ChatGPT ఉపయోగించి 94 శాతం మార్కులు సాధించిన విద్యార్థి.. అసలు ఏం చేశాడంటే
పూర్వం మనం ఏం నేర్చుకోవాలన్నా గురువుల ఆశ్రమానికి వెళ్లి అక్కడ వారికి సేవలు చేసి వారి నుంచి విద్యను నేర్చుకొనే వాళ్లం. కొంత కాలం గడిచాక విద్యాసంస్ధల్లో చేరి ఉపాధ్యాయుల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. అనంతరం కొద్ది కాలం గడిచాక లైబ్రరీల నుంచి విద్యార్థులు, ఇతరులు వారికి కావల్సిన సమాచారం సేకరించుకొనే వారు.
గూగుల్ అందుబాటులోకి వచ్చాక మనకు ఏం కావాలన్నా క్షణాల్లో ఇట్టే తెలుసుకోగలుగుతున్నాం. కానీ ఆర్టీఫిషియల్ ఇంజిలిజెన్స్ (AI)తో పనిచేసే ChatGPT అందుబాటులోకి వచ్చాక.. పరిస్థితిపూర్తిగా మారిపోయింది. ఎంతగా అంటే అస్సలు క్లాసులకే హాజరుకాని విద్యార్థిని టాపర్ గా నిలబెట్టేంతగా..

తాజాగా ChatGPT గురించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. తనకు ChatGPT ఏవిధంగా మేలుచేసిందో చెబుతూ ఓ విద్యార్థి సోషల్ మీడియా వేదిక అయిన Redditలో పంచుకున్నాడు. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేస్తున్నChatGPT ను ఉపయోగించుకొని పరీక్షలో 94 శాతం మార్కులు సాధించినట్లు సదరు విద్యార్థి తెలిపాడు. అయితే అది ఎలా సాధ్యమైయిందో వివరించాడు.
రెగ్యులర్ గా తరగతులకు వెళ్లలేదని, ఎక్కువ సమయం రూంలోనే గడిపేవాడినని, దాంతో పరీక్షల్లో ఎలా పాసవ్వాలో తెలియక భయం వేసిందని విద్యార్థి తెలిపాడు. దాంతో తక్కువ సమయంలో చదువుకొనేందుకు ChatGPT సాయం తీసుకున్నట్లు చెప్పాడు. పరీక్షల్లో పాసైయ్యేందుకు ముందుగా చాట్గ్ఫ్ట్ ద్వారా ఆ సెమిస్టర్ లో నుంచి ముఖ్యమైన పాఠ్యాంశాలను తెలుసుకున్నట్లు చెప్పాడు. తనకున్న సమయమంతా ఆ పాఠాలపైనే కేటాయించి, మంచి మార్కులు సాధించినట్లు తెలిపాడు.
సెమిస్టర్ లోని ముఖ్యమైన పాఠాలకు సంబంధించిన ట్రాన్సిస్క్రిప్ట్ ను ChatGPT ను ఇన్ పుట్ రూపంలో అందించేవాడు. ఆ పాఠాలకు సంబంధించి స్పష్టమైన విశ్లేషణ కోరేవాడు. అయితే Chatboat ఉన్న పరిధి కారణంగా విశ్లేషణ అందించేందుకు కొన్నిసార్లు చాలా సమయం పట్టేది. దాంతో తన వద్ద ఉన్న సమాచారాన్ని సులభ పద్ధతిలో చాట్ బోట్ కు ఇన్ పుట్ రూపంలో అందించాడు. దాంతో తనకు అవసరమైన సమాచారం పొందాడు.
ఇలా తొలిరోజు తనకొచ్చిన సమాచారాన్ని విశ్లేషించి, విద్యార్థికి అవసరమైన సమాచారం అందించింది. ఇలా సెమిస్టర్ మొత్తం సిలబస్ ను కేవలం 4-5 గంటల్లోనే చదివేశాడు. ఆ తర్వాత రోజు తమ సిలబస్ లోని కేవలం ముఖ్యమైన అంశాలను పాయింట్ల రూపంలో సూచించాలని ChatGPT కు ఇన్ పుట్ ఇచ్చారు. అనంతరం వచ్చిన సమాధానాలన్నీ కరెక్టా కాదా అని విశ్లేషించుకున్నాడు.


Click it and Unblock the Notifications








