వివేకానందుడి ఉపన్యాసాలు 3డిలో...

Posted By: Super

వివేకానందుడి ఉపన్యాసాలు 3డిలో...

 

వివేకానందుడు 1863 జనవరి 12వ తేదీ విశ్వనాథ దత్త; భువనేశ్వరీ దేవి దంపతుల ముద్దుబిడ్డగా కలకత్తా నగరం (కోల్‌కతా)లో జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు ‘‘నరేన్’’ అని పేరు పెట్టుకున్నారు. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.

భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండుల లో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి అతనికి కలదు. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్త్వమును షికాగో లో జరిగిన ప్రపంచ మత జాతర (పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్)లో 1893 లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు.

చెన్నైకి చెందిన శ్రీ రామకృష్ణ మఠం వారు స్వామీ వివేకానంద 150వ జన్మదినాన్ని పురస్కరించుకోని ఆయన జీవితంలో సాధించిన గొప్ప గొప్ప పనులను, ఆయన వల్లె వేసిన సూక్తులను ఆధారంగా ఈ కాలం ప్రజానీకానికి ఆయన ఆదర్శాలు కలకాలం గుర్తుండిపోయే విధంగా ఓ 3డి సినిమాని రూపొందించారు. 1897లో విదేశాల నుండి స్వదేశానికి స్వామి వివేకానంద తిరిగి వచ్చిన తర్వాత చెన్నైలో ఆయన జీవించిన ఇల్లు ఇతి వృత్తంగా సాగుతుంది. ప్రస్తుతం చెన్నైలో ఉన్న ఆయన ఇల్లు ఉపన్యాసాలకు పవిత్ర స్దానంగా ఎలా ఉంది అనే అంశాలను ఇందులో తెలియజేశారు.

ఈ 3డి సినిమాకు పెట్టిన పేరు "ఎక్స్పీరియన్స్ వివేకానంద ప్రాజెక్ట్". ఈ ప్రాజెక్టుని జనవరి 12వ తారీఖున ఇస్రో స్పేస్ సైంటిస్ట్ పద్మశ్రీ ఆర్‌ఎమ్ వాసగం ప్రారంభించారు. ముప్పై తొమ్మిధి ఏళ్ళ వయసు లోనే మరణించాడు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా ప్రకటించింది. ఈ నేలకు సదా కృతజ్ఞలమై ఉండాలి అని చెప్పిన మాతృదేశాభిమాని వివేకానంద. 1867లో శ్రీరామకృష్ణ మిషన్ సంస్థను స్థాపించారు. లక్షలాది ప్రజలు ఆకలి; అజ్ఞానంతో జీవిస్తూండగా వారి గోడు ఏమాత్రం పట్టించుకోని ప్రతి వ్యక్తినీ దేశద్రోహి అనే అంటారు’’ అంటూ ఓ సభా ముఖంగా అన్నారు వివేకానంద.

ప్రాపంచిక విషయాల్లో కొట్టుకొంటూ పురుగుల్లా చావడంకంటే కర్తవ్య నిర్వహణతో మరణించటమే ఉత్తమం అని కూడా చెప్పారు. చివరిగా ఓ మహాసభలో ప్రసంగిస్తూ ‘‘శ్రీరామకృష్ణ పరమహంస వారి సేవకునిగా ఎన్ని జన్మలైనా ఎత్తడానికి నేను సిద్ధమే’’ అంటూ ఆ గురుశిష్యుల సంబంధాన్ని మరోసారి గుర్తుచేసిన నిరహంకారి ఆయన. పాశ్చాత్యుల కొరకు అవతరించిన శంకర భగవత్పాదులే స్వామి వివేకానంద అని కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణవారు చెప్పిన మాట తప్పక అంగీకరించాల్సిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot