చిన్న నగరాల్లో ఊపందుకున్న నియామకాలు

Posted By: Super

చిన్న నగరాల్లో ఊపందుకున్న నియామకాలు

న్యూఢిల్లీ: హైదరాబాద్, పుణే వంటి టైర్ టూ నగరాల్లో హైరింగ్ జోరుగా ఉందని మైహైరింగ్‌క్లబ్‌డాట్ కామ్ తాజా సర్వే తెలిపింది. తక్కువ వ్యయాలు, ఆట్రిషన్ రేటు కారణంగా ఈ నగరాల్లో జనవరి-జూన్ కాలానికి పలు రంగాల్లో ముఖ్యంగా ఇంజనీరింగ్, తయారీ రంగాల్లో ఉద్యోగ కల్పన 27% పెరిగిందని వివరించింది. జైపూర్, ఘజియాబాద్, కోచిల్లో 16% వృద్ధి నమోదైంది. మెట్రో నగరాలతో పోల్చితే టైర్ టై, టైర్ త్రీ నగరాల్లో హైరింగ్ పెరిగింది. తక్కువ వ్యయాలున్న కారణంగా ఈ నగరాలకే కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి.

మెట్రో నగరాల్లో అయితే అధిక వేతనాలు ఇవ్వాల్సి ఉంటుందని, ఆట్రీషన్ రేటు కూడా అధికంగా ఉంటాయనే కారణాలతో కంపెనీలు చిన్న నగరాల వైపు చూస్తున్నాయి. తయారీ, ఇంజనీరింగ్, రిటైల్, ఎఫ్‌ఎంసీజీ, బీమా, బ్యాంకింగ్, ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో ప్రధానంగా హైరింగ్ జోరు పెరిగింది. ఇక ఈ ఏడాది ద్వితీయార్థం కూడా ఇదే ట్రెండ్ ఉండొచ్చు. టైర్ టూ, టైర్ త్రీ నగరాల్లో మొత్తం హైరింగ్‌లో 31 శాతం వాటాతో తయారీ, ఇంజనీరింగ్ రంగాలు మొదటి స్థానంలో నిలిచాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot