Home
News

Sun Direct DTH ప్లాట్‌ఫామ్‌లో కొత్తగా మరో రెండు ఛానెల్‌లు చేరిక!!!

ఇండియాలోని డిటిహెచ్ ఆపరేటర్లలో ఒకటైన సన్ డైరెక్ట్ తన వినియోగదారుల అవసరాలను గమనించి సకాలంలో దానికి సరికొత్త ఆఫర్లను జోడిస్తున్నది. కొద్ది రోజుల క్రితం డిటిహెచ్ ఆపరేటర్ తన యొక్క ప్లాట్‌ఫామ్‌కు రష్యా టుడే, కల్వి, ఎంటర్ 10 బంగ్లా, జిన్వానీ, షో బాక్స్ మరియు అమర్ సినిమా వంటి 6 కొత్త ఛానెల్‌లను జోడించారు. ఇప్పుడు సన్ డైరెక్ట్ తన ప్లాట్‌ఫామ్‌లో మరొక రెండు కొత్త ఛానెల్‌లను జోడించింది. ఈ రెండు ఛానెళ్ల ప్రస్తుతం సన్ డైరెక్ట్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఛానెళ్లపై అదనంగా దృష్టి సారించింది. కొత్త ఛానెల్‌లలో ఒకటి భక్తి ఛానల్ అయితే, మరొకటి న్యూస్ ఛానల్. సన్ డైరెక్ట్ యొక్క ప్లాట్‌ఫామ్‌లో జోడించబడిన రెండు ఛానెల్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

సన్ డైరెక్ట్ కొత్తగా జోడించిన ఛానెల్‌ల వివరాలు

సన్ డైరెక్ట్ కొత్తగా జోడించిన ఛానెల్‌ల వివరాలు

సన్ డైరెక్ట్ ఇటీవల తన వినియోగదారుల కోసం రెండు కొత్త ఛానెళ్లను జోడించింది. అందులో మొదటి ఛానెల్ ‘శ్రద్ధా MH వన్'. ఇది ప్రేక్షకులకు భక్తికి సంబందించిన కంటెంట్‌ను ఛానల్ నంబర్ 759 లో అందిస్తుంది. అలాగే రెండవ ఛానెల్‌ విషయానికి వస్తే ఇది STV హర్యానా న్యూస్ వివరాలను అందించే కంటెంట్‌తో వస్తుంది. దీనిని మీరు ఛానెల్ నంబర్ 587 వద్ద యాక్సిస్ చేయవచ్చు.

 

శ్రద్ధా MH వన్ & హర్యానా న్యూస్ ఛానెల్‌ల వివరాలు

శ్రద్ధా MH వన్ & హర్యానా న్యూస్ ఛానెల్‌ల వివరాలు

"శ్రద్ధా MH వన్" ఛానెల్‌లో మీరు వివిధ రకాల గురువుల నుండి లభించే కంటెంట్‌ను చూడవచ్చు. ఉదాహరణకు శ్రీ శ్రీ రవిశంకర్ మరియు ఇతర ప్రసిద్ధ గురువులు బోధించే భక్తికి సంబందించిన కంటెంట్ ను ఈ ఛానెల్‌లో ప్రసారం చేయబడుతుంది. అలాగే STV హర్యానా న్యూస్ విషయానికొస్తే వినియోగదారులు హర్యానా యొక్క స్థానిక వార్త విషయాలను సరికొత్త అప్ డేట్ సమాచారంతో పొందగలరు.

సన్ డైరెక్ట్ సరికొత్త అప్ డేట్

సన్ డైరెక్ట్ సరికొత్త అప్ డేట్

సన్ డైరెక్ట్ తన ప్లాట్‌ఫామ్‌లో తీసుకువచ్చిన మరో కొత్త అప్ డేట్ విషయానికి వస్తే డిటిహెచ్ ఆపరేటర్ డిడి అగర్తాలా యొక్క LCN నెంబర్ ను మార్చారు. ఇంతకు ముందు LCN నంబర్ 770గా ఉండేది. అయితే ఇప్పుడు దీనిని 649 గా మార్చారు. సన్ డైరెక్ట్ ఇప్పుడు తన ROI (రెస్ట్ ఆఫ్ ఇండియా) ప్యాక్‌లు మరియు ఛానెళ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. DTH ఆపరేటర్ ఆగస్టులో 6 కొత్త ఛానెల్‌లను తిరిగి తన ప్లాట్‌ఫామ్‌కు జోడించింది. ఇప్పుడు అది చాలా తక్కువ వ్యవధిలో మరో రెండు ఛానెల్‌లను జతచేసింది. సన్ డైరెక్ట్‌కు మరో హైలైట్ ఏమిటంటే దాని ROI HD ప్యాక్ భారతదేశంలో చౌకైన HD ఛానల్ ప్యాక్‌లలో ఒకటిగా అవతరించింది.

Best Mobiles in India

English summary
Sun Direct DTH Operator Adds New Channels on Different Geners
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X