Home
News

పేరుకే 4జీ వేగంలో మాత్రం లేజీ!

ఇండియన్ టెలికం మార్కెట్లోకి పెను సంచలనంలా దూసుకొచ్చిన 4వ తరం (4జీ) మొబైల్ నెట్‌వర్క్ ఇప్పుడు అదే స్థాయిలో బఫరింగ్ సమస్యలను ఎదుర్కుంటోంది.

By Gizbot Bureau

ఇండియన్ టెలికం మార్కెట్లోకి పెను సంచలనంలా దూసుకొచ్చిన 4వ తరం (4జీ) మొబైల్ నెట్‌వర్క్ ఇప్పుడు అదే స్థాయిలో బఫరింగ్ సమస్యలను ఎదుర్కుంటోంది. గత ఏడాది కాలంగా భారత్‌లో నమోదవుతోన్న సగటు 4జీ ఎల్టీఈ స్పీడ్‌ను గమనించినట్లయితే 6.1ఎంబీపీఎస్‌గా ఉంది. ఈ వేగాన్ని గ్లోబల్ యావరేజ్ స్పీడ్ అయిన 17 ఎంబీపీఎస్‌తో కంపేర్ చేసి చూసినట్లయితే ఇంచుమించుగా మూడు రెట్లు తక్కువుగా ఉంది. 5జీ లాంచ్‌కు సమయం సమీపిస్తున్నప్పటికి పరిస్థితిలో ఏ విధమైన మార్పు రాకపోవటమనేది కొంత కలవరపాటుకు గురిచేస్తోంది.

100 ఎంబీపీఎస్ వేగంతో హోమ్ బ్రాడ్‌బ్యాండ్..

100 ఎంబీపీఎస్ వేగంతో హోమ్ బ్రాడ్‌బ్యాండ్..

ప్రస్తత మార్కెట్‌ను మనం పరిశీలించినట్లయితే జియో, ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ వంటి సంస్థలు పోటాపోటీగా 4జీ నెట్‌వర్క్‌ను ఆఫర్ చేస్తన్నాయి. మరోవైపు 5జీ నెట్‌‍వర్క్ పైనా విస్తృత చర్చలు జరుపుతున్నాయి. ఈ రేసులో కొంచం ముందు నడుస్తోన్న జియో తన ఫైబర్ ఆధారిత హోమ్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను త్వరలో 100 ఎంబీపీఎస్ వేగంతో అందించగలుగుతామని చెబుతోంది.

 

 

పొరుగు దేశాల కంటే చాలా తక్కువు..

పొరుగు దేశాల కంటే చాలా తక్కువు..

భారత్‌లో 4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌లకు సంబంధించిన యూకేకు చెందిన ప్రముఖ స్పీడ్ టెస్టర్ ఓపెన్‌సిగ్నల్ (OpenSignal) పలు ఆసక్తకిర వివరాలను వెల్లడించింది. పొరుగు దేశాలైన శ్రీలంక (13.95 ఎంబీపీఎస్, పాకిస్తాన్ (13.56ఎంబీపీఎస్), మయన్మార్ (15.56 ఎంబీపీఎస్)లతో పోలిస్తే చాలా తక్కువుగా ఉంది. డెవలపుడ్ మార్కెట్స్ అయిన యూఎస్, యూకే ఇంకా జపాన్‌లలో 4జీ డౌన్‌లోడ్ స్పీడ్స్ 16.31ఎంబీపీఎస్, 23.11ఎంబీపీఎస్, 25.39ఎంబీపీఎస్‍‌లుగా ఉన్నాయి.

భారత్‌కు 109వ స్థానం..

భారత్‌కు 109వ స్థానం..

యూఎస్ డేటా టెస్టర్ ఓక్లా రివీల్ చేసిన వివరాల ప్రకారం ఓవరాల్ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్స్ ర్యాంకింగ్స్‌లో భారత్ 9.12 ఎంబీపీఎస్ యావరేజ్ డౌన్‌లోడ్ స్పీడుతో 109వ ర్యాంకుకు పడిపోయింది. ఇది గ్లోబల్ యావరేజ్ అయిన 23.54 ఎంబీపీఎస్‌తో పోలిస్తే చాలా తక్కువు. ఈ లిస్టులో మొత్తం 124 దేశాలకు చెందిన ఇంటర్నెట్ స్పీడ్‌లను పొందుపరిచారు.

 

 

కొత్త స్మార్ట్‌ఫోన్ కనెక్షన్‌ల సంఖ్య పెరిగిపోతుండటంతో..

కొత్త స్మార్ట్‌ఫోన్ కనెక్షన్‌ల సంఖ్య పెరిగిపోతుండటంతో..

భారత్‌లో నెలకున్న పరిస్థితుల పై ఓపెన్‌సిగ్నల్ సంస్థ విశ్లేషకులు పీటర్‌ బాయ్‌ల్యాండ్ స్పందిస్తూ కొత్త స్మార్ట్‌ఫోన్ కనెక్షన్‌ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటం కారణంగానే మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోతుందని ఆయన అంటున్నారు. ఈ పరిస్థితుల పై ఓక్లా అధికార ప్రతినిధి అడ్రెయిన్ బ్లమ్ స్పందిస్తూ జనాభా పెరుగుదల కూడా స్లో మొబైల్ ఇంటర్నెట్ కు ఓ కారణమని అంటున్నారు.

Best Mobiles in India

English summary
4G is the talk of the town, but buffering is still a reality in India! The average 4G LTE data speed in India has remained static for more than a year — at about 6.1Mbps — which is almost a third of the global average of about 17 Mbps...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X