సురక్షితంగా భూమికి చేరిన సునీతా విలియమ్స్

By Super
|
Sunita Williams Returned Back on Earth after 4 Months in Orbit


పరిశోధన నిమిత్తం గత జూలైలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కి వెళ్లిన భారత - అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ అక్కడ 125 రోజులు గడిపన తరువాత భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 3 గంటల 56 నిమిషాలకు సోయుజ్ క్యాప్సూల్ సాయంతో కజకిస్థాన్‌లోని ఆర్కాలిక్ పట్టణంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. జులై 15న అంతరిక్షంలోకి వెళ్లిన సునీతా విలియమ్స్‌ అక్కడ నాలుగు నెలల పాటు పరిశోధన చేపట్టారు. ఈమె వెంట రష్యా సోయజ్ కమాండర్ యూరీ మాలెన్ చెంకో, జపాన్‌కు చెందిన ఆకి హోషిడేలు ఉన్నారు. రెండు సార్లు అంతరిక్షంలో పర్యటించిన సునీత విలియమ్స్. ఇప్పటి వరకు 322 రోజులు అంతరిక్షంలో గడిపారు. విలియమ్స్ నేలకు చేరుకున్న మధురక్షణాలను విశ్వవ్యాప్తంగా ప్రజలు ఆస్వాదించారు.

 

చంద్రుడి పై తొలి అడుగు.. నీల్ ఆర్మ్స్‌స్ట్రాంగ్ గురించి క్లుప్తంగా!

 

అది 1969 జూలై 20… మానవ చరిత్రలో మరపురాని రోజు.. అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ స్ట్రాంగ్ మరో ఇద్దరు వ్యోమగామిల బృందంతో కూడిన అపోలో -11 అంతరిక్ష నౌక అంతరిక్షంలోకి రివ్వున దూసుకుపోయింది. ముగ్గురులో ఒకరు కక్ష్యలో తిరుగుతుండగా… ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ అల్ డ్రిన్‌‍లు అపోలో నుంచి వేరుపడి మరో చిన్న వ్యోమనౌకలో చంద్రగ్రహానికి చేరారు. యూవత్ ప్రపంచం వీక్షిస్తుండగా ఆర్మ్ స్ట్రాంగ్ చందమామ పై కాలు మోపారు. 21 గంటల పాటు గడిపిన తరువాత వ్యోమనౌక ద్వారా ప్రధాన నౌకను చేరుకుని 195 గంటలు తరువాత భూమికి చేరుకున్నారు. దింతో చంద్రుని పై తొలిఅడుగు వేసిన అస్ట్రానాట్‌గా నీల్ ఆర్మ్స్ స్ట్రాంగ్ చరిత్రపుటల్లో నిలిచారు.

1930లో అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో జన్మించిన ఆర్మ్స్ స్ట్రాంగ్‌కు చిన్ననాటి నుంచే విమానాలంటే మక్కువ. ఆసక్తితో పైలట్ వృత్తిని ఎంచుకున్న స్ట్రాంగ్ అమెరికా నావికాదళంలో కొంత కాలం పనిచేశారు. అంతరిక్షం మీద ఆసక్తితో వ్యోమగామీగా మారిపోయారు. చంద్రమండల యాత్ర తరువాత అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్‌గా సేవలందించారు. ఇటీవలే 82వ జన్మదినోత్సవాన్ని కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్న ఆర్మ్స్ స్ట్రాంగ్ ఆ తర్వాత హృద్రోగ సమస్యతో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. అంతా కోలుకుంటున్నారని అనుకుంటున్న తరుణంలో 2012 ఆగస్టు 25న అమెరికాలో ఆర్మ్స్ స్ట్రాంగ్‌ కన్నుమూశారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X