2021 నూతన సంవత్సర వేడుకల్లో రికార్డ్ స్థాయిలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలను సృష్టించిన స్విగ్గి, జోమాటో

|

భారతదేశంలో ఆన్ లైన్ ద్వారా ఫుడ్ డెలివరీని అందించే ప్లాట్‌ఫామ్‌లలో ముఖ్యమైన సంస్థలు జోమాటో మరియు స్విగ్గి రెండు 2020 సంవత్సరం ముగింపు డిసెంబర్ 31 న విందు సమయంలో అత్యధికంగా ఆర్డర్లను అందుకున్నాయి. కోవిడ్-సంబంధిత కర్ఫ్యూల కారణంగా ఎక్కువ మంది నూతన సంవత్సర వేడుకలలో భాగంగా ఫుడ్ కోసం ఆన్ లైన్ డెలివరీ మీద ఆధారపడ్డారు. ఇది ఈ రెండు సంస్థలకు చాలా బాగా ఉపయోగపడి ఒక రోజు ఆదాయం బాహుబలి సినిమా బడ్జెట్ ను సునాయాసంగా అందుకున్నది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

డిసెంబర్ 31 ఆన్ లైన్ ఫుడ్ డెలివరీలు

డిసెంబర్ 31 ఆన్ లైన్ ఫుడ్ డెలివరీలు

మునుపటి 2020 నూతన సంవత్సర వేడుకలతో పోలిస్తే 2021 కొత్త సంవత్సర వేడుకలలో భాగంగా డిసెంబర్ 31 2020 న కంపెనీ యొక్క ఆన్ లైన్ డెలివరీలు 60% పెరిగాయి. మునుపు ఎన్నడూ లేని విధంగా డిసెంబర్ 31న అధిక అమ్మకాలను నమోదు చేసిందని జోమాటో సహ వ్యవస్థాపకుడు మరియు సిఇఒ దీపిందర్ గోయల్ తన ట్వీట్లలో తెలిపారు. నిమిషానికి గరిష్టంగా సుమారు 4,254 ఆర్డరులను తాకినట్లు కూడా వెల్లడించారు. దీని ఫలితంగా డెలివరీల ద్వారా కేవలం ఒక్క రోజులోనే సుమారు 75 కోట్ల రూపాయల ఆదాయం పొందినట్లు ప్రకటించారు.

స్విగ్గి

స్విగ్గి సంస్థ యొక్క ప్రతినిధి మాట్లాడుతూ ఒక సంవత్సరం ముందు అదే డిసెంబర్ 31 రోజు విందు సమయంలో ట్రాఫిక్ రెట్టింపుగా ఉన్నందున టైర్ II నగరాల్లో మరియు మెట్రోనగరాలలో ఆన్ లైన్ డెలివరీలు అధికంగా చేయలేకపోయారు. 2020 చివరి రోజు డిసెంబర్ 31 న స్విగ్గీకి అతిపెద్ద సింగిల్ డేగా మారింది అని తెలిపారు. గత రాత్రి మేము ప్రాసెస్ చేయగల డిమాండ్ కంటే చాలా ఎక్కువ చేసాము అని గోయల్ ట్వీట్ చేశారు.

జోమాటో

డిసెంబర్ 31 రాత్రి జోమాటోకు 100,000 డెలివరీ భాగస్వాములు ఉన్నారని గోయల్ తెలిపారు. భారతదేశంలో ఆహార పంపిణీకి వైఫల్యం మరియు కస్టమర్ ఫిర్యాదు రేట్లు అన్ని సమయాలలో తక్కువగా ఉన్నాయని కూడా తెలిపారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా స్విగ్గి నిమిషానికి ఆర్డర్‌లలో గరిష్ట స్థాయిని తాకినట్లు వెల్లడించారు. ఖచ్చితమైన నెంబరును తెలపడానికి కంపెనీ నిరాకరించింది. పెద్ద రెస్టారెంట్ ఎగ్జిక్యూటివ్‌లు మాట్లాడుతూ డెలివరీల కారణంగా న్యూ ఇయర్ వ్యాపారాన్ని అధికం చేసింది. డెలివరీలు అందుబాటులో లేకపోయి ఉన్నట్లు అయితే కనుక పెద్ద రాష్ట్రాల్లో కర్ఫ్యూల కారణంగా 65-70% క్రాష్ అయ్యే అవకాశం ఉంది. పంజాబ్ గ్రిల్, ఆర్ట్‌ఫుల్ బేకర్ మరియు యుమీలను నిర్వహిస్తున్న లైట్ బైట్ ఫుడ్స్, ఆన్‌లైన్ డెలివరీలు కూడా అంతకుముందు నూతన సంవత్సరంతో పోలిస్తే 50% పెరిగాయి.

Best Mobiles in India

English summary
Swiggy and Zomato Created Record Online Food Deliveries on New Year Celebration

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X