ఫేస్‌బుక్ మాకోద్దు, గూగుల్ ప్లస్సే కావాలి: సర్వే

Posted By: Super

ఫేస్‌బుక్ మాకోద్దు, గూగుల్ ప్లస్సే కావాలి: సర్వే

కాలిఫోర్నియా: సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్‌లలో ఇప్పటి వరకు నెంబర్ వన్ స్దానంలో ఉన్న ఫేస్‌బుక్‌ ఆధిపత్యానికి గూగుల్ ప్లస్ గండికొట్టనుంది. ఇది మాత్రమే కాకుండా ఫేస్‌బుక్‌లో ఉన్న యూజర్స్‌‌ని కూడా తనవైపు తిప్పుకోనుంది. ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం 50శాతం ఫేస్‌బుక్‌ ఎకౌంట్స్ కలిగిన యూజర్స్ గూగుల్ ప్లస్‌లో చేరడానికి సుముఖత చూపించినట్లు సమాచారం. మరికొంత మంది ఫేస్‌బుక్‌ని వదిలేసి గూగుల్ ప్లస్‌ని ఇప్పటికే వాడుతూ ఉన్నట్లు వినికిడి.

ఈ సర్వేని పిసి మ్యాగ్ అనే టెక్నాలజీ బ్లాగ్ నిర్వహించండం జరిగింది. ఈ సర్వే ప్రకారం మొత్తం 6,237 మంది పాల్గోనగా ఇందులో 3091 అంచే 50శాతం మంది జనాభా ఫేస్‌బుక్‌ని వదిలి గూగుల్ ప్లస్‌లో చేరడానికి సిద్దంగా ఉన్నామని ఓటింగ్ చేశారు. 21శాతం మంది ప్రస్తుతానికి గూగుల్ ప్లస్‌లో చేరేటటువంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. మరోక 7శాతం మంది జనాభా గూగుల్ ప్లస్‌లో చేరడానికి సిద్దంగా ఉన్నప్పటికి గూగుల్ ప్లస్ నుండి వారికి ఇన్విటేషన్ రాకపోవడంతో ఆగిపోయినట్లు వెల్లిడించారు.

ఇంకోంత మంది యూజర్స్ చాలా ఆసక్తికరమైన సమాధానాన్ని వెలిబుచ్చారు. అందులో 11శాతం మంది అసలు ఈ సోషల్ నెట్ వర్కింగే నచ్చలేదని అన్నారు. మిగిలినటువంటి 7శాతం ప్రజలు ఫేస్‌బుక్ తమకు చాలా అనుకూలంగా, యూజర్ ప్రెండ్లీగా ఉందని ఫేస్‌బుక్ నుండి వేరే సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్‌కి మారే ప్రసక్తి లేదని తేల్చేశారు. గూగుల్ కొత్తగా విడుదల చేయనున్న ఈ గూగుల్ ప్లస్ నుండి ఫేస్‌బుక్ గట్టి పోటీని ఎదుర్కోంటుందని తెలిపారు. గూగుల్ ప్లస్ విడుదల చేసిన మూడు వారాలలోపే సుమారు 20 మిలియన్ యూజర్స్ గూగుల్ ప్లస్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. దీనిని బట్టి చూస్తుంటే మార్కెట్లో గూగుల్ ప్లస్ హాట్ కేక్ లాంగా ఉందని నిపుణులు అబిప్రాయపడుతున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot