సుందర్ పిచాయ్‌కు గ్లోబల్‌ లీడర్‌షిప్‌ అవార్డు, టెక్నాలజీలో మేటీ

|

గూగుల్‌ సీఈఓ, భారత సంతతికి చెందిన సుందర్‌ పిచాయ్‌కు అరుదైన గౌరవం దక్కింది. టెక్నాలజీ రంగంలో పిచాయ్ చేసిన విశిష్ట సేవలను గుర్తించిన అమెరికా–భారత వాణిజ్య మండలి (యూఎస్‌ఐబీసీ).. ప్రతి ఏడాది ఇచ్చే గ్లోబల్‌ లీడర్‌షిప్‌ అవార్డుకు పిచాయ్‌ను ఎంపికచేసినట్లు ప్రకటించింది. ఈయనతో పాటు నాస్‌డాక్‌ ప్రెసిడెంట్‌ అడెనా ఫ్రైడ్‌మాన్‌ పేరును ప్రకటించింది.

సుందర్ పిచాయ్‌కు గ్లోబల్‌ లీడర్‌షిప్‌ అవార్డు, టెక్నాలజీలో మేటీ

ఇరువురి నేతృత్వంలోని కంపెనీలు, అంతర్జాతీయ టెక్నాలజీ రంగ ప్లాట్‌ఫాంను ఏర్పాటుచేయడంలో తమవంతు కృషి చేసినట్లు కొనియాడింది. ఇరు సంస్థల కారణంగా భారత్, అమెరికా మధ్య వస్తు, సేవల ద్వైపాక్షిక వాణిజ్యం గడిచిన ఐదేళ్లలో 150 శాతం పెరిగి గతేడాదినాటికి 142.1 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు తెలిపింది. వచ్చేవారం జరగనున్న ఇండియా ఐడియాస్‌ సదస్సులో ఇరువురికి అవార్డులను అందించనున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే భారత మొబైల్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2025 నాటికి 92 కోట్లకు చేరనుందని గ్లోబల్‌ టెలికం పరిశ్రమ సమాఖ్య (జీఎస్‌ఎంఏ) అంచనావేసింది. ఇదేసమయంలో 5జీ కనెక్షన్లు 8.8 కోట్లకు చేరనున్నట్లు పేర్కొంది. 2018 చివరినాటికి మొత్తం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 75 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. ఈ రంగ ఆదాయం 2016 నుంచి 20 శాతం తగ్గిపోయినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

జననం

జననం

సుందర్ పిచాయ్ చెన్నైలో 1972లో జన్మించారు. ఇంజినీరింగ్‌ను IIT Kharagpurలో ఎంఎస్‌ను స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో, ఎంబీఏను వార్టన్ బిజినెస్ స్కూల్‌లో పూర్తి చేసారు.పిచాయ్ తన భార్య అంజలి ఇంకా నలుగురు పిల్లలతో లాస్ ఆల్టోస్ (కాలిఫోర్నియా)లోని ఇంట్లో నివాసముంటున్నారు. ఈ 5 పడకగదుల ఇల్లు ఆధునిక హంగులతో ఆకట్టుకుటుంది. టెన్నీస్ కోర్ట్ అలానే ఫుట్‌బాల్ కోర్డులు ఉన్నాయి.

ప్రొఫెషనల్ క్రికెటర్‌గా

ప్రొఫెషనల్ క్రికెటర్‌గా

సుందర్ పిచాయ్ గూగుల్‌లో ప్రొడక్ట్ ఇంకా ఇన్నోవేషన్ అధికారిగా 2004లో నియమితులయ్యారు. పిచాయ్ తన మొదటి అసైన్‌‌మెంట్‌తోనే గూగుల్ దృష్టిని ఆకర్షించారు.సుందర్ పిచాయ్ ప్రొఫెషనల్ క్రికెటర్‌గా రాణించాలనుకున్నారు. అయితే, గూగుల్ సీఈఓగా స్థిరపడాల్సి వచ్చింది.

2014 నాటికి గూగుల్ అన్ని ఉత్పత్తులకు
 

2014 నాటికి గూగుల్ అన్ని ఉత్పత్తులకు

క్రోమ్ విభాగపు బాధ్యతలతో గూగుల్‌లో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సుందర్ పిచాయ్ 2014 నాటికి గూగుల్ అన్ని ఉత్పత్తులకు బాధ్యత వహించే స్థాయికి ఎదిగారు.గూగుల్‌లోని ఆండ్రాయిడ్ డిపార్ట్‌మెంట్‌కు కొత్త రూపును తీసుకురావటంలో సుందర్ పిచాయ్ క్రియాశీలక పాత్ర పోషించారు.

సాదాసీదాగా జీవించేందుకు

సాదాసీదాగా జీవించేందుకు

సుందర్ పిచాయ్ సాదాసీదాగా జీవించేందుకు ఇష్టపడతారు.గతంలో వచ్చిన చెన్నై వరదల్లో సుందర్ పిచాయ్ అమ్మమ్మ నాలుగు రోజుల పాటు ఓ ఇంట్లో తిండి, నీరు లేకుండా గడపాల్సి వచ్చిందట. ఈ వివరాలను సుందర్ ఓ ఇంటర్వ్వూలో వెల్లడించారు.

2011లో ట్విట్టర్ నుంచి ఆఫర్

2011లో ట్విట్టర్ నుంచి ఆఫర్

సుందర్ పిచాయ్‌కు 2011లో ట్విట్టర్ నుంచి ఆఫర్ వచ్చింది. అయితే, 50 మిలియన్ డాలర్లను చెల్లించి గూగుల్ సుందర్ పిచాయ్ ను తమ వద్దే ఉంచేసుకుంది. సుందర్ పిచాయ్ కు 2011లో ట్విట్టర్ నుంచి ఆఫర్ వచ్చింది. అయితే, 50 మిలియన్ డాలర్లను చెల్లించి గూగుల్ సుందర్ పిచాయ్ ను తమ వద్దే ఉంచేసుకుంది.

 ఫన్నీ పోస్టు

ఫన్నీ పోస్టు

ఆ మధ్య ఓ నెటిజన్ సంధించిన ప్రశ్న గూగుల్ సుందర్ పిచాయ్‌ని తెగ ఆకర్షించింది. అందరూ తమ పనులను వదిలేసి ముందు దీనికి సమాధానం చెప్పండి అనే ట్వీట్ చేసేదాకా ఈ ఫన్నీ పోస్టు వెళ్లింది. బర్గర్‌లో చీజ్ ముక్క ఎక్కడుండాలి ? టమాటా, ప్యాటీ స్లైస్‌ల‌కు కిందా ? లేక టమాటా, ప్యాటీ స్లైస్‌ల‌ మధ్యలోనా ? ఈ ప్రశ్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ను ఇబ్బందులకు గురిచేసింది.

 ట్వీట్ కాస్తా వైరల్

ట్వీట్ కాస్తా వైరల్

ట్వీట్ కాస్తా వైరల్ అయి అది గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ దాకా చేరడంతో వెంటనే ఆయన తన ట్విట్టర్‌లో అకౌంట్‌లో దాన్ని పోస్ట్ పెట్టారు.మిగిలిన అన్ని పనులు వదిలేసి అసలు బర్గర్‌లో చీజ్ స్లైస్‌ ప్లేస్‌మెంట్ ఎక్కడ ఉండాలి అనే సమస్యను ముందుగా పరిష్కరించండని పిచాయ్ ట్వీట్ చేశారు.

Best Mobiles in India

English summary
Sundar Pichai, Adena Friedman to Get 2019 Global Leadership Award

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X