ఆధార్ కార్డులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. మీకు లాభమా.. నష్టమా తెలుసుకోండి..!
ఆధార్ కార్డు ప్రామాణికతపై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వయస్సు ధ్రువీకరణకు ఆధార్ కార్డు సరైనది కాదని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధార్ కార్డులోని (Aadhaar Card) వయస్సు ఆధారంగా రోడ్డు ప్రమాద బాధితుడికి పరిహారం నిర్ణయించడంపై పంజాబ్- హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. ఆధార్ కార్డు పుట్టిన తేదీని రుజువు చేయలేదని UIDAI గతంలోనే సర్క్యులర్ జారీచేసినట్లు తెలిపింది. పుట్టిన తేదీ కోసం పాఠశాల రికార్డులనే పరిగణన తీసుకోవాలని తీర్పులో స్పష్టం చేసింది.
రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తికి సంబంధించిన కేసులో పరిహారంగా రూ.19.35 లక్షలు ఇవ్వాలని రోహ్‌తక్‌లోని మోటార్ యూక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చింది. అయితే అనంతరం ఈ కేసు పంజాబ్ - హర్యానా హైకోర్టుకు చేరింది. అయితే ఈ కేసును విచారించిన హైకోర్టుకు.. బాధితుడి వయస్సును తప్పుగా గుర్తించారని తెలిపింది. మరియు రూ.9.22 లక్షల పరిహారానికి మాత్రమే అర్హుడిని పేర్కొంటూ తీర్పు ఇచ్చింది.

ఆధార్ కార్డులోని వయస్సును పరిగణలోకి తీసుకున్నట్లు హైకోర్టు తెలిపింది. అయితే పాఠశాల రికార్డులు కాకుండా ఆధార్ కార్డులోని వయస్సును పరిగణలోకి తీసుకొని పరిహారాన్ని తగ్గించడంపై సుప్రీం కోర్టును బాధిత కుటుంబం ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వయసు నిర్ధారణకు ఆధార్ కార్డు సరైనది కాదని స్పష్టం చేసింది. గతంలో ఇదే విషయాన్ని UIDAI వెల్లడించినట్లు గుర్తుచేసింది.
ఆధార్ కార్డు కేవలం గుర్తింపు కార్డు మాత్రమేనని సుప్రీం కోర్టు తెలిపింది. వయసు నిర్ధారణకు పాఠశాల రికార్డులు మాత్రమే సరైనవని పేర్కొంది. బాధిత కుటుంబం రూ.19.35 లక్షల పరిహారానికి అర్హులుగా పేర్కొంటూ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. సుప్రీం కోర్టు తాజా తీర్పు అనేక మందిని ప్రభావితం చేసేం అవకాశం ఉంది. కొంతమందికి ఈ తీర్పు లాభం.. మరికొందరికి నష్టం చేకూర్చే అవకాశం ఉంది.
దేశంలో ప్రస్తుతం ఆధార్ తప్పనిసరి గుర్తింపు కార్డుగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ ప్రామాణికంగా అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నాయి. ప్రస్తుతం డిసెంబర్ 14 వరకు ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకొనే అవకాశం ఉంది. కనీసం ప్రతి 10 సంవత్సరాలకు ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవాలని ఇప్పటికే UIDAI సూచించింది.
మైఆధార్ యాప్ లేదా వెబ్‌సైట్ నుంచి ఉచితంగా ఆధార్ కార్డులోని అడ్రస్, పుట్టిన తేదీ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే పేరు, ఫొటోను అప్‌డేట్ చేసేందుకు మాత్రం సమీపంలోని ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. గత సంవత్సరం డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకొనేందుకు UIDAI అనేక అవకాశాలు ఇచ్చింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








