Home
News

Sun Direct యూజర్లకు శుభవార్త!! కొత్తగా 6 ఛానెల్‌లకు ఉచిత యాక్సిస్

ఇండియాలోని డిటిహెచ్ ఆపరేటర్లలో ఒకటైన సన్ డైరెక్ట్ సౌత్ ఇండియా మొత్తం తన యొక్క సేవలను అందిస్తున్నది. ఇప్పుడు ఈ ఆపరేటర్ తన వినియోగదారుల కోసం కొత్తగా ఆరు ఛానెల్‌లను జోడించింది. కొద్ది రోజుల క్రితం ఉత్తమమైన HD ఛానల్ ప్యాక్లలో ఒకటైన ROI HD ను కొనుగోలు చేయడానికి దాని ధరను రూ.253.39 (పన్ను మినహాయించి) కు తగ్గించింది. కల్వి, రష్యా టుడే, ఎంటర్ 10 బంగ్లా, జిన్వానీ, షో బాక్స్, మరియు అమర్ సినిమా వంటి ఆరు ఛానెల్‌లను ఈ ప్లాట్‌ఫామ్‌కు కొత్తగా జోడించింది. ఈ ఛానెల్‌లన్నీ వేర్వేరు శైలిలో ఉన్నాయి. ఈ ఛానెల్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

సన్ డైరెక్ట్ ఆరు కొత్త ఛానెల్‌ల వివరాలు

సన్ డైరెక్ట్ ఆరు కొత్త ఛానెల్‌ల వివరాలు

సన్ డైరెక్ట్ ఆపరేటర్ తన యొక్క ప్లాట్‌ఫామ్‌లలో ఆరు కొత్త ఛానెళ్లను జోడించింది. వాటిలో మొదటిది కల్వి ఛానల్. ఇది తమిళ ఇన్ఫోటైన్‌మెంట్ ఛానల్, ఇది SD నాణ్యతతో ఉచితంగా లభిస్తుంది. కస్టమర్ ఛానెల్ నంబర్ 33 వద్ద ఈ ఛానెల్ యొక్క కంటెంట్‌ను యాక్సెస్ చేయవచ్చు. కొత్తగా జోడించిన రెండవ ఛానెల్‌ విషయానికి వస్తే రష్యా టుడే. ఇది వినియోగదారులకు అంతర్జాతీయ వార్తలను అందించే లక్ష్యంతో వస్తున్న ఇంగ్లీష్ ఛానల్. దీనిని ఛానల్ నంబర్ 569 వద్ద వినియోగదారులు SD నాణ్యతతో ఉచితంగా లభిస్తుంది.

సన్ డైరెక్ట్ కొత్త హిందీ ఛానెల్‌లు

సన్ డైరెక్ట్ కొత్త హిందీ ఛానెల్‌లు

కొత్తగా జోడించిన మరో నాలుగు ఛానెల్‌లలో రెండు హిందీ మరియు రెండు బెంగాలీ ఛానెల్‌లు కూడా ఉన్నాయి. హిందీ ఛానెళ్ల విషయానికి వస్తే జిన్వానీ మరియు షో బాక్స్ ఛానెల్‌లు ఉన్నాయి. ఛానల్ నంబర్ 617 వద్ద SD నాణ్యతతో జిన్వానీ ఛానెల్‌ భక్తి కంటెంట్‌తో వినియోగదారులకు ఉచితంగా అందిస్తుంది. షో బాక్స్ హిందీ మ్యూజిక్ ఛానల్ ను ఛానెల్ నంబర్ 379 వద్ద SD నాణ్యతతో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది.

సన్ డైరెక్ట్ కొత్త ఛానెల్‌ల ఆఫర్లు  

సన్ డైరెక్ట్ కొత్త ఛానెల్‌ల ఆఫర్లు  

కొత్తగా జోడించిన రెండు బెంగాలీ ఛానెళ్ల విషయానికొస్తే ఎంటర్ 10 బంగ్లా మరియు అమర్ సినిమా ఛానెల్‌లు ఉన్నాయి. ఇందులో ఎంటర్ 10 బంగ్లా ఛానల్ GEC యొక్క కళా ప్రక్రియ పరిధిలోకి వస్తుంది. ఇది ఛానల్ నంబర్ 643 వద్ద SD నాణ్యతతో ఉచితంగా లభిస్తుంది. చివరిగా కొత్తగా జోడించిన అమర్ సినిమా ఛానల్ నంబర్ 646 వద్ద SD నాణ్యతతో వినియోగదారులకు బెంగాలీ సినిమాలను ఉచితంగా తెస్తుంది. సన్ డైరెక్ట్ నుండి మరిన్ని ఆఫర్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. డిటిహెచ్ ఆపరేటర్ తన ప్రముఖ ఛానల్ ప్యాక్లలో ఒకటైన తమిళ DPO1 ను 999 రూపాయల ధర వద్ద అందిస్తోంది. ఇది పరిమిత సమయం ఆఫర్ మాత్రమే.

More from GizBot

Best Mobiles in India

English summary
Sun Direct Brings Six New Channels
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X