ్స్ దానిని అలాగే పెట్టుకొన్నాడు అని ఒక కథనం.

 

 

NeXT కంపెనీతో మల్లి పుంజుకున్నాడు..

NeXT కంపెనీతో మల్లి పుంజుకున్నాడు..

తన దగ్గర ఉన్న డబ్బుతో NeXT అనే కంపెనీ ప్రారంభించాడు. ఈ కంపెనీ తయారు చేసిన కంప్యూటర్లు ఎంతో ఉన్నత ప్రమాణాలు కలిగి ఉన్నా, చాలా ఖరీదయినవి కావడంతో ఎక్కువమంది కొనలేదు. స్టీవ్ జాబ్స్ లాంటి వ్యక్తి అవసరం గ్రహించిన ఆపిల్ డైరక్టర్లు NeXTను 429 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసారు.

 

 

ఆపిల్ కంపెనీకి మళ్లీ సీఈఓగా..

ఆపిల్ కంపెనీకి మళ్లీ సీఈఓగా..

అప్పుడు జరిగిన ఒప్పందంలో భాగంగా స్టీవ్ జాబ్స్ మళ్లీ ఆపిల్ కంపెనీకి తాత్కాలిక CEOగా నియమితుడయ్యాడు. కంపెనీని లాభాల్లో నడిపించడంలో భాగంగా అప్పుడు నడుస్తున్న కొన్ని ప్రాజెక్టులను పూర్తిగా ఆపివేసి కంపెనీని లాభాలబాటలో తీసుకెళ్ళడంలో ముఖ్యపాత్ర వహించినందుకు గాను 2000లో పూర్తిస్థాయి CEO అయ్యాడు.

2007, జూన్ 29న మొదటి ఐఫోన్..

2007, జూన్ 29న మొదటి ఐఫోన్..

కంప్యూటర్లు మాత్రమే కాకుండా పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ అయిన ఐపాడ్‌ను ఆవిష్కరించి ఆపిల్‌ను ఎవరూ అందుకోలేని స్థానానికి తీసుకెళ్ళిన ఘనత స్టీవ్ జాబ్స్‌కు దక్కింది. ఆపిల్ కంపెనీ CEOగా జాబ్స్ జీతం సంవత్సరానికి కేవలం ఒక్క డాలరు ($1) మాత్రమే. ప్రపంచంలో అత్యల్ప జీతం తీసుకొనే CEOగా గిన్నీస్ బుక్‌లో స్టీవ్ జాబ్స్ పేరు నమోదయ్యింది. 2007, జూన్ 29న స్టీవ్ జాబ్స్ మొట్టమొదటి యాపిల్ ఐఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసారు. అప్పటి నుంచి యాపిల్ ఐఫోన్ అమ్మకాలు ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లను శాసిస్తూనే వస్తున్నాయి.

 

 

Best Mobiles in India

English summary
Steve Jobs believed schools and colleges made people bozos, didn't care for daughter's education.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X