Home
News

రహస్య కెమెరాలతో సహ విద్యార్థినుల నగ్న వీడియోలు చిత్రీకరించిన యువకుడు

ఈ రోజుల్లో మానువత విలువలు మర్చిపోతున్నారు అనడానికి మరొక ఉదాహరణ . బెంగుళూరు లో చదువుకునే ఓ యువకుడు తన సహ విద్యార్థినుల నగ్న వీడియోలను దొంగచాటుగా చిత్రీకరించి వాటిని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసాడు .

By Anil

ఈ రోజుల్లో మానువత విలువలు మర్చిపోతున్నారు అనడానికి మరొక ఉదాహరణ . బెంగుళూరు లో చదువుకునే ఓ యువకుడు తన సహ విద్యార్థినుల నగ్న వీడియోలను దొంగచాటుగా చిత్రీకరించి వాటిని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసాడు . దీనికి అతని ప్రియురాలా సహాయం చేయడం గమన్హారం .ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే...

తంజావూరు ప్రాంతానికి చెందిన సిద్ధార్థ....

తంజావూరు ప్రాంతానికి చెందిన సిద్ధార్థ....

తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు ప్రాంతానికి చెందిన సిద్ధార్థ (21) అనే యువకుడు బెంగళూరు నగరంలోని కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. సిద్ధార్థ తన ప్రియురాలి సాయంతో అమ్మాయిల బాత్రూంలలో రహస్య కెమెరాలు అమర్చి వారి నగ్నవీడియోలు తీశాడు

వాటిని ఫేస్‌బుక్‌లో....

వాటిని ఫేస్‌బుక్‌లో....

అనంతరం వాటిని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు. ముందుగా సిద్ధార్థ ప్రియురాలు తన నగ్న వీడియోలను తీసి సిద్ధార్థకు పంపించింది. తన నగ్న వీడియోలు బయటపెడతానంటూ బెదిరించి, ఆమెతోనే ఇతర సహ విద్యార్థినుల నగ్న వీడియోలు షూట్ చేయించాడు.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ అమ్మాయి ఫేస్ బుక్ లో....

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ అమ్మాయి ఫేస్ బుక్ లో....

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ అమ్మాయి ఫేస్ బుక్ లో తాను నగ్నంగా స్నానం చేస్తున్న వీడియోలు కనిపించడంతో అవాక్ అయింది . నకిలీ ఫేస్ బుక్ ఖాతాలతో పలువురు అమ్మాయిల నగ్న వీడియోలను సిద్ధార్థ పోస్టు చేశాడని వెల్లడైంది.

రంగం లోకి దిగిన పోలీసులు....

రంగం లోకి దిగిన పోలీసులు....

విద్యార్థినుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి సిద్ధార్థను అరెస్టు చేశారు. సిద్ధార్థతోపాటు అతని ప్రియురాలిని కూడ కళాశాల నుంచి సస్పెండ్ చేశారు. సిద్ధార్థ ప్రియురాలి స్నేహితురాళ్లతోపాటు ఓ అమ్మాయి తల్లి నగ్న వీడియోలు కూడా ఉన్నాయి. నగ్న వీడియోలు చూపించి తన కోరిక తీర్చాలని సిద్ధార్థ అమ్మాయిలను బెదిరించినట్లు పోలీసులు చెప్పారు.

తంజావూరు  నుంచి నగ్న వీడియోలు పోస్టు చేసినట్లు....

తంజావూరు నుంచి నగ్న వీడియోలు పోస్టు చేసినట్లు....

తంజావూరు పట్టణం నుంచి నగ్న వీడియోలు పోస్టు చేసినట్లు పోలీసులు గుర్తించారు.సిద్ధార్థపై ఐపీసీ 354 ఎ, 354 డి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అలాగే కెమెరాలతోపాటు అప్ లోడింగ్ చేసేందుకు వినియోగించిన డివైజ్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Best Mobiles in India

English summary
Student arrested for posting bathing videos of classmates.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X