షాకింగ్ స్విగ్గీ స్కామ్.. బెంగళూరు గర్ల్‌ఫ్రెండ్‌కు ఫుడ్ ఆర్డర్ మిస్టరీ.. బాయ్‌ఫ్రెండ్ మైండ్ బ్లాంక్!
Swiggy scam: ఇప్పుడు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ స్కామ్‌లు మామూలైపోయాయి. డెలివరీ ఏజెంట్లు ఆర్డర్లు క్యాన్సిల్ చేయడం, లేదంటే ఎక్స్‌ట్రా డబ్బులు అడగడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ బెంగళూరులో మాత్రం కొత్త రకం మోసం మొదలైందట. రీసెంట్‌గా రెడిట్‌లో ఒక పోస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. సబ్జెక్ట్-ఫిషర్‌మాన్-90 అనే రెడిట్ యూజర్ తన గర్ల్‌ఫ్రెండ్‌కి జరిగిన వింత సంఘటన గురించి చెప్పుకొచ్చాడు.
తన గర్ల్‌ఫ్రెండ్‌కి ఎవరో స్విగ్గీ డెలివరీ ఏజెంట్ అని ఫోన్ చేశాడట. తను ఇంట్లో లేకపోవడంతో, డెలివరీని డోర్ దగ్గర పెట్టమని చెప్పింది. డబ్బు కూడా కట్టిందట. తీరా ఇంటికి వచ్చి చూస్తే పార్సిల్ లేదు. అంతే, అమ్మాయికి మైండ్ బ్లాంక్ అయిపోయింది, ఏం జరిగిందో అర్థం కాలేదు, కంగారుపడిపోయింది.

ఆ అమ్మాయి గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తోంది. అక్కడ నోబ్రోకర్‌హుడ్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంది. అంటే ఎవరొచ్చినా రెసిడెంట్స్ అనుమతిస్తేనే లోపలికి రానిస్తారు. కానీ ఆ రోజు మాత్రం అమ్మాయికి ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. డెలివరీ ఏజెంట్ చెప్పిన ఆర్డర్ తన బాయ్‌ఫ్రెండ్ పేరు మీద ఉందట. కానీ అసలు బాయ్‌ఫ్రెండ్ తన కోసం ఎలాంటి ఆర్డర్ పెట్టలేదు.
తన ఫుడ్ డెలివరీ అకౌంట్లలో అమ్మాయి అడ్రస్ కూడా సేవ్ చేసి లేదు. అమ్మాయి తన అకౌంట్లు చెక్ చేసుకుంది, ఫ్రెండ్స్‌ని, ఫ్యామిలీని ఎవరైనా ఆర్డర్ పెట్టారా అని అడిగింది. కానీ ఎవరూ పెట్టలేదు. ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. రెడిట్ యూజర్లంతా ఇది కామన్ స్కామ్ అని నమ్ముతున్నారు.
* ఫేక్ క్యాష్-ఆన్-డెలివరీ
ఒక యూజర్ అయితే ఇలాంటి మోసాల గురించి చెప్పాడు. స్కామర్లు ఫేక్ క్యాష్-ఆన్-డెలివరీ (COD) ఆర్డర్లు పెడతారు. డబ్బులు కడితే చెత్త ఫుడ్ లేదా ఖాళీ బాక్స్ ఇస్తారు. ఇంకొందరు మాత్రం డేటా లీక్ అయి ఉండొచ్చని అంటున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా లాంటి షాపింగ్ యాప్‌ల నుంచి డేటా లీక్ చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఫుడ్ డెలివరీ అంటే ఎవరైనా పెద్దగా డౌట్ పడకుండా తీసుకుంటారని స్కామర్లు ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చని చెప్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఇదివరకూ జరిగాయట. ఇంకో రెడిటర్ మాక్స్ ఫ్యాషన్ ఆర్డర్ గురించి చెప్పాడు. తను ఆర్డర్ చేయకపోయినా ఆర్డర్ కన్ఫర్మ్ అయినట్టు మెయిల్ వచ్చిందట. వెబ్‌సైట్ కూడా ఫేక్‌లా ఉంది, క్యాన్సిల్ ఆప్షన్ లేదు.
వారం తర్వాత డెలివరీ పర్సన్ స్వెటర్‌తో వచ్చాడు. నోబ్రోకర్‌హుడ్ కమ్యూనిటీలో ఉండటం వల్ల, ఏ ఆర్డర్ డెలివరీ చేస్తున్నారో గుర్తులేక లోపలికి రానిచ్చారట. ఇప్పటికీ అది ఎలా జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. అందుకే అప్రమత్తం కండి, కూడా ఇలాంటి అనుమానాస్పద డెలివరీ కాల్స్ వస్తే, మీ పర్సనల్ డీటెయిల్స్ అస్సలు షేర్ చేయవద్దు. తెలియని పార్సిల్స్ తీసుకోవద్దు.
* బీ అలర్ట్
పేమెంట్ చేసే ముందు మీ ఆర్డర్ హిస్టరీ కచ్చితంగా చెక్ చేసుకోవాలి. వెంటనే డబ్బులు షేర్ చేయకూడదు. స్కామర్లు కొత్త దారులు వెతుకుతున్నారు. రేపొద్దున వారు మిమ్మల్ని కూడా టార్గెట్ చేయవచ్చు కాబట్టి వీటి గురించి మీరు తెలుసుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వార్తను షేర్ చేయండి.


Click it and Unblock the Notifications








