జియో కొట్టిన దెబ్బపై Airtel అధినేత స్పందన ఇదే !

Written By:

రిలయన్స్ జియో రాకతో టెలికం రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. జియో ఉచిత వాయిస్‌, డేటా ఆఫర్ల వెల్లువతో టెలికం రంగం ఒక్కసారిగా కుదేలై అక్కడ టరిఫ్ యుద్ధ వాతావరణం నెలకొంది. అప్పటిదాకా లాభాల్లో దూసుకుపోతున్న కంపెనీలు ఒక్కసారిగా భారీ నష్టాలను చవిచూసాయి. ఈ విషయంపై Airtel అధినేత సునీల్ మిట్టల్ ఆసక్తికర కామెంట్లు చేశారు.

ఈ ఫోన్‌ని 700 సార్లు సోప్ పెట్టి కడిగినా చెక్కు చెదరలేదు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దాదాపు 50 బిలియన్‌ డాలర్ల వరకు..

ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో సునీల్ మిట్టల్ మాట్లాడుతూ జియో ఉచిత వాయిస్‌, డేటా ఆఫర్ల వెల్లువతో టెలికం కంపెనీలు భారీగా నష్టపోయాయని దాదాపు 50 బిలియన్‌ డాలర్ల వరకు పెట్టుబడులను టెలికాం కంపెనీలు రైటాఫ్‌ చేసాయని పేర్కొన్నారు.

రైటాఫ్‌కు ప్రధాన కారణం..

ఇన్ని కోట్ల మేర పెట్టుబడుల రైటాఫ్‌కు ప్రధాన కారణం జియో ఉచిత కాల్స్‌, డేటా ఆఫర్లేనని, అయితే టెలికాం ఇండస్ట్రీలో వేగంగా జరిగిన కన్సాలిడేషన్‌తో భారతీ ఎయిర్‌టెల్‌ ఓ మేర దీని నుంచి గట్టెక్కిందని తెలిపారు.

విలీనం దిశగా అడుగులు..

నెంబర్‌ 2, నెంబర్‌3 కంపెనీలుగా దూసుకుపోతున్న వొడాఫోన్‌,ఐడియాలు సైతం కుదేలయ్యాయని అందుకే విలీనం దిశగా అడుగులు వేసాయని, ఈ విలీనం అపూర్వమైనదని తెలిపారు. అయితే రెండు బలమైన కంపెనీల విలీనాన్ని మనం చూడటం లేదని మిట్టల్‌ అన్నారు.

ఎయిర్‌సెల్‌ను కొనుగోలు చేసే ప్రక్రియపై..

కాగా ప్రస్తుతం భారతీ ఎయిర్టెల్‌, ఎయిర్‌సెల్‌ను కొనుగోలు చేసే ప్రక్రియపై చర్చలు జరుపుతోంది. ఎయిర్‌సెల్‌ అంతకముందు, ఆర్‌కామ్‌లో విలీనమవ్వాలనుకుంది. కానీ ఆ విలీనం చివరి దశలో రద్దయింది.

ఇప్పటికే ట్రేడింగ్‌ డీల్‌ ద్వారా..

ఇప్పటికే ట్రేడింగ్‌ డీల్‌ ద్వారా రూ.3,500 కోట్లకు ఎనిమిది సర్కిళ్లలో 2300 ఎంహెచ్‌జెడ్‌ బ్యాండ్‌లో ఎయిర్‌సెల్‌ 4జీ ప్రసారాలను ఎయిర్‌టెల్‌ గతేడాది కొనుగోలు చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Sunil Mittal Says Indian Telcos Forced to Write Off $50 Billion Due to Jio Entry Read more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot