Home
News

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఊహించని అదృష్టం.. యూజర్లకు రూ.5 లక్షల వరకు ఫ్రీ క్యాష్ ఆఫర్..

Swiggy Instamart glitch: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక షాకింగ్ ఆఫర్ వైరల్ అవుతోంది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో టెక్నికల్ గ్లిచ్ వల్ల యూజర్లకు ఊహించని డిస్కౌంట్లు వచ్చాయట. ఏకంగా రూ.4,000 నుంచి రూ.5 లక్షల వరకు ఫ్రీ క్యాష్ డిస్కౌంట్లు కనిపించాయని రెడిట్, ఎక్స్‌ పోస్ట్‌ల ద్వారా తెలుస్తోంది. కొంతమంది యూజర్లు ఈ ఫ్రీ క్యాష్ ఆఫర్‌తో ఆర్డర్లు కూడా పెట్టేశారు. ఆర్డర్ పెట్టిన వస్తువులను ఉచితంగానే అందుకున్నారట.

* వైరల్ అయిన పోస్ట్ ఇదే

ఎక్స్‌, రెడిట్‌లో ఒక యూజర్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్. ఆ పోస్ట్‌లో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ మెసేజ్ స్క్రీన్‌షాట్ ఉంది. ఆ మెసేజ్‌లో రూ.199 పైన ఆర్డర్ చేస్తే రూ.5,00,000 ఫ్రీ క్యాష్ మీ సొంతం." అని రాసి కనిపించింది. ఈ పోస్ట్‌కి "స్విగ్గీలో ఎవరో ఒకరు ఉద్యోగం పోగొట్టుకోవడం ఖాయం." అని క్యాప్షన్ జోడించారు.

Swiggy Instamart  Free Cash  Glitch  Users Report Windfall of Up to Rs 5 Lakh

ఈ పోస్ట్ చూసిన యూజర్లు రకరకాలుగా స్పందించారు. కొందరు ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడితే, మరికొందరు ఇంత పెద్ద డిస్కౌంట్ నిజంగా సాధ్యమా అని డౌట్ పడ్డారు. ఒక యూజర్ అయితే "మీకు అంత డబ్బు ఎలా వచ్చింది? రాండమ్‌గా వచ్చిందా?" అని అడిగాడు.

ఇంకొకరేమో ఇది మార్కెటింగ్ ట్రిక్ అని కామెంట్ చేశారు. "నాకు తెలిసిన వాళ్లందరికీ రూ.0-100 డిస్కౌంట్ వచ్చింది. ఎవరికైనా నిజంగా అంత పెద్ద అమౌంట్ వచ్చిందా?" అని సందేహం వ్యక్తం చేశారు. అంటే స్విగ్గీ తనవైపు అందరినీ తిప్పుకోవడానికి, పాపులారిటీ పెంచుకోవడానికి ఇలా చేసి ఉండొచ్చు.

* అందరూ లక్కీ కాదు..

అందరికీ ఈ లక్కు పట్టలేదు. ఒక యూజర్ బాధతో "నాకు మాత్రం రూ.50 మాత్రమే కనిపిస్తోంది" అని కామెంట్ పెట్టాడు. స్విగ్గీ మాత్రం ఆర్డర్లు వెనక్కి ఇవ్వమంటోంది. పోస్ట్ ప్రకారం, డెలివరీ తర్వాత స్విగ్గీ వాళ్లు యూజర్లకు ఫోన్ చేసి గ్లిచ్ ద్వారా కొన్న వస్తువులు వెనక్కి ఇచ్చేయమని అడిగారట.

అంటే కంపెనీ ఈ సమస్యను సరిదిద్ది నష్టాలు తగ్గించుకోవాలని చూస్తోందని అర్థమవుతోంది. ఈ విషయంపై మీడియా వర్గాలు స్విగ్గీని వివరణ కోరగా.. ఇది ఒక గ్లిచ్‌ అని, దీన్ని సాల్వ్ చేస్తున్నామని వివరించింది. ప్రస్తుతానికి ఏ గ్లిచ్‌ని పూర్తిస్థాయిలో సాల్వ్ అయిందో లేదో తెలియాల్సి ఉంది. ఇప్పుడు మీరూ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.

ఇదిలా ఉండగా ఒక యూజర్ మైక్రో SD కార్డ్, లేటెస్ట్ అమెజాన్ ఎకో డాట్ స్పీకర్, వాక్యూమ్ క్లీనర్, ఇంకా గుడ్లు కూడా ఆర్డర్ పెట్టేశాడంట. నేను ఏకంగా రూ.56,000 కొట్టేశాను అని తెగ సంబరపడిపోతున్నాడు ఆ యూజర్. అంతేకాదు, దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయిపోయింది.

ఈ యూజర్ ఫ్రీ క్యాష్ ఆఫర్‌ను వాడేసుకున్నాడు అని టాక్. అయితే చాలామంది స్క్రీన్ షాట్లు షేర్ చేయలేదు మరి వారందరూ ఎంత గెలుచుకున్నారు అనే వివరాలు తెలియాల్సి ఉంది. స్విగ్గీకి ఈ గ్లిచ్ కారణంగా బాగానే నష్టం జరిగి ఉంటుంది. ఐటమ్స్ తిరిగి ఇవ్వని వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కూడా తెలియాల్సి ఉంది.

* బెంగళూరులో మరో స్కామ్ టెన్షన్

ఇకపోతే బెంగళూరులో మరో రకం స్కామ్ జరుగుతోందని ప్రజలు అంటున్నారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో డెలివరీ స్కామ్స్‌ ఎక్కువ అవుతున్నాయని రీసెంట్‌గా రెడిట్‌లో పెట్టిన రెండు పోస్టులు చూస్తే తెలుస్తోంది. ఒక పోస్ట్‌లో ఒక అమ్మాయి తనకు స్విగ్గీ డెలివరీ ఏజెంట్ అని చెప్పి ఒకతను ఫోన్ చేశాడని రాసింది.

"మీకు పార్సెల్ వచ్చింది, అది మీ బాయ్‌ఫ్రెండ్ పేరు మీద ఆర్డర్ చేశారు" అని చెప్పాడట. కానీ ఆమె గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ సిస్టమ్‌ నుంచి ఎలాంటి డెలివరీ నోటిఫికేషన్ రాలేదు. నార్మల్‌గా డెలివరీ పర్సన్ లోపలికి రాకముందే సెక్యూరిటీ వాళ్లు అలర్ట్ మెసేజ్ పంపుతారు.

ఇంకా డౌట్‌గా అనిపించడానికి కారణం ఏంటంటే.. ఆమె గానీ, తన బాయ్‌ఫ్రెండ్ గానీ ఎలాంటి ఆర్డర్ పెట్టలేదు. పార్సెల్ డోర్ దగ్గర పెట్టమని చెప్పినా, తర్వాత చూస్తే అక్కడ ఏమీ లేదు. "ఏదో తేడాగా ఉంది" అని ఆమె రెడిట్ పోస్ట్‌లో రాసింది. ఈ సంఘటనలు చూస్తుంటే స్కామ్స్, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయని అనిపిస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Swiggy Instamart glitch offered huge discounts up to Rs 5 Lakh. Users availed "free cash," placing orders. Swiggy seeks item returns. Bengaluru faces delivery scams.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X