స్విగ్గి & జోమాటో ల మధ్య ముదురుతున్న నగరాల ఉనికి యుద్ధం

|

ఇండియాలో ఫుడ్ డెలివరీ మార్కెట్ గత కొన్ని సంవత్సరాలుగా దూకుడు పోటీని చూస్తోంది.ఒకానొక సమయంలో పలు పోటీదారులు కూడా వచ్చారు.ఈ పోటీలో ఇప్పుడు స్విగ్గి , జోమాటో,ఫుడ్ పాండా మరియు ఉబర్ ఈట్స్ తో పాటు మూడవ మరియు నాల్గవ ఆటగాళ్లతో కూడా ఫుడ్ డెలివరీ మార్కెట్ చాలా రసవత్తరంగా(హీట్)గా తయారయింది.

 
swiggy zomato increase presence tier 2 tier 3 cities foodtech battle heats

ఏదేమైనా ఓలా ఇప్పుడు డౌన్ స్కేల్ ను నిర్ణయించుకుంది. ఓలా ప్రస్తుతం ఫుడ్ పాండాతో కలిసి క్లౌడ్ కిచెన్స్ పై దృష్టి పెట్టారు. ఉబర్ తన ఫుడ్ డెలివరీ ఆర్మ్ ను విక్రయించడానికి చూస్తున్నారని వార్తలు వచ్చాయి.

కొత్త కొత్త నగరాలలో

కొత్త కొత్త నగరాలలో

స్విగ్గి మరియు జోమాటో ఇద్దరూ ప్రతి రోజు కొత్త కొత్త నగరాలలో తమ కార్యకలాపాలను విస్తరించడానికి సమర్ధవంతమైన కార్యాచరణను చేస్తున్నాము అని చెప్తారు. Zomato దేశవ్యాప్తంగా వివరములు లేని అన్ని ప్రాంతాలను కూడా పరీక్షిస్తుందని మరియు దాని సగటు డెలివరీ సమయంను కూడా మెరుగుపరచడంపై దృష్టి పెడుతున్నామని చెప్పారు.స్విగ్గి ప్రతి నగరంలో లోతుగా వెళ్లి ప్రతి నగరాన్ని తమ కార్యాచరణతో గెలుచుకుంటున్నారు.

స్విగ్గి ఉనికి:

స్విగ్గి ఉనికి:

బెంగళూరు ఆధారిత ఫుడ్ పంపిణీదారు స్విగ్గి ఇప్పుడు తన ఉనికిని మరి కొన్ని పట్టణాలకు మరియు నగరాలకు విస్తరించింది మరియు ఇప్పుడు 200 నగరాలలో తన ఉనికి ఉంది.స్విగ్గి ఇప్పుడు దాని విస్తరణలో భాగంగా తమిళనాడులోని తూథుకుడి, కర్ణాటకలోని హసన్ మరియు బీదర్లలో ; తెలంగాణలోని ఖమ్మం మరియు కరీంనగర్; ఆంధ్రప్రదేశ్ లోని కరీంనగర్,మదనపల్లిలో తన కార్యకలాపాలు ప్రారంభించింది.

జొమాటో ఉనికి:
 

జొమాటో ఉనికి:

ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే స్విగ్గి ప్రత్యర్థి అయిన జొమాటో కూడా 300+ నగరాలకు తన ఉనికిని విస్తరించింది.కేరళలోని కొట్టాయం, మూవత్తుపుళ, అలప్పుజ్; తమిళనాడులోని అంబూర్, హోసూర్, తూథుకుడి, నాగర్ కొయిల్ లలో మరియు; ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం, నంద్యాల, ఒంగోలు, తనుకు, శ్రీకాకుళం; కర్నాటకలోని కార్వార్, కుండపుర-కోటిశ్వర్, బిదార్, కోలార్, మూడ్బిద్రి, కాసర్గోడ్, మాండ్య, మడికేరి, గడగ్-బెటేగేరి, భత్కల్ మరియు చిత్రదుర్గ ; తెలంగాణలోని నిజామాబాద్ మరియు సిద్దిపేట్ లలో తమ కార్యకలాపాలను ప్రారంభించారు.

మార్కెట్ వాటా:

మార్కెట్ వాటా:

మార్కెట్ ఇంటలిజెన్స్ సంస్థ కాలాగాటో నుండి వచ్చిన తాజా సమాచారం ప్రకారం స్విగ్గి ఫుడ్ డెలివరీ మార్కెట్ లో మొదటి స్థానంలో ఉంది. లావాదేవీల వాల్యూమ్ ద్వారా రోజు దాదాపు సగం మార్కెట్ వాటాను స్విగ్గి కలిగి ఉంది. ఈ డేటా ప్రకారం Swiggy మార్కెట్ వాటా 36.40%, Zomato మార్కెట్ వాటా 23.78%. వినియోగదారుడు సగటున చేసే ఖర్చు పౌనఃపున్యం ప్రకారం Swiggy Zomato మీద పైచేయి సాదించింది.

ఇండియన్ ఫుడ్ డెలివరీ మార్కెట్లో Swiggy చాలా ఎక్కువ వాటాను కలిగి ఉంది.2018లో ఉబర్ ఈట్స్ వచ్చినప్పుడు దేశంలో ఫుడ్ డెలివరీ మార్కెట్లో రెండవ స్థానంలో Zomato ఉంది. App Annie నివేదిక ప్రకారం ఇండియాలో Zomato టైర్ 2 మరియు 3 నగరాల్లో చాలా పెద్ద ఉనికిని కలిగి ఉంది. ఇది 30% పైగా మార్కెట్ వాటాను కలిగి ఉంది.

 

ఆఫర్లు  మరియు డిస్కౌంట్లు :

ఆఫర్లు మరియు డిస్కౌంట్లు :

Swiggy మరియు Zomato రెండు దాని వేదికల మీద మరింత మంది వినియోగదారులను ఆకర్షించడానికి చాలా రకాల ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ఆవిష్కరణ చేశారు. Zomato గోల్డ్ వంటి సమర్పణలతో Zomato ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ ఆహార ప్రేమికులను ఆకట్టుకోవడానికి ట్యాప్ చేయగలిగింది.

Swiggy కూడా తన సొంత లాయల్టీ ప్రోగ్రామ్ 'స్విగ్ సూపర్' ని ప్రారంభించింది.వీటితో పాటు స్విగ్గి పాప్, స్విగ్గి స్టోర్స్ మరియు ఇటీవల ప్రారంభించిన స్విగ్గి డైలీ వంటి వివిధ ఉత్పత్తులను కూడా ప్రారంభించింది.

 

Best Mobiles in India

English summary
swiggy zomato increase presence tier 2 tier 3 cities foodtech battle heats

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X