కొంపముంచిన అర్జున్ పాటియాలా మూవీలోని సన్నీ లియోన్ ఫోన్ నంబర్
డిల్లీకి చెందిన పునీత్ అగర్వాల్ ఇటీవల కొత్తగా ఒక ఫోన్ నంబర్ ను కొన్నాడు. కొన్న తరువాత తెలిసింది అది బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పాత నెంబర్ అని. అతనికి సిమ్ యాక్టీవ్ అయినప్పటి నుండి సన్నీ లియోన్ అభిమానుల నుండి తనకు వందలాది ఫోన్ కాల్స్ వస్తున్నాయని డిల్లీకి చెందిన ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇప్పటివరకు అతనికి వందలాది కాల్స్ వచ్చాయి. కాల్ చేసిన ప్రతి ఒక్కరు సన్నీ లియోన్‌తో మాట్లాడాలని చెబుతున్నారు. అది ఆమె ఫోన్ నంబర్ కాదని వారిని ఒప్పించడానికి చాలా ప్రయత్నలు చేస్తున్నాడు కానీ అందులో చాలా మంది మాటవినడం లేదు అని తెలిపారు.

అర్జున్ పాటియాలా మూవీ:
ఇదంతా ఇటీవల విడుదలైన అర్జున్ పాటియాలా మూవీలోని ఒక సన్నివేశం ద్వారా ప్రారంభమైంది. అర్జున్ పాటియాలా మూవీలో అక్కడ సన్నీ లియోన్ పోషించిన పాత్ర మూవీలోని మరొక పాత్రతో తన ఫోన్ నంబర్‌ను పంచుకుంటుంది.

ఫోన్ కాల్స్:
బాధితుడు పితాంపూరా నివాసి అయిన 27 ఏళ్ల పునీత్ అగర్వాల్. ఈ సినిమా జూలై 26 న విడుదలైన తరువాత నాకు తెలియని వ్యక్తుల నుండి సన్నీ లియోన్‌తో మాట్లాడనివ్వమని అడుగుతూ కాల్స్ రావడం మొదలయినాయి. మొదట్లో ఎవరో నాపై చిలిపిగా ఆట ఆడుతున్నారని నేను అనుకున్నాను. కాని కొంతకాలం తర్వాత నాకు తెలిసింది ఇది సినిమా నిర్మాతలు వాస్తవానికి సినిమాలో నా నంబర్‌ను ఉపయోగించారని. సినిమాలోని సన్నీ లియోన్ పాత్రకు నా నెంబర్‌ను నిర్దేసించి ఉంటుంది" అని అగర్వాల్ పోలీసులతో అన్నారు.

కాలర్లచే వేధింపులు:
నేను చాలా మంది కాలర్లచే వేధింపులకు గురవుతున్నాను ప్రజలు నన్ను నా ఫోన్ నంబర్ ను దుర్వినియోగం చేస్తున్నారు. అంతే కాకుండా నన్ను బ్రోకర్ పని చేయమని అడుగుతున్నారు అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాని ఇప్పటివరకు పోలీసులు కంప్లయింట్ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు" అని ఆయన చెప్పారు. కావున పునీత్ అగర్వాల్ ఇప్పుడు అర్జున్ పాటియాలా మూవీ నిర్మాతల మీద కోర్టులో ఫిర్యాదు చేయడం గురించి ఆలోచిస్తున్నాడు.


Click it and Unblock the Notifications








