వై-ఫై మ్యూజిక్ స్ట్రీమింగ్

వైర్ల సహాయం లేకుండా హోమ్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసుకుని మ్యూజిక్‌ను స్ట్రీమ్ చేసేకునేందుకు వీలుగా యాపిల్ కంపెనీ 2004లో ‘ఎక్స్‌ట్రీమ్ ఎక్స్‌ప్రెస్' పేరుతో మొట్టమొదటి ఆడియో స్ట్రీమింగ్ డివైస్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఆ తరువాత అనేక కంపెనీలు బ్లూటూత్ కనెక్టెట్ స్పీకర్లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. బ్లూటూత్ సౌకర్యం ఉన్న అన్ని రకాల డివైస్‌లకు ఈ స్పీకర్లను కనెక్ట్ చేసుకోవచ్చు.

అయితే వీటి పరిధి 30 నుంచి 40 అడుగులు మించి ఉండుదు. వైర్‌లెస్ ఆడియా స్ట్రీమింగ్ డివైస్‌ల సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తూ తాజాగా అందుబాటులోకి వచ్చింది ‘రాకీ మ్యూజిక్ స్ట్రీమింగ్ డివైజ్'. ఈ స్పీకర్లను వై-ఫై ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆండ్రాయిడ్ అప్లికేషన్ సాయంతో మీ టాబ్లెట్ లేదా స్మార్ట్‌ఫోన్‌కు ‘రాకీ మ్యూజిక్ స్ట్రీమింగ్ డివైజ్'ను కనెక్ట్ చేసుకోవచ్చు.

ఈ స్పీకర్లకు పరిధింటూ ఉండదు. వై-ఫై ద్వారా కనెక్ట్ చేసుకుని ఇంట్లోని ఏ గదిలలోనైనా మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు. రాకీ మ్యూజిక్ స్ట్రీమింగ్ డివైజ్‌లోని బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 4 గంటల బ్యాకప్ నిస్తుంది.
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి


Click it and Unblock the Notifications








