Home
News

Google Payలో ఆటోపేను ఇలా డిసేబుల్ చేసుకోండి.. అనవసరమైన ఛార్జీలకు చెక్ పెట్టండి!

By Ram Kumar

ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్స్‌లో గూగుల్ పే (GPay) ముందు వరుసలో ఉంటుంది. అందులోని ఒక సూపర్ ఫీచర్ మీ పనులను చాలా సులువు చేస్తుంది. అదే ఆటోపే! దీని ద్వారా యుటిలిటీ బిల్లులు, మొబైల్ రీఛార్జ్‌లు, లోన్ ఈఎంఐలు, ఇంకా నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ లాంటి OTT ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిప్షన్‌ల వంటివి నెలనెలా ఆటోమేటిక్‌గా పే అయిపోతాయి.

అంటే, మీరు కట్టాల్సిన తేదీ గుర్తు పెట్టుకుని టెన్షన్ పడాల్సిన పని లేదు. టైమ్‌కి పేమెంట్ జరిగిపోతుంది, ఫైన్లు పడవు, సర్వీసులు ఆగవు.

Stop Unwanted Charges  Here s How to Disable Autopay on Google Pay

ఆటోపే సెటప్ చేసేటప్పుడు, మీరు మీ UPI పిన్ ఎంటర్ చేసి దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఇది సర్వీస్ ప్రొవైడర్ వెబ్‌సైట్‌లోకి వెళ్లగానే, డైరెక్ట్‌గా గూగుల్ పేలోకి తీసుకెళ్తుంది. ముఖ్యంగా మీ బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు సరిపడా ఉంచుకోవాలి. అంతే, మీరు సెలెక్ట్ చేసుకున్న టైమ్‌కి డబ్బులు ఆటోమేటిక్‌గా కట్ అయిపోతాయి.

* ఆటోపే డిసేబుల్

ఒకవేళ మీకు ఏదైనా సర్వీసు కోసం ఆటోపే ఆపేయాలి అనిపిస్తే, దాన్ని ఈజీగా డిసేబుల్ చేసుకోవచ్చు. గూగుల్ పేలో ఆటోపే డిసేబుల్ చేయడం ఎలాగో స్టెప్ బై స్టెప్ చూద్దాం రండి.

స్టెప్ 1: ఫోన్‌లో Google Pay యాప్ ఓపెన్ చేసి, అవసరమైతే మీ పిన్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.

స్టెప్ 2: టాప్ రైడ్ కారణాల్లో కనిపించే మీ ప్రొఫైల్ పిక్చర్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్ 3: అక్కడ మీకు "ఆటోపే" అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.

స్టెప్ 4: యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్స్ చూడాలి. మీరు ఆటోపే పెట్టుకున్న అన్ని సర్వీసుల లిస్ట్ అక్కడ కనిపిస్తుంది.

స్టెప్ 5: ఏ ఆటోపే సబ్‌స్క్రిప్షన్‌ను మీరు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేయాలి.

స్టెప్ 6: మీకు "పాజ్ ఆటోపే" లేదా "క్యాన్సిల్ ఆటోపే" అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవాలి.

స్టెప్ 7: చివరగా మీ UPI పిన్ ఎంటర్ చేసి క్యాన్సిలేషన్ కన్ఫర్మ్ చేయండి. అంతే!

ఆటోపే డిసేబుల్ చేశాక, ఆ సర్వీసుకు పేమెంట్స్ ఆగిపోతాయి. కానీ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి.

ఒకవేళ మీరు ఆటోపే క్యాన్సిల్ చేసింది నెట్‌ఫ్లిక్స్‌ లేదా స్పాటిఫై లాంటి OTT సబ్‌స్క్రిప్షన్ కోసం అయితే, మీ కరెంట్ బిల్లింగ్ పీరియడ్ అయిపోయే వరకు (నెల రోజులు అనుకోండి) మీరు ఆ సర్వీసును వాడుకోవచ్చు. కొన్ని సర్వీసులు మాత్రం మీరు ఆటోపే తీసేయగానే వెంటనే ఆగిపోతాయి.

* ఆటోపేను మేనేజ్ చేసుకోవడం వల్ల ఉపయోగాలు

ఆటోపే డిసేబుల్ చేసుకోవడం వల్ల అనవసరమైన ఛార్జీలు పడకుండా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మీరు ఇకపై వాడని సర్వీసులకు డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు. పేమెంట్స్‌ను మీ కంట్రోల్ లో ఉంచుకుంటే, మీ డబ్బును చక్కగా మేనేజ్ చేసుకోవచ్చు, వాడుకలో లేని సబ్‌స్క్రిప్షన్లకు డబ్బు వృధా కాకుండా ఉంటుంది.

మొత్తమ్మీద ఆటోపే అనేది టైమ్ సేవ్ చేయడానికి, లేట్ ఫీజులు తప్పించుకోవడానికి చాలా ఉపయోగకరమైన ఫీచర్ అయినా, అవసరమైనప్పుడు దాన్ని ఎలా ఆపాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

More from GizBot

Best Mobiles in India

English summary
Learn how to disable Google Pay's Autopay feature to stop unwanted charges. Go to your profile, select "Autopay," choose the service, and cancel or pause.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X