స్టీవ్ జాబ్స్‌ సేవలకు 'గ్రామీ' అవార్డు

Posted By:

 

 

స్టీవ్ జాబ్స్‌ సేవలకు 'గ్రామీ' అవార్డు

టెక్నాలజీ రంగంలో స్టీవ్ జాబ్స్‌ని ఆద్యుడుగా పరిగణమించవచ్చు. అందుకు కారణం టెక్నాలజీ రంగానికి స్టీవ్ జాబ్స్ చేసిన సేవలు అమోఘం. మ్యూజిక్ రంగానికి స్టీవ్ జాబ్స్ చేసిన సేవలను గుర్తించిన గ్రామీ అవార్డు కమిటీ మెంబర్స్ స్టీవ్ జాబ్స్ చనిపోయిన తర్వాత అతనికి గ్రామీ అవార్డుని ప్రకటించారు. ఈ అవార్డుని గ్రామీ ట్రస్టీస్ అవార్డ్ బ్యానర్ క్రింద్ ప్రకటించారు.

మ్యూజిక్ బిజినెస్‌లో తనకున్న ప్రతిభాపాఠవాలను ఉపయోగించి ఆపిల్‌ని అత్యున్నత శిఖరాలకు చేర్చినందు వల్లే ఈ గ్రామీ స్పెషల్ మెరిట్ అవార్డుని ప్రకటించామని తెలిపారు. గ్రామీ అకాడమీ సిఈవో 'నెయిల్ పోర్టినో' మాట్లాడుతూ ఈ సంవత్సరం ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను గ్రామీ అవార్డులను అందజేస్తున్నామని అన్నారు.

ఐప్యాడ్, ఐట్యూన్స్ మ్యూజిక్ స్టోర్‌ని ప్రపంచానికి స్టీవ్ జాబ్స్ పరిచయం చేయడం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా చూసినట్లేతే విప్లవాత్మక మార్పులు మ్యూజిక్ రంగంలో చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా స్టీవ్ జాబ్స్‌కి మ్యూజిక్ లవర్‌గా తరతరాల వరకు నిలిచిపోతాడని అన్నారు. బాబ్ డైలెన్ లాంటి ఫోక్ సింగర్స్ జాబ్స్ చేసిన సేవలను ఇటీవల ఓ ఫంక్షన్‌లో కొనియాడిన సంగతి తెలిసిందే.

వీటితో పాటు గ్రామీ అఫీసియల్స్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ ఈ సంవత్సరం ఎవరికి ప్రకటించారో దాని వివరాలను కూడా ప్రకటించారు. ఫిబ్రవరి 11వ తారీఘున లాస్ ఏంజిల్స్‌లో అంగరంగ వైభవంగా ఈ గ్రామీ అవార్డుల ఉత్సవాన్ని కమిటీ మెంబర్స్ చేయనున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot