Home
News

హైటెక్ యుగ పురుషుడు 'స్టీవ్‌జాబ్స్'

By Super
Steve Jobs


టెక్నాలజీ, సాప్ట్‌వేర్, సాంకేతిక రంగాలలో నిష్ణాతులైన వారి గురించి తెలుగు వన్ ఇండియాలో కథనంగా ప్రచురిస్తున్నాం. ఈరోజు ప్రపంచానికి ఆపిల్ ఉత్పత్తులను పరిచయం చేసిన స్టీవ్ జాబ్స్‌గా పిలువ బడే స్టీవెన్ పాల్ జాబ్స్ గురించి తెలుసుకుందాం.

1944 ఫిబ్రవరి 24న శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించిన స్టీవ్ జాబ్స్‌ని పాల్ మరియు క్లారా జాబ్స్ అనే దంపతులు దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో ఉన్న హైస్కూల్ చదువు పూర్తి చేసి 1972లో వోరెగాన్ రాష్ట్రంలోని పోర్ట్‌లాండులో రీడ్ కాలేజీలో చేరాడు. ఆయన లారెన్ పాల్‌ను 1991లో పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ కుమారుడు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అపిల్ ఇన్‌కార్పోరేషన్‌ను నెలకొల్పడానికి ముందు స్టీవ్ జాబ్స్ పిక్సర్ యానిమేషన్ స్టూడియోసల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ది వాల్ట్ డిస్నీ కంపెనీ డైరెక్టర్స్ బోర్డులో కూడా ఉన్నారు.

Steve Jobs

1976లో స్టీవ్ వోజ్‌నైక్ భాగస్వామ్యంతో ఆపిల్ కంపెనీని స్థాపించాడు. మొదట ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు మాత్రమే తయారు చేయాలనుకున్నా, చివరకు పూర్తి కంప్యూటర్లు తయారు చేయగలిగారు. మొట్టమొదటి కంప్యూటర్‌ను 666.66 డాలర్లకు అమ్మారు. అప్పటినుండి ఆపిల్ కంపెనీ కంప్యూటర్ రంగంలో కీలకస్థానాన్ని ఆక్రమించింది. 1980లో IPO వలన జాబ్స్ కోటీశ్వరుడయ్యాడు. 1984లో ప్రవేశపెట్టబడిన మ్యాకింటోష్ మరొక అత్యద్భుత మైలురాయిగా నిలిచిపోయింది.

ఆపిల్ కంపెనీని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన జాబ్స్ పద్దతులు కొందరు ఉద్యోగులకు నచ్చేవి కాదు. 1984 చివరలో ఏర్పడిన మాంద్యం వల్ల ఆశించినమేరకు వ్యాపారం జరుగకపోవడంతో 1985లో జాబ్స్ ను మ్యాకింటోష్ విభాగ అధిపతి పదవినుండి తొలగించారు.

Steve Jobs

తాను ప్రారంభిన కంపెనీలో తనకు ప్రాముఖ్యత లేకపోవడంతో జాబ్స్ 1986లో ఒక్కటి తప్ప తనవద్ద ఉన్న అన్ని షేర్లు అమ్మివేసాడు. ఆ ఒక్క షేర్ పెట్టుకోవడం వెనుక రకరకాల కారణాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. తాను కూడా ఆపిల్ కంపెనీ స్టాక్ రిపోర్ట్ అందుకోవడానికి, కంపెనీ సమావేశాల్లో పాల్గొనడానికి ఆ ఒక్క షేర్ ఉపయోగపడుతుందని జాబ్స్ దానిని అలాగే పెట్టుకొన్నాడు అని ఒక కథనం.

తన దగ్గర ఉన్న డబ్బుతో NeXT అనే కంపెనీ ప్రారంభించాడు. ఈ కంపెనీ తయారు చేసిన కంప్యూటర్లు ఎంతో ఉన్నత ప్రమాణాలు కలిగి ఉన్నా, చాలా ఖరీదయినవి కావడంతో ఎక్కువమంది కొనలేదు. స్టీవ్ జాబ్స్ లాంటి వ్యక్తి అవసరం గ్రహించిన ఆపిల్ డైరక్టర్లు NeXT ను 429 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసారు. అపుడు జరిగిన ఒప్పందంలో భాగంగా స్టీవ్ జాబ్స్ మళ్ళీ ఆపిల్ కంపెనీకి తాత్కాలిక CEOగా నియమితుడయ్యాడు. కంపెనీని లాభాల్లో నడిపించడంలో భాగంగా అప్పుడు నడుస్తున్న కొన్ని ప్రాజెక్టులను పూర్తిగా ఆపివేసి కంపెనీని లాభాలబాటలో తీసుకెళ్ళడంలో ముఖ్యపాత్ర వహించినందుకు గాను 2000లో పూర్తిస్థాయి CEO అయ్యాడు.

Steve Jobs

కంప్యూటర్లు మాత్రమే కాకుండా పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ అయిన ఐపాడ్‌ను ఆవిష్కరించి ఆపిల్‌ను ఎవరూ అందుకోలేని స్థానానికి తీసుకెళ్ళిన ఘనత స్టీవ్ జాబ్స్‌కు దక్కుతుంది. ఆపిల్ కంపెనీ CEOగా జాబ్స్ జీతం సంవత్సరానికి కేవలం ఒక్క డాలరు ($1) మాత్రమే. ప్రపంచంలో అత్యల్ప జీతం తీసుకొనే CEO గా గిన్నీస్ బుక్‌లో స్టీవ్ జాబ్స్ పేరు నమోదయింది. జాబ్స్‌కు ప్రస్తుతం ఆపిల్ కంపెనీలో 7,500,000 షేర్లు ఉన్నాయి. 2007 ఫోర్బ్స్ జాబితా ప్రకారం స్టీవ్ జాబ్స్ ఆస్థి విలువ 5.7 బిలియన్ డాలర్లు.

56 సంవత్సరాల వయసులో క్యాన్సర్ భాదతో ఆయన బుధవారం రాత్రి(అక్టోబర్ 5, 2011) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన భార్య పక్కనే ఉన్నారు. తాను ఉదర సబంధమైన క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు జాబ్స్ 2004లో ప్రకటించారు. ఇటీవలే ఆగస్టులో సిఇవో పదవి నుంచి వైదొలగి ఆ బాధ్యతను టిమ్ కుక్‌కు అప్పగించారు. స్టీవ్‌ జాబ్స్‌ అంత్యక్రియలు కొద్ది మంది కుటుంబసభ్యుల మధ్య జరిగినట్లు మీడిమా సమాచారం.

ఆయన అత్యక్రియలు ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా సాదాసీదా జరిగినట్లు ఆయన కుటుంబానికి బాగా పరిచయం ఉన్న వారు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆయన అంతామ సంస్కారం ఎప్పుడు ఏ సమయంలో జరిగిందనే వివరాలు కూడా చెప్పడానికి వారు విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. స్టీవ్ జాబ్స్..తనకు ఆఖరు ఘడియలు దగ్గరపడుతున్నాయని ఫిబ్రవరిలో తెలిసినప్పట్నుంచీ .. భార్య, పిల్లలతో గడపడానికే ఎక్కువగా ప్రాధాన్యమిచ్చారు. కాస్త ఓపిక ఉంటే స్టీవ్ తన యాపిల్ కార్యాలయానికి వెళ్లినా.. భార్య, పిల్లలతో కలిసి సాయంత్రం భోజనం చేయాలనే ఉద్దేశంతో పని ముగియగానే వెంటనే ఇంటికి తిరిగొచ్చేసేవారని ఓ ప్రముఖ ఇంగ్లీషు పత్రిక ఈ విషయాలు వెల్లడించింది.

Steve Jobs

స్టీవ్ జాబ్స్ జ్ఞాపకార్దం అక్టోబర్ 24వ తారీఖున ప్రముఖ అమెరికా పబ్లిషర్ సైమన్ & స్కుస్టర్ అనే సంస్ద స్టీవ్ జాబ్స్ బయోగ్రఫీ పేరుమీద ఓ పుస్తకాన్ని విడుదల చేసింది.

ఇక ఈ స్టీవ్ జాబ్స్ బయోగ్రఫీ పుస్తకాన్ని ఆయన బ్రతికుండగానే ఆమోదం తీసుకొవడం జరిగిందని పుస్తకాన్ని విడుదల చేసే సైమన్ & స్కుస్టర్ ప్రతినిధి వెల్లడించారు. పుస్తకాన్ని విడుదల చేయక ముందే ఈ పుస్తకానికి ముందుగా వచ్చిన ఆర్డర్స్ చూసి వారు నివ్వెర పోవడం జరిగింది. ఈ పుస్తకం ఆయన చనిపోక ముందు 424వ స్దానంలో ఉంటే అదే ఆయన చనిపోయిన తర్వాత ఆర్డర్స్ విభాగంలో నెంబర్ వన్ స్దానానికి చేరిపోయిందని అమెజాన్ సంస్ద ప్రకటించింది.

ఆపిల్ కంప్యూటర్స్ అధినేత స్వర్గీయ స్టీవ్ జాబ్స్ విగ్రహావిష్కరణ ఇటీవలనే హంగరీ దేశపు, బుడాపెస్ట్ సైన్స్ పార్క్ లో జరిగింది. కంప్యూటర్ రంగం లో సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికిన స్టీవ్ జాబ్స్ కు ఇది సరైన నివాళి.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X