148 FTA ఛానెల్‌లను ప్రాంతీయ ప్యాక్‌లలో అదనంగా అందిస్తున్న Sun Direct

|

డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) ఆపరేటర్లలో ఒకటైన సన్ డైరెక్ట్ దక్షిణాదిన మాత్రమే తన యొక్క సర్వీసులను అందిస్తున్నది. ఇది ఇప్పుడు తన చందాదారులకు 148 ఫ్రీ-టు-ఎయిర్ (FTA) ఛానెళ్లను కేవలం రూ.58 లకు మాత్రమే అందిస్తోంది. భారతదేశంలోని ఇతర డిటిహెచ్ ఆపరేటర్లతో పోలిస్తే సన్ డైరెక్ట్ చందాదారులు ఇప్పుడు తక్కువ NCF ఛార్జీలను చెల్లిస్తున్నారు. ఈ ఆపరేటర్ ప్రైమరీ కనెక్షన్‌కు రూ.59 మరియు సెకండరీ కనెక్షన్‌కు రూ.23 ఉన్నాయి. సన్ డైరెక్ట్ డిటిహెచ్ ఆపరేటర్ యొక్క వెబ్ పోర్టల్‌లలో NCF మరియు FTA ప్యాక్‌ల కొత్త ధరలను ప్రతిబింబిస్తుంది. NCF ఛార్జీలను మాత్రమే చెల్లించే చందాదారులు 148 ఛానెల్‌లను ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా పొందగలుగుతారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

సన్ డైరెక్ట్ ప్రాంతీయ ఛానల్ ప్యాక్‌లలో ఉచితంగా 148 ఛానెల్‌లు పూర్తి వివరాలు

సన్ డైరెక్ట్ ప్రాంతీయ ఛానల్ ప్యాక్‌లలో ఉచితంగా 148 ఛానెల్‌లు పూర్తి వివరాలు

‘తమిళ DPO1' ప్యాక్ ఇప్పుడు వినియోగదారులకు అన్ని రకాల పన్నులు మరియు NCF ఛార్జీలతో కలిపి నెలకు రూ.199 ధర వద్ద లభిస్తుంది. వినియోగదారులు రూ.56 చెల్లింపుతో 148 ఛానెల్‌లను ఉచితంగా యాక్సెస్ చేయగలుగుతారు. అదేవిధంగా ‘తమిళ DPO2' ప్యాక్ ఇప్పుడు 81 పెయిడ్ ఛానెళ్లను, 148 ఉచిత ఛానెళ్లను కలిపి నెలకు 230 రూపాయల ధర వద్ద అందిస్తుంది.

Also Read:JEE & NEET విద్యార్థుల కోసం ఉచితంగా రెండు చానెలను అందిస్తున్న Airtel Digital TVAlso Read:JEE & NEET విద్యార్థుల కోసం ఉచితంగా రెండు చానెలను అందిస్తున్న Airtel Digital TV

సన్ డైరెక్ట్ తమిళ DPO ప్యాక్‌ల పూర్తి వివరాలు

సన్ డైరెక్ట్ తమిళ DPO ప్యాక్‌ల పూర్తి వివరాలు

సన్ డైరెక్ట్ ప్రాంతీయ ఛానల్ ప్యాక్‌లలో అందిస్తున్న మరొక ప్యాక్ ‘తమిళ DPO2A'. ఈ ప్యాక్ ఒక నెలకు రూ.267 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్యాక్ 85 [పేమెంట్ ఛానెళ్లతో పాటుగా 148 ఉచిత ఛానెళ్లను అందిస్తుంది. ఈ జాబితాలోని చివరి తమిళ ప్రాంతీయ ప్యాక్ ‘తమిళ DPO3'. ఇది 111 పేమెంట్ ఛానెల్‌లను మరియు 148 ఉచిత ఛానెల్‌లను మొత్తం కలిపి నెలకు రూ.351 ధర వద్ద అందిస్తుంది.

సన్ డైరెక్ట్ తెలుగు DPO ప్యాక్‌ల పూర్తి వివరాలు

సన్ డైరెక్ట్ తెలుగు DPO ప్యాక్‌ల పూర్తి వివరాలు

సన్ డైరెక్ట్ ప్రాంతీయ ఛానల్ ప్యాక్‌లలో భాగంగా నాలుగు తెలుగు ప్రాంతీయ ప్యాక్‌లను అందిస్తున్నాయి. ఇవి అన్ని కూడా 148 అదనపు FTA ఛానెల్‌లను అందిస్తున్నాయి. ఈ నాలుగు ప్యాక్‌లు వరుసగా ‘తెలుగు DPO 1', ‘తెలుగు DPO 2', ‘తెలుగు DPO2 A', ‘తెలుగు DPO3' ఉన్నాయి. ‘తెలుగు DPO1' లో నెలకు రూ.225 ధర వద్ద 60పేమెంట్ ఛానెల్‌లను, ‘తెలుగు DPO 2' నెలకు రూ.294 ధర వద్ద 85 పెయిడ్, ఛానెళ్లను, ‘తెలుగు DPO2A' నెలకు రూ.319 ధర వద్ద 88 పెయిడ్ ఛానెళ్లతో చివరగా  నెలకు రూ.379 ధర వద్ద ‘తెలుగు DPO3' ప్యాక్ 116 పెయిడ్ FTA ఛానెల్‌లను అందిస్తాయి. అయితే ఈ నాలుగు ప్యాక్‌లు అదనంగా 148 ఉచిత ఛానెళ్లకు కూడా యాక్సిస్ అందిస్తాయి.

సన్ డైరెక్ట్ కన్నడ DPO ప్యాక్‌ల పూర్తి వివరాలు

సన్ డైరెక్ట్ కన్నడ DPO ప్యాక్‌ల పూర్తి వివరాలు

సన్ డైరెక్ట్ ప్రాంతీయ ఛానల్ ప్యాక్‌ల జాబితాలో ఉన్న మూడవ భాష ‘కన్నడ' ప్రాంతీయ ఛానల్ ప్యాక్‌లు. వీటిలో ఒక నెలకు రూ.220 ధర గల ‘కన్నడ DPO1' వినియోగదారులకు 54 పేమెంట్ ఛానెల్‌లను మరియు 148 ఉచిత ఛానెల్‌లను చూడటానికి వీలు కల్పిస్తుంది. అలాగే  ‘కన్నడ DPO 2' నెలకు రూ.278 ధర వద్ద ఇప్పుడు 91 పెయిడ్ ఛానెల్స్, 148 ఉచిత ఛానెళ్లతో వస్తుంది. చివరగా ‘కన్నడ DPO3' ప్యాక్  112 పెయిడ్ ఛానెళ్లను, 148 ఉచిత ఛానెళ్లను నెలకు రూ.358 ధర వద్ద అందిస్తుంది.

సన్ డైరెక్ట్ సౌత్ DPO4 ప్యాక్ పూర్తి వివరాలు

సన్ డైరెక్ట్ సౌత్ DPO4 ప్యాక్ పూర్తి వివరాలు

సన్ డైరెక్ట్ ప్రాంతీయ ఛానల్ ప్యాక్‌ల జాబితాలో నెలకు రూ.449 ధర వద్ద ‘సౌత్ DPO4' ప్యాక్ ను కూడా అందిస్తుంది. ఇది వినియోగదారులకు ఇప్పుడు 124 పెయిడ్ ఛానెల్‌లను మరియు 148 ఉచిత ఛానెల్‌లను అందిస్తుంది. చందాదారులు కేవలం 14 రూపాయలు చెల్లించి ఈ 148 ఎఫ్‌టిఎ ఛానెళ్లను పొందవచ్చు.

Best Mobiles in India

Read more about:
English summary
Sun Direct Subscribers Now Get Additionally Offers 148 FTA Channels in Regional Packs

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X