Just In
- 14 hrs ago
Airtel యొక్క కొత్త యాడ్-ఆన్ ప్యాక్‌ల ప్రయోజనాల మీద ఓ లుక్ వేయండి...
- 16 hrs ago
jio యూజర్లకు గుడ్ న్యూస్!! రూ.11 డేటా వోచర్‌తో 1GB డేటా ప్రయోజనం...
- 17 hrs ago
DTH మార్కెట్ వాటాలో ఇతరులను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో టాటా స్కై!!
- 17 hrs ago
WhatsaApp వెబ్ లో మరో కొత్త ఫీచర్..! త్వరలోనే అందరికీ ...!
Don't Miss
- Finance
భారత్ V షేప్ రికవరీ, నాలుగింట ఒకవంతు తుడిచి పెట్టుకుపోయాయి: RBI
- News
ప్రొద్దుటూరులో ప్రేమోన్మాది దాడి... 3 నెలలుగా యువతికి టార్చర్... వాడిని వదలొద్దు సార్ అంటూ...
- Movies
RRR యూనిట్‌కు భారీ షాకిచ్చిన నటి: కొత్త రిలీజ్ డేట్‌ను అలా లీక్ చేసింది.. డిలీట్ చేసే లోపే పట్టేశారుగా!
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ట్రాయ్ తీపి కబురు, ఇకపై సెట్ టాప్ బాక్స్ మార్చనవసరం లేదు
టీవీ వీక్షకులకు శుభవార్త. మీకు త్వరలోనే పోర్టబిలిటీ సౌకర్యం అందుబాటులోకి రానుంది. సెట్ టాప్ బాక్స్ (ఎస్‌టీబీ) మార్చే పని లేకుండానే డీటీహెచ్, కేబుల్ ఆపరేటర్లను మార్చే వెసులుబాటు కల్పించేందుకు ట్రాయ్ ప్రయత్నిస్తోంది. ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ ఈ మేరకు యూజర్లకు శుభవార్తను అందించారు. ఈ ఏడాది చివరి నుంచి సెట్ టాప్ బాక్స్ మార్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన చెబుతున్నారు.
సెట్ టాప్ బాక్స్ (ఎస్‌టీబీ) మార్చుకోకుండానే డీటీహెచ్, కేబుల్ ఆపరేటర్లను మార్చే వెసులుబాటు త్వరలో తీసుకు రానున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ సౌకర్యం యూజర్లకు అందుబాటులోకి రావొచ్చు.

సెట్ టాప్ బాక్స్‌ల ఇంటర్ ఆపరబిలిటీపై
గత రెండేళ్లుగా సెట్ టాప్ బాక్స్‌ల ఇంటర్ ఆపరబిలిటీపై పనిచేస్తున్నామని ట్రాయ్ చైర్మన్ ఆర్.ఎస్.శర్మ తెలిపారు. చాలా సమస్యలను పరిష్కరించామన్నారు. ఇంకా కొన్ని వ్యాపారపరమైన సవాళ్లు మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు.

పెద్ద పెద్ద సమస్యలు
దీనిని అమలు అడ్డంకిగా ఉన్న పెద్ద పెద్ద సమస్యలు తీరిపోయాయని చెప్పారు. వీటిపై దృష్టి సారించామని, ఈ ఏడాది చివరి నాటికి ఈ సమస్యకు కూడా ముగింపు పలుకుతామన్నారు. ఈ వ్యాపార సవాళ్లు కూడా పరిష్కారమైతే ఈ ఏడాది చివరి నాటికి పోర్టబులిటీ అందుబాటులోకి వస్తుందన్నారు.

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి..
డీటీహెచ్, కేబుల్ సర్వీసులకు సంబంధించి ట్రాయ్ కొత్త టారిఫ్ నిబంధనలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం మీరు ఒక ఆపరేటర్ నుంచి మరో ఆపరేటర్‌కు మారితే కొత్త ఆపరేటర్ దగ్గర మళ్లీ సెటాప్ బాక్స్ కొనాలి.

డీటీహెచ్ వాడుతూ మరో డీటీహెచ్‌లోకి మారాలంటే ..
డీటీహెచ్‌కు కూడా ఇదే విధానం ఉంది. ఒక డీటీహెచ్ వాడుతూ మరో డీటీహెచ్‌లోకి మారాలంటే కొత్త బాక్సు కొనాల్సిందే. దీంతో వినియోగదారులకు ఆపరేటర్‌ను మార్చాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

కేబుల్ టీవీ సబ్ స్క్రైబర్లలో ఆందోళనలు
కొత్త టారిఫ్ నిబంధనలకు సంబంధించి కొద్ది వారాలుగా కేబుల్ టీవీ సబ్ స్క్రైబర్లలో ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టీడీహెచ్ సర్వీస్ ప్రొవైడర్లు బేస్ ప్యాక్‌లోనే అపరిమిత ఫ్రీ టు ఎయిర్ చానళ్లను అందిస్తున్నాయి.

దేశీయ మొబైల్ ఫోన్ పరిశ్రమ విజయవంతం కావడానికి..
ఇంటర్ ఆపరేబిలిటీ ఆలోచన వచ్చిన వెంటనే సాధ్యం కాదని, ఇందుకు తొలుత ప్రణాళికను ప్రవేశపెట్టాల్సి ఉంటుందన్నారు. దేశీయ మొబైల్ ఫోన్ పరిశ్రమ విజయవంతం కావడానికి ఇంటర్ ఆపరేబిలిటీ కీలకమైన అంశంగా పేర్కొన్నారు. దేశంలో పరికరాలకు సంబంధించిన ఎకో సిస్టమ్‌పై అధ్యయనాన్ని శర్మ ఈ సందర్భంగా విడుదల చేశారు
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190