జియో సూపర్ యాప్, ఈ కామర్స్ దిగ్గజాలకు దిమ్మతిరిగే షాక్ !
దేశీయ టెలికాం రంగాన్ని ఓ ఊపు ఊపిన రిలయన్స్ జియో ఇప్పుడు సరికొత్త రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం మీద ఆఫ్ లైన్, ఆన్
దేశీయ టెలికాం రంగాన్ని ఓ ఊపు ఊపిన రిలయన్స్ జియో ఇప్పుడు సరికొత్త రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం మీద ఆఫ్ లైన్, ఆన్ లైన్ స్టోర్లలో సరికొత్త ప్రయోగానికి తెరలేపనున్నారు అమెజాన్, వాల్ మార్ట్ ఫ్లిప్ కార్ట్ లకు ధీటుగా సరికొత్త ఫ్లాట్ ఫాంను సిద్ధం చేయబోతున్నారు.

ఇందులో భాగంగా వాటికి పోటీగా సూపర్ యాప్ పేరుతో జియో 100 సర్వీసులను ఒకే చోటుకు తీసుకురానుంది. దీని ద్వారా ఈ కామర్స్ మార్కెట్లో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. అతి త్వరలోనే ఇది లైవులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

300 మిల్లియన్ సబ్ స్క్రైబర్లు
జియో ఇప్పుడు 300 మిల్లియన్ సబ్ స్క్రైబర్లలను కలిగి ఉంది. ఉచిత డేటాతో పాటు వాయిస్ ఆఫర్స్ తో మార్కెట్లో సునామిలా దూసుకుపోతోంది. దీని దెబ్బకు ఇతర టెల్కోలు కిందా మీదా పడుతున్నాయి. జియోకి ధీటుగా ఆఫర్లను ప్రకటించేందుకు నానా తంటాలు పడుతున్నాయి. కస్టమర్లు చేజారిపోకుండా కాపాడుకునేందుకు తీవ్రంగానే కసరత్తు చేస్తున్నాయి.

సూపర్ యాప్
ఇండస్ట్రీ ఎక్స్ ఫర్టుల ప్రకారం జియో త్వరలో సూపర్ యాప్ తో మార్కెట్లోకి దూసుకురానుందని చెబుతున్నారు.Snapdeal, Paytm, Freecharge, Flipkart మాదిరిగానే ఇండియా మార్కెట్లో వుయ్ ఛాట్ పోల్ పొజిషన్ తో సత్తా చాటనుందని తెలుస్తోంది.

జియో యూజర్లు
జియో సిమ్ వాడుతున్న ప్రతి ఒక్కరూ ఈ యాప్ ని వాడుకోవచ్చు. దీని ద్వారా ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం మీద online bookings and paymentsలాంటివి ఒకే చోట చేయవచ్చు. ఇది యూకో సిస్టంతో కనెక్ట్ కానుంది. ఈ విషయాన్ని Industry Intelligence Group (IIG), CMR Head Prabhu Ram తెలిపారు.

జియో ధరలు పెంచే అవకాశాలు
ఇదిలా ఉంటే డేటా, వాయిస్ కాలింగ్ సేవలను అతి చవకగా భారతీయ వినియోగదారులకు విరివిగా అందుబాటులోకి తీసుకొచ్చిన జియో త్వరలోనే ధరలను భారీగా పెంచనుందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు విశ్లేషిస్తున్నాయి. త్వరలోనే జియో ధరలు పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జేపీ మోర్గాన్ తన తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ చెల్లింపులకు గానూ జియో వేలకోట్ల రూపాయల అవసరం ఉంది. దీంతో జియో తన టారిఫ్‌లను పెంచే యోచనలో ఉందని అంచనా వేసింది.

నిధులను సమీకరణ
దాదాపు 30 కోట్లకు పైగా కస్టమర్లు, విస్తారమైన నెట్‌వర్క్,1,75,000 టవర్లు కలిగి ఉన్న జియో తన నిర్వాహణ సామర్ధ్యం పెంచుకోడానికి, ఆపరేషనల్ వ్యయాలను తట్టుకోడం కోసం ప్రస్తుతం ఉన్న రేట్లను పెంచనుంది. రేట్లను సవరించి తద్వారా నిధులను సమీకరించుకోనుందని ప్రముఖ మార్కెట్ బ్రోకింగ్ సంస్థలు భావిస్తున్నాయి. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు కూడా రానున్న కాలంలో టారిఫ్ ధరలను పెంచేందుకు సిద్ధపడుతున్ననేపథ్యంలో జియో ధరల వ్యూహాన్ని మార్చుకోనుందని కోటక్ సెక్యూరిటీస్ కూడా అంచనా వేస్తోంది.

2019 నాలుగో క్వార్టర్ ఫలితాల్లో
2016లో టెలికాం రంగంలో జియో ఎంట్రీ ఒక సంచలనంగా మారింది. దాదాపు 306.7 మిలియన్ కస్టమర్లను సొంతం చేసుకున్న జియో 2019 నాలుగో క్వార్టర్ ఫలితాల్లో నెట్ ప్రాఫిట్‌లో దాదాపు 65శాతం వృద్ధిని కనబరిచింది. అంతేకాదు 2019 మార్చి నాటికి దేశంలోనే అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా అవతరించిన జియో రూ.11,100 కోట్ల ఆదాయాన్ని సాధించింది.

రూ.9 వేల కోట్ల ఆదాయాన్ని
అయితే నెట్‌వర్క్ ఆపరేటింగ్ వ్యయాలు దాదాపు 88 శాతం జంప్ జేయడంతో దాదాపు రూ.9 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవలసి ఉంది. ఈ నేపథ్యంలోనే జియో తన టారిఫ్‌లను సవరించవచ్చని మార్కెట్ ఎనలిస్టులు పేర్కొంటున్నారు. రిలయన్స్ జియోలో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ సుమారు 2-3 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్‌మెంట్ పెట్టనుందని సమాచారం.

రూ.600కే గిగాఫైబర్
టెలికం మార్కెట్లో విప్లవం సృష్టించిన జియో త్వరలోనే జియో గిగాఫైబర్‌తో మరో విప్లవానికి సిద్ధమవుతోంది. నెలకు కేవలం రూ.600కే గిగాఫైబర్ ద్వారా బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్ లైన్ ఫోన్, టీవీ చానళ్ల ప్రసారాల సేవలను అందించనుందని వార్తలు వస్తున్నసంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications