Home
News

డబ్బులు ఊరికే రావు.. జియో, ఎయిర్‌టెల్, ఇతర కంపెనీల ప్లాన్స్‌లో బెస్ట్ డీల్స్‌ ఇవే..

Best recharge plan: రీఛార్జ్ చేసుకోవాలని చూస్తున్నారా.. బెస్ట్ ప్లాన్ కోసం వెతుకుతున్నారా.. అయితే మీరు సరైన చోటుకే వచ్చారు. సరైన ప్లాన్ ఎంచుకుంటే మీకు హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ఫ్రీ యాక్సెస్ లభిస్తుంది. డబ్బులూ సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది మొబైల్‌లోనే ఓటీటీ కంటెంట్ చూస్తున్నారు. అందుకే టెలికాం కంపెనీలు కూడా స్ట్రీమింగ్ బెనిఫిట్స్‌తో రీఛార్జ్ ప్లాన్స్‌ను తీసుకొస్తున్నాయి.

జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, BSNL.. ఇలా చాలా కంపెనీలు రకరకాల ప్లాన్స్‌తో మీ ముందు ఉన్నాయి. మరి మీకోసం ఏది బెస్ట్ ప్లానో తెలుసుకోవాలంటే ఈ సులభమైన పోలిక చూద్దాం. అన్ని టెలికాం కంపెనీలలో బెస్ట్ ప్లాన్స్ పరిగణలోకి తీసుకుని ఈ సమాచారం అందిస్తున్నాం.

Stop Overpaying  Here the BEST Deals on Jio vs Airtel Plans Before You Recharge

* ఎయిర్‌టెల్ రూ.979 ప్లాన్

ఈ ప్లాన్ ధర రూ.979 కానీ బెనిఫిట్స్ మాత్రం అదిరిపోతాయి. రోజుకి 2GB డేటా, రోజుకి 100 SMSలు, అన్‌లిమిటెడ్ కాల్స్.. అన్నీ కలిపి 84 రోజుల పాటు వస్తాయి. అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా ఈ ప్లాన్‌లో బాగా అందిస్తున్నారు కాబట్టి ఇంటర్నెట్ డేటాకు లోటుండదు.

ఇక ఈ ప్లాన్ కింద ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లేకు ఫ్రీ యాక్సెస్ లభిస్తుంది కాబట్టి అందులోని సోనీలీవ్, లయన్స్‌గేట్ ప్లే లాంటి 22కు పైగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి యాక్సెస్ వస్తుంది. ఇందులో చాలా సినిమాలు వెబ్ సిరీస్ లు ఉచితంగా చూసేయవచ్చు. ఓటీటీ లవర్లకు ఈ ప్లాన్ మంచి ఆప్షన్.

* Vi రూ.979 ప్లాన్

ఈ వొడాఫోన్ ఐడియా ప్లాన్ కూడా రూ.979 ధరకే వస్తుంది. ఇందులో కూడా రోజుకి 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకి 100 SMSలు ఉంటాయి. కానీ ఇందులో ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. అదే వీకెండ్ డేటా రోల్‌ఓవర్. అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు మిగిల్చిన డేటాని శని, ఆదివారాల్లో వాడుకోవచ్చు.

అంతేకాదు, రాత్రి 12 AM నుంచి ఉదయం 6 AM వరకు అన్‌లిమిటెడ్ డేటా ఫ్రీ! ఓటీటీ విషయానికొస్తే.. ViMTV ద్వారా ZEE5, సోనీలీవ్ లాంటి 16కు పైగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి యాక్సెస్ ఇస్తారు. ఎయిర్‌టెల్ ప్లాన్‌లాగే ఉన్నా, ఇందులో అన్‌లిమిటెడ్ 5G డేటా మాత్రం లేదు.

* జియో రూ.859 ప్లాన్

జియో ప్లాన్ వీటితో పోలిస్తే కాస్త తక్కువ ధరకే వస్తుంది. ఈ ప్లాన్ ధర కేవలం రూ.859లే. ఇది కూడా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకి 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకి 100 SMSలు ఇస్తారు. ముఖ్యంగా 5G యూజర్స్‌కి అన్‌లిమిటెడ్ 5G యాక్సెస్ కూడా ఉంది.

ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకున్న వాళ్లు జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ యాప్స్‌ని ఫ్రీగా వాడుకోవచ్చు. ప్రీమియం ఓటీటీ యాప్స్ లేకపోయినా, జియోసినిమాలో మాత్రం మంచి కంటెంట్ ఉంటుంది. ముఖ్యంగా వరల్డ్స్ బెస్ట్ టీవీ సిరీస్ అయిన గేమ్ ఆఫ్ త్రోన్స్ కూడా తెలుగులోనే చూడొచ్చు.

* BSNL రూ.485 ప్లాన్

BSNL ప్లాన్ అన్నిటికంటే చీపెస్ట్. ఇది జస్ట్ రూ.485. ఇందులో రోజుకి 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకి 100 SMSలు ఇస్తారు. వాలిడిటీ మాత్రం 80 రోజులు. కానీ ఇందులో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ యాక్సెస్ ఏమీ ఉండదు. సింపుల్‌గా కాల్స్, డేటా కావాలనుకునే వాళ్లకి ఇది బెస్ట్ ఛాయిస్.

* మరి ఏ ప్లాన్ బెస్ట్..

బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ కావాలి, ఎక్కువ రోజులు వాలిడిటీ ఉండాలనుకుంటే జియో రూ.859 ప్లాన్ సూపర్. ఇందులో రోజుకి 2GB డేటా, అన్‌లిమిటెడ్ 5G, జియోసినిమా యాక్సెస్ కూడా ఉంది. ఒకవేళ ఓటీటీ కంటెంట్ లవర్ అయితే ఎయిర్‌టెల్ రూ.979 ప్లాన్ బెస్ట్. ఇందులో సోనీలీవ్, లయన్స్‌గేట్ ప్లే లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు యాక్సెస్ ఉంది.

వీకెండ్ డేటా రోల్‌ఓవర్, నైట్ అన్‌లిమిటెడ్ డేటా కావాలనుకునే వాళ్లకి Vi రూ.979 ప్లాన్ బాగుంటుంది. ఇందులో ZEE5, SonyLIV యాక్సెస్ కూడా ఉంది. ఇక బేసిక్ డేటా, కాల్స్ మాత్రమే కావాలంటే బీఎస్ఎన్ఎల్ రూ.485 ప్లాన్ చీపెస్ట్ ఆప్షన్. కానీ ఇందులో ఓటీటీ బెనిఫిట్స్ మాత్రం ఉండవు.

More from GizBot

Best Mobiles in India

English summary
Compare Jio, Vi and Airtel recharge plans to find the best deal. Discover plans with data, OTT, and calling benefits to avoid overpaying and save money on your next recharge.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X