బూతు వెబ్‌సైట్‌ల పై సుప్రీం కన్నెర్ర!

Posted By:

ఇంటర్నెట్‌లో బూతు వెబ్‌సైట్‌లను నిషేధించే అభ్యర్థన పై కేంద్ర ప్రభుత్వం నుంచి సుప్రీం కోర్టు స్పందనను కోరింది. పలు పిటీషన్‌లను పరశీలించిన పదిప అంతర్జాలంలో మితిమీరుతున్న పోర్నోగ్రఫీ మహిళల పై నేరాలకు ప్రధాన కారణమవుతోందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ అంశం పై వ్యతిరిక చట్టాన్ని తీసుకువచ్చే కమ్రంలో తమ స్పందనను తెలియజేయాలని కోరుతూ చీఫ్ జస్టిస్ అల్తామస్ కబీర్ నేతృత్వంలోని ధర్మాసనం, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఇంకా హోం వ్యవహారాల మరియు భారతదేశం యొక్క ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ మంత్రిత్వ శాఖలకు నోటీసులను జారీ చేసింది.

బూతు వెబ్‌సైట్‌లకు దాసోహం.?

ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో వెబ్‌‌సైట్లుండగా, వాటిలో వేటికీ లేనంత ఆదరణ పోర్న్‌ సైట్లకు ఉందని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది. నిత్యం రద్దీగా ఉండే సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లతో సమానంగా ఈ పోర్న్ సైట్‌లు వీక్షకులను రాబడుతున్నాయట!. బూతుబొమ్మలను చూడటానికి ఏకంగా 30 శాతం మంది ఇంటర్నెట్ ను వినియోగిస్తున్నారని ఈ అధ్యయనం లెక్కగట్టింది. ఇంటర్నెట్ రద్దీలో భాగంగా 30శాతం బూతు వెబ్ సైట్ ల నుంచే వస్తుందని ఈ సర్వే అంచనావేసింది. పోర్న్‌ సైట్లలో కొన్నింటికి అత్యంత ఆదరణ ఉందట. ప్రతీ నెలా ఈ సైట్లలోని బొమ్మలను చూడటం కోసం ఏకంగా నాలుగు బిలియన్ల పేజీలను వీక్షిస్తుండగా, ప్రత్యేకించి వీడియోలు చూసేందుకు జరిగే సందర్శనలు ఏకంగా 350 మిలియన్లు.

ఈ పోస్ట్ కూడా చదవండి:

హీరోయిన్‌లు... వారు వాడే సెల్‌ఫోన్‌లు!

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting