Home
News

ఏపీ విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌లు!

By Sivanjaneyulu Bommu

డిజిటల్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రపోజల్‌తో ముందుకొచ్చింది. "ఆవిష్కరణ ప్రోత్సాహాలు" పేరుతో విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌లను పంపిణి చేసేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతోన్నట్లు సమాచారం.

 ఏపీ విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌లు!

(పాత చిత్రం)

Read More : వాయిస్ కాల్స్ చేసుకుంటే డేటా కట్ అవ్వదు.. క్లారిటీ ఇచ్చిన జియో

విద్యార్థుల్లో డిజిటల్ అక్షరాస్యతను మెరుగుపరచటంతో పాటు వారిలో సృజనాత్మక ఆలోచనలను వెలికి తీసేందుకు ఈ ప్రక్రియ దోహదపడగలదని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వలోని రాష్ట్ర కేబినేట్ భావిస్తోంది. ఈ ఉచిత స్మార్ట్‌ఫోన్‌ల పంపిణికి సంబంధించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవల్సి ఉంది.

Read More : చేతిలో పేలిన Jio LYF స్మార్ట్‌ఫోన్!

డిజిటల్ ఇండియా అంటే..?

డిజిటల్ ఇండియా అంటే..?

కమ్యూనికేషన్ ప్రపచంలో అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతికతను దేశనలుమూలలకు విస్తరింపజేసే లక్ష్యంతో ప్రారంభమైన ‘డిజిటల్ ఇండియా' దేశ చరిత్రలో ఓ ముందడుగు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ డిజిటల్ ఇండియా పథకం ద్వారా సుమారు రూ.లక్ష కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను సామాన్యుల చెంతకు చేర్చే ప్రయ్నతం చేస్తోంది.

#1

#1

దేశ అభివృద్థికి కీలకంగా భావిస్తోన్న ఈ-గవర్నెన్స్, ఈ - క్రాంతి, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ, బ్రాండ్ బ్యాండ్ హైవేలు, మొబైల్ కనెక్టువిటీ, పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ఇంకా ఐటీ ఆధారిత రంగాలకు ఊతమివ్వడమే ఈ ప్రథకం ప్రధాన లక్ష్యం. డిజిటల్ ఇండియా వారంలో భాగంగా ప్రారంభమైన పలు డిజిటల్ సేవల వివరాలను ఇప్పుడు చూద్దాం...

#2

#2

బంగారు ఆభరణాలను బ్యాంక్ లాకర్‌లలో భద్రపరుచుకుంటున్నట్లుగానే పాన్‌కార్డ్, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్ వంటి ముఖ్యమైన పత్రాలను కేంద్ర ప్రభుత్వం అందించే డిజిటల్ లాకర్‌లో సౌకర్యవంతంగా భద్రపరుచుకోవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారంగా ఈ వ్యవస్థను డిజైన్ చేసారు.

#3

#3

MyGov.in ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ప్రభుత్వ వ్యవహారలన్నీ సమన్వయరీతిలో పౌరులకు అందుబాటులోకి తీసుకువచ్చి సుపరిపాలనకు దోహదపడుతుంది.

#4

#4

స్వచ్చ్ భారత్ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకువెళ్లేందుకు ఈ యాప్ దోహదపడుతుంది.

#5

#5

ఈ - సంతకం ద్వారా పౌరులు తమ ఆధార్ కార్డ్‌లను ఉపయోగించుకుని డాక్యుమెంట్‌ల పై డిజిటల్ సంతకాలను చేయవచ్చు. తద్వారా డబ్బు, సమయం ఆదా అవటంతో పాటు మీ సంతకానికి చట్టబద్ధంగా గుర్తింపు ఇంకా గోప్యత లభిస్తుంది.

#6

#6

ఈ - ఆస్పత్రి పథకం ద్వారా పారదర్శకమైన ఆరోగ్య సేవలను దేశ పౌరులు పొందవచ్చు. ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్, రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, రక్తం అందుబాటు వంటి ముఖ్యమైన సేవలను ఈ - ఆస్పత్రి పథకం ద్వారా సామాన్య, మధ్యతరగతి ప్రజలు పొందవచ్చు.

#7

#7

జాతీయ ఉపకారవేతన పోర్టల్ చేకూరే ప్రయోజనాలు: ఈ పోర్టల్ ద్వారా ఉపకారవేతనాలకు అర్హులైన విద్యార్థులు కాలపరిమితిలోపు తమ అప్లికేషన్ లను పంపించటంతో పాటు తమ ఉపకార వేతనాల బదిలీ తీరును ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

#8

#8

ప్రభుత్వ సర్వీసులకు సంబంధించి అన్ని రికార్డులను డిజిటలైజ్ చేసే కార్యక్రమమే డిజిటైజ్ ఇండియా ప్లాట్‌ఫామ్.

#9

#9

దేశంలోని 2,50,000 గ్రామ పంచాయితీలకు హై స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించే లక్ష్యంతో భారత్ నెట్ ప్రోగ్రామ్ పనిచేస్తుంది. బీఎస్ఎన్ఎల్ తరువాతి జనరేషన్ నెట్‌వర్క్‌ను ప్రజలకు చేరువచేయటం. బీఎస్ఎన్ఎల్ ఉచిత వై-ఫై హాట్‌స్పాట్‌లను దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేయటం

Best Mobiles in India

English summary
Students in Andhra Pradesh may get free smartphones. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X