స్టీవ్ జాబ్స్: సీక్రెట్స్ ఆఫ్ లైఫ్ డాక్యుమెంటరీ

Posted By: Super

స్టీవ్ జాబ్స్: సీక్రెట్స్ ఆఫ్ లైఫ్ డాక్యుమెంటరీ

 

టెక్నాలజీ రంగంలో ఆపిల్ కంపెనీని అత్యున్నత శిఖరాలకు చేర్చిన వ్యక్తిగా చరిత్రలో నిలిపోయిన వ్యక్తి 'స్టీన్ జాబ్స్'. అలాంటి స్టీవ్ జాబ్స్‌ 1994వ సంవత్సరంలో ప్రపంచాన్ని టెక్నాలజీతో ఎలా ఆవిష్కరించవచ్చో తెలిపే వీడియోని గతంలో వన్ ఇండియా పాఠకుల కోసం ప్రత్యేకంగా అందించాం. ఐతే ఇప్పుడు కొత్తగా 'స్టీవ్ జాబ్స్: సీక్రెట్స్ ఆఫ్ లైఫ్' పేరుతో శాంతా క్లారా హిస్టారికల్ అసోషియేషన్ 30నిమిషాల పాటు నిడివి గల ఓ వీడియోని $9.99లకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

స్టీవ్ జాబ్స్‌కు చెందిన ఈ ఇంటర్యూ 'Silicon Valley: A 100 Year Renaissance' డాక్యుమెంటరీలో భాగంగా రూపొందించారు. స్టీవ్ జాబ్స్‌కు చెందిన ఈ వీడియో ఇప్పడు మార్కెట్లో స్టాండర్డ్‌ఎలోన్ వీడియో ఉత్పత్తిగా అవతరించింది. ఈ ఫిల్మ్ పూటేజ్‌లో ఆపిల్ కో-ఫౌండర్ స్టీవ్ వోన్జిక్, అటారీ ఫౌండర్ నోలన్ బుషనెల్, సన్ మైక్రోసాప్ట్ సిస్టమ్స్ ఫౌండర్ స్కాట్ మెక్‌నీలే, ఓరాకిల్ ఫౌండర్ ల్యారీ ఎల్లిసన్‌లతో పాటు సిలికాన్ వ్యాలీలో ఉన్న పలువురు ప్రముఖులను ఉంచారు.

ఈ వీడియోని వన్ పాఠకులు కూడా వీక్షించాలనుకుంటే ఈ లింక్‌ని http://www.stevejobssecretsoflife.org/home మీ బ్రౌజర్‌లో పేస్ట్ చేసి ఎంటర్ నొక్కండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot