ఛారిటీ కోసం ట్వీట్స్ అన్ని పుస్తక రూపంలో ఫన్నీగా...

Posted By: Super

ఛారిటీ కోసం ట్వీట్స్ అన్ని పుస్తక రూపంలో ఫన్నీగా...

సోషల్ మీడియా ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతుంది. అదెలాగా అని అనుకుంటున్నారా.. హాలీవుడ్ హీరో, కమెడియన్ అయిన స్టీవ్ మార్టిన్ తన ట్విట్టర్‌లో అభిమానుల కొసం ట్వీట్ చేసిన ట్వీట్స్ అన్నింటిని కూడా ఓ పుస్తక రూపంలో అచ్చు వేయించనున్నారు. ఈ పుస్తకం ద్వారా వచ్చిన ఆదాయం మొత్తాన్ని కూడా ఓ ఛారిటీకి విరాళంగా ఇవ్వనున్నారు. తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా స్టీవ్ మార్టిన్ ఇప్పటి వరకు ఎన్ని ట్వీట్స్ ఐతే చేశారో, అన్నింటిలో ఉన్న చెత్తను తీసివేసి(ఎడిట్ చేసి) అర్దం అయ్యేవిధంగా ఓ పుస్తకంగా తయారు చేయనున్నారు.

ఈ పుస్తకానికి 'The Ten, Make That Nine Habits, of Very Organized People. Make That Ten' పేరుని ప్రకటించడం జరిగింది. ఈ పుస్తకాన్ని 2012లో గ్రాండ్ సెంట్రల్ పబ్లిషింగ్ ద్వారా విడుదల చేయనున్నారు. ఈ పుస్తకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని స్టీవ్ మార్టిన్ ఏ ఛారిటీకి ఇవ్వనున్న విషయాన్ని మాత్రం తెలియజేయ లేదు. ఈ విషయాన్ని పుస్తకం విడుదల చేసే రోజున ప్రకటించనున్నారని సమాచారం.

66సంవత్సరాలు వయసు కలిగిన స్టీవ్ మార్టిన్ చేపట్టిన ఈ కార్యక్రమానికి అభిమానుల నుండి పెద్దఎత్తున స్పందన వస్తుంది. స్టీవ్ మార్టిన్ ట్వీట్స్‌కి ఫన్ కలిపి పుస్తకం ద్వారా తయారు చేయడంపై అభిమానులలో ఒకరైన జాన్ రబిత్ అనే వ్యక్తి స్టీవ్ మార్టిన్‌ని ఇలా ట్వీట్ చేశారు. మీరు పుస్తకంలో ట్వీట్స్ ఫన్నీగా ఉంటాయని చెబుతున్నారు. మీరు ట్వీట్ చేసిన ట్వీట్సా లేకా మీ ట్వీట్స్‌కి మేము ఇచ్చిన సమాధానాలా అని ప్రశ్నించగా, దీనికి సమాధానంగా స్టీవ్ మార్టిన్ దీనికి అదే ఇక్కడ సీక్రెట్ అని ట్వీట్ ద్వారా ట్వీట్ చేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot