నోకియా, సింబియన్‌ ఓఎస్‌ల స్నేహం 2016 దాకా కోనసాగాల్సిందే...

Posted By: Staff

నోకియా, సింబియన్‌ ఓఎస్‌ల స్నేహం 2016 దాకా కోనసాగాల్సిందే...

మొబైల్స్ రంగంలో రారాజులా వెలిగొందింది నోకియా. అలాంటి నోకియా పబ్లిక్‌గా రాబోయే కాలంలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్స్‌ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీనివల్ల గత కొన్ని సంవత్సరాలుగా నోకియాతో పెనవేసుకుపోయిన సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇక కనుమరుగవుతుందనే చెప్పాలి. దీంతో దీనిపై స్పష్టత తీసుకురావడానికి స్వయంగా నోకియా సిఈవో స్టీఫెన్ ఎలాప్ మాట్లాడుతూ సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని కనీసం 2016 వరకు అన్నా తీసుకురావడానికి మేము సిద్దంగా ఉన్నామని తెలిపారు.

చైనా ఎడిషన్‌కు ఇచ్చినటువంటి ఇంటర్యూలో నోకియా సిఈవో స్టీఫెన్ ఎలాప్ 2016 సంవత్సరం వరకు నోకియా స్మార్ట్ ఫోన్స్ ఏవేవి ఐతే సింబియన్‌తో విడుదల అయ్యాయే వాటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కస్టమర్ సర్వీస్ మెయింటెన్ అందిస్తామని అన్నారు. నోకియా ఎదుగుదలకు కారణమయినటుంటి సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని అంత తేలికగా కనుమరుగు కానివ్వమని తెలిపారు.

ఇది ఇలా ఉండగా నోకియా త్వరలో స్మార్ట్ పోన్‌ని అంటే మైక్రోసాప్ట్ విండోస్ పోన్ 7ని ఈ సంవత్సరం చివరలో మార్కెట్‌‌లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ నిపుణులు వెల్లడించారు. తైవాన్ కమర్షియల్ టైమ్స్ ప్రకారం తైవనీస్ హ్యాండ్ సెట్ కాంట్రాక్ట్ తయారీదారు అయిన కంపాల్ కమ్యానికేషన్స్ నోకియా కంపెనీ విండోస్ ఫోన్స్ ఆర్డర్స్ వచ్చిన్నట్లు ప్రకటించింది. విండోస్ ఫోన్స్ తయారుచేయడాన్ని నాల్గవ క్వార్టర్‌లో ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot