సన్ డైరెక్ట్ DTH కొత్త ఛానెల్ ప్యాక్‌లను జోడించింది!! రీఛార్జ్ పై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు....
దక్షిణ భారతదేశంలోని డైరెక్ట్-టు-హోమ్ (DTH) సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన సన్ డైరెక్ట్ ఇప్పుడు తన యొక్క వినియోగదారులను ఆకట్టుకోవడానికి అనేక కొత్త ఛానెల్ ప్యాక్‌లను పరిచయం చేసింది. అంతేకాకుండా కొన్ని ఛానెల్ ప్యాక్‌లను నిలిపివేసింది. ఈ కొత్త ప్లాన్‌లన్నీ ఇప్పుడు కంపెనీ వెబ్‌సైట్ మరియు మొబైల్ యాప్‌లో రీఛార్జ్ చేసుకోవడానికి చందాదారులకు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా పదకొండు (11) పాత ఛానెల్ ప్యాక్‌లను తీసివేయబడగా మూడు (3) కొత్త ఛానల్ ఛానెల్ ప్యాక్‌లను జోడించింది. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

సన్ డైరెక్ట్ తొలగించిన ఛానెల్ ప్యాక్‌లు
** HD తమిళ గోల్డ్ ప్యాకేజీ
** HD ROI సిల్వర్ ప్యాకేజీ
** HD మరాఠీ సిల్వర్ ప్యాకేజీ
** HD మలయాళం గోల్డ్ ప్యాకేజీ
** HD కన్నడ గోల్డ్ ప్యాకేజీ
** HD బెంగాలీ సిల్వర్ ప్యాకేజీ
** HD తెలుగు గోల్డ్ ప్యాకేజీ
** HD తమిళ సిల్వర్ ప్యాకేజీ
** HD మలయాళం సిల్వర్ ప్యాకేజీ
** HD కన్నడ సిల్వర్ ప్యాకేజీ
** HD తెలుగు సిల్వర్ ప్యాకేజీ

సన్ డైరెక్ట్ కొత్తగా జోడించిన ఛానెల్ ప్యాక్‌లు
సన్ డైరెక్ట్ DTH సర్వీస్ ప్రొవైడర్ ఇప్పుడు తన యొక్క వినియోగదారుల కోసం మూడు కొత్త ఛానెల్ ప్యాక్‌లను జోడించింది. ఈ ఛానెల్ ప్యాక్‌లలో ‘HD తమిళ్ స్మార్ట్ ప్యాక్', ‘HD తమిళ్ క్లాసిక్ ప్యాక్' మరియు ‘HD తమిళ్ అల్టిమేట్ ప్యాక్' ఉన్నాయి. ఈ ఛానెల్ ప్యాక్‌ల ధరలు నెలకు వరుసగా రూ.220, రూ. 260 మరియు రూ.290 లుగా ఉన్నాయి. HD తమిళ్ అల్టిమేట్ ప్యాక్ అత్యధిక సంఖ్యలో ఛానెల్‌లను కలిగి ఉంది మరియు వినోదం విషయానికి వస్తే ఎక్కువ సంఖ్యలో ఎంపికలను కోరుకునే వ్యక్తులకు ఇది గొప్పది.

సన్ డైరెక్ట్ రీఛార్జ్ ఆఫర్‌లు
సన్ డైరెక్ట్ కస్టమర్లకు దీర్ఘకాలిక రీఛార్జ్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది. అయితే ఈ ఆఫర్‌ల నుండి ప్రయోజనాలను పొందేందుకు కస్టమర్‌లు గణనీయమైన మొత్తంలో డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది. సన్ డైరెక్ట్ మొబైల్ యాప్ లేదా దాని వెబ్‌సైట్ ద్వారా నేరుగా రీఛార్జ్‌లు చేసుకునే కస్టమర్‌లకు మాత్రమే ఈ రీఛార్జ్ ఆఫర్‌లు వర్తిస్తాయని గుర్తుంచుకోండి. కస్టమర్‌లు కనీసం రూ.3,000 లేదా అంతకంటే ఎక్కువ ధర వద్ద రీఛార్జ్ చేసుకుంటే కనుక కంపెనీ వారికి రూ.150 వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. తక్కువ మొత్తంలో రీఛార్జ్ చేసుకునే కస్టమర్‌లకు తక్షణ క్యాష్‌బ్యాక్ ఆఫర్ వంటి ఇతర ఆఫర్‌లు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








