కొత్త టీవీ కొనడంలో కన్ఫ్యూజ్ అవుతున్నారా? శామ్‌సంగ్, ఎల్‌జీ, సోనీ, షియోమీలలో బెస్ట్ ఆప్షన్స్ మీకోసమే!
Best 32-inch TVs: పెద్ద టీవీలు ట్రెండింగ్‌లో ఉన్నా, 32-అంగుళాల టీవీలకు మాత్రం ఇండియాలో ఇంకా డిమాండ్ తగ్గలేదు. ఎందుకంటే అవి తక్కువ ధరలో ఉంటాయి, కాంపాక్ట్‌గా ఉంటాయి. రోజువారీ యూసేజ్ కోసం పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. శామ్‌సంగ్, LG, సోనీ, షియోమీ లాంటి టాప్ బ్రాండ్స్ కూడా 32-అంగుళాల టీవీ మోడల్స్‌ను కొత్త ఫీచర్స్, టెక్నాలజీతో అప్‌డేట్ చేస్తూనే ఉన్నాయి. ఈ బ్రాండ్స్‌లో బెస్ట్ 32-అంగుళాల టీవీ ఆప్షన్స్ కొన్ని ఉన్నాయి. అవేవో చూద్దాం.
* సోనీ KD-32W835
సోనీ టీవీ ఫుల్ HD రిజల్యూషన్‌తో వస్తుంది. చాలా తక్కువ 32-అంగుళాల టీవీల్లో మాత్రమే ఈ ఫీచర్ ఉంటుంది. అందుకే పిక్చర్ క్వాలిటీ షార్ప్‌గా, క్లియర్‌గా ఉంటుంది. సోనీ X-రియాలిటీ ప్రో టెక్నాలజీతో, లో-క్వాలిటీ వీడియోలను అప్‌స్కేల్ చేసి చూపిస్తుంది. ఫాస్ట్ మూవింగ్ సీన్స్‌లో పిక్చర్ బ్లర్ అవ్వకుండా మోషన్‌ఫ్లో XR 200 ఫీచర్ ఉంది.

* LG LQ643
LG LQ643 బడ్జెట్ ఫ్రెండ్లీ 32-అంగుళాల స్మార్ట్ టీవీ. ఇది తక్కువ ధరలో లభించే టీవీ అయినా, ఫీచర్స్ మాత్రం అదిరిపోతాయి. HD డిస్‌ప్లేతో ఇది మంచి పిక్చర్ క్వాలిటీనిస్తుంది. LG వెబ్OS ఉండటంతో టీవీ రిమోట్ వాడేటప్పుడు ల్యాగ్స్ ఉండవు. యాక్టివ్ HDR ఫీచర్ ఉండటంతో, సపోర్టెడ్ కంటెంట్‌లో బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్ అదిరిపోతాయి.
కలర్స్‌ని మరింత నిండుగా, చూడముచ్చటగా చేసేందుకు డైనమిక్ కలర్ ఎన్‌హాన్సర్ ఉంది. తక్కువ ధరలో మంచి ఫీచర్స్ కావాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్ ఆప్షన్. ఆన్‌లైన్ వెబ్‌సైట్స్‌లో కూడా ఈటీవీ కొనుగోలు చేయవచ్చు. ఎక్కడ ధర తక్కువ ఉందో అక్కడ కొనడం ఉత్తమం.
* శామ్‌సంగ్ T4380 స్మార్ట్ HD టీవీ
శామ్‌సంగ్ T4380 స్మార్ట్ HD టీవీ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. HD రిజల్యూషన్‌తో పిక్చర్ క్వాలిటీ కూడా బాగుంటుంది. శామ్‌సంగ్ స్మార్ట్ హబ్ ఉండటంతో కావాల్సిన స్ట్రీమింగ్ యాప్స్ అన్నీ ఒకేచోట ఉంటాయి. ఇందులోని PurColor టెక్నాలజీ పిక్చర్‌ని మరింత రియలిస్టిక్‌గా, కలర్‌ఫుల్‌గా చూపిస్తుంది. డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్ క్వాలిటీతో ఆడియో అదిరిపోతుంది.
* షియోమీ రెడ్‌మీ 32-అంగుళాల ఫైర్ TV
షియోమీ రెడ్‌మీ ఫైర్ TV అమెజాన్ ఫైర్ OSతో వస్తుంది. HD-రెడీ డిస్‌ప్లేతో షార్ప్‌నెస్ కూడా బాగుంటుంది. షియోమీ వివిడ్ పిక్చర్ ఇంజన్ టెక్నాలజీతో కలర్స్, కాంట్రాస్ట్ అదిరిపోతాయి. 20W స్పీకర్స్‌తో పాటు డాల్బీ ఆడియో, DTS వర్చువల్:X ఉండటంతో సౌండ్ కూడా సూపర్ ఉంటుంది.
అలెక్సా వాయిస్ రిమోట్‌తో టీవీని, స్మార్ట్ హోమ్ డివైజ్‌లను వాయిస్ కమాండ్స్‌తో కంట్రోల్ చేయొచ్చు. అమెజాన్ ఫైర్ OS ఇష్టపడేవాళ్లకి, వాయిస్ కంట్రోల్ కావాలనుకునేవాళ్లకి ఇది గుడ్ ఛాయిస్. ఇది కూడా ఆన్‌లైన్ వెబ్‌సైట్స్‌లో ఉంది. ఆసక్తి ఉంటే ఒకసారి చెక్ చేయవచ్చు.
* LG WebOS TV (32LR686BPSA)
LG 32LR686BPSA మరో ఫుల్ HD ఆప్షన్. నార్మల్ HD టీవీల కంటే ఇది చాలా షార్ప్‌గా ఉంటుంది. WebOSతో స్మూత్ నావిగేషన్ ఉంటుంది. ఆల్ఫా 5 AI ప్రాసెసర్ Gen6 ఉండటంతో పెర్ఫార్మెన్స్, పిక్చర్ క్వాలిటీ రెండూ ఇంప్రూవ్ అవుతాయి.
HDR10 ప్రో ఫీచర్‌తో SDR, HDR10 కంటెంట్ రెండిటిలోనూ బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్ అదిరిపోతాయి. గేమింగ్ లవర్స్ కోసం గేమ్ ఆప్టిమైజర్, గేమ్ డాష్‌బోర్డ్ ఉన్నాయి. వీటితో గేమింగ్ సెట్టింగ్స్‌ను ఫైన్-ట్యూన్ చేసుకోవచ్చు. ఫుల్ HD టీవీ విత్ బెటర్ గేమింగ్ ఫీచర్స్, HDR సపోర్ట్ కావాలంటే ఇది బెస్ట్ ఛాయిస్.


Click it and Unblock the Notifications








