శుక్రవారం ప్రయివేట్‌గా స్టీవ్‌ జాబ్స్‌ అంత్యక్రియలు

Posted By: Staff

శుక్రవారం ప్రయివేట్‌గా స్టీవ్‌ జాబ్స్‌ అంత్యక్రియలు

వాషింగ్టన్: ఆపిల్‌ కంప్యూటర్‌ సహ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ అంత్యక్రియలు కొద్ది మంది కుటుంబసభ్యుల మధ్య జరిగినట్లు మీడిమా సమాచారం. బుధవారం నాడు శ్వాసకోసకేన్సర్‌ వ్యాధితో స్టీవ్‌ జాబ్స్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అత్యక్రియలు ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా సాదాసీదా జరిగినట్లు ఆయన కుటుంబానికి బాగా పరిచయం ఉన్న వారు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆయన అంతామ సంస్కారం ఎప్పుడు ఏ సమయంలో జరిగిందనే వివరాలు కూడా చెప్పడానికి వారు విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. స్టీవ్‌ జాబ్స్‌ 56 గత కొన్నేళ్లుగా ఉదరకోశ క్యానర్‌తో బాధపడుతున్నారు. 2004లో శ్వాసకోస కేన్సర్‌కు చికిత్స కూడా చేయించుకున్నారు. 2009లో కాలేయం (లీవర్‌) ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకున్నారు.

స్టీవ్ జాబ్స్..తనకు ఆఖరు ఘడియలు దగ్గరపడుతున్నాయని ఫిబ్రవరిలో తెలిసినప్పట్నుంచీ .. భార్య, పిల్లలతో గడపడానికే ఎక్కువగా ప్రాధాన్యమిచ్చారు. కాస్త ఓపిక ఉంటే స్టీవ్ తన యాపిల్ కార్యాలయానికి వెళ్లినా.. భార్య, పిల్లలతో కలిసి సాయంత్రం భోజనం చేయాలనే ఉద్దేశంతో పని ముగియగానే వెంటనే ఇంటికి తిరిగొచ్చేసేవారని ఓ ప్రముఖ ఇంగ్లీషు పత్రిక ఈ విషయాలు వెల్లడించింది.

అనేక మంది శ్రేయోభిలాషులు వీడ్కోలు పలికే ఫేర్‌వెల్ డిన్నర్‌లు, వివిధ అవార్డులు అందుకునేందుకు రావాలంటూ ఆయనను ఆహ్వానించినా జాబ్స్ సున్నితంగా తిరస్కరించారు. తన వ్యక్తిగత జీవితాన్ని ఆయన గోప్యంగా ఉంచుకునేందుకు ఇష్టపడేవారు. తాను ఏదైనా చేయడానికి, తనకు అందుబాటులో ఉన్న అవకాశాలు.. పూర్తిగా తన నియంత్రణలోనే ఉండాలని జాబ్స్ కోరుకున్నట్లు ఆయన సన్నిహిత మిత్రుడు డాక్టర్ డీన్ ఓర్నిష్ తెలిపారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting