స్టీవ్‌జాబ్స్ రిజైన్, ఆపిల్ కొత్త సిఈవోగా టిమ్ కుక్

Posted By: Super

స్టీవ్‌జాబ్స్ రిజైన్, ఆపిల్ కొత్త సిఈవోగా టిమ్ కుక్

న్యూయార్క్: ప్రపంచం మొత్తం మీద తన కంపెనీ టెక్నాలజీ రంగంలో నెంబర్ వన్‌గా నిలిపిన్ యాపిల్ సిఈవో స్టీవ్ జాబ్స్ చివరకు కంపెనీ నుండి సిఈవో పదవి భాద్యతల నుండి వైదోలగినట్లు సమాచారం. ఈ విషయాన్ని యాపిల్ కంపెనీ బోర్డ్ డైరెక్టర్స్ మీటింగ్ తెలియజేశారు. ఈ సందర్బంలో స్టీవ్ జాబ్స్ మాట్లాడుతూ మీ అందరికి తెలియజేసేది ఏమిటంటే యాపిల్ కంపెనీ సిఈవోగా మాత్రమే నేను పదవి భాద్యతలనుండి తప్పుకోవడం జరుగుతుంది. ఐతే బోర్డ్ డైరెక్టర్స్ కొరిక మేరకు ఛైర్మన్ ఆఫ్ ద బోర్డ్ డైరెక్టర్‌తో పాటు యాపిల్ కంపెనీ ఉద్యోగి కొనసాగుతానని స్పష్టం చేశారు.

ప్రస్తుతం యాపిల్ కంపెనీ కో ఫౌండర్ భాద్యతలను నిర్వర్తిస్తున్న టిమ్ కుక్ యాపిల్ కంపెనీ సిఈవో భాద్యతలను నిర్వర్తించనున్నట్లు బోర్డ్ మీటింగ్‌లో తెలిపారు. స్టీవ్ జాబ్స్ మాట్లాడుతూ నా జీవితంలో యాపిల్ కంపెనీ ఎన్నో ఉద్యోగభరితమైన క్షణాలను అనుభవించడం జరిగిందన్నారు. నేను ఎప్పటి నుండో చెబుతున్నట్లు నాజీవితంలో యాపిల్ సిఈవో భాద్యతల నుండి తప్పుకునే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశానో, ఆరోజు రానే వచ్చిందని అన్నారు. యాపిల్ కంపెనీకి రాబోయే రోజుల్లో మరింత ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. రాబోయే రోజుల్లో యాపిల్‌లో నా కొత్త రోల్ ఇంకా ఆశాజనకంగా ఉంటుంది భావిస్తున్నానని అన్నారు.

నాజీవితంలో యాపిల్ కంపెనీలో ఎంతో మంచి స్నేహితులను సంపాదించుకున్నానని తెలియిజేశారు. ఇంత కాలం పనిలో నాతోపాటు కలసి నన్ను ఇంత వరకు నడిపించి, నా సక్సెస్‌లో భాగమైన అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. 55 సంవత్సరాలు వయసు కలిగిన స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీ టెక్నాలజీ రంగంలో మొట్టమొదటి స్దానానికి రావడానికి చేసిన అవరళ కృషి అంతా ఇంతా కాదని అన్నారు. యాపిల్‌లో స్టీవ్ జాబ్స్ సీఈవో గా పనిచేసిన రోజులను ఒక ఎరాగా అభివర్ణిస్తున్నారు. స్టీవ్ జాబ్స్ లీడర్ షిప్‌లో యాపిల్ ఎంతో ఎత్తుకి ఎదగడం జరిగిందని అక్కడున్న వారు అభివర్ణించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot