షార్ట్ ఫిల్మ్స్‌ భవితవ్యం మొబైల్స్, టాబ్లెట్స్‌లలో...

Posted By: Super

షార్ట్ ఫిల్మ్స్‌ భవితవ్యం మొబైల్స్, టాబ్లెట్స్‌లలో...

గోవాలో ఇండియన్ డాక్యుమెంటరీ ప్రోడ్యూసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మైక్ పాండే మాట్లాడుతూ రాబోయే కాలంలో డాక్యుమెంటరీ సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్‌కి టాబ్లెట్స్, మొబైల్ ఫోన్స్ అనుసంధానంగా పని చేస్తాయని అన్నారు. వైల్డ్ లైఫ్ గురించి సినిమాలు తీసేటుటవంటి మైక్ పాండే 42వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మాట్లాడుతూ ఇన్పర్మేషన్ బ్రాడ్ క్యాస్టింగ్ మినిస్టర్‌తో మాట్లాడి, స్కూల్, యూనివర్సిటీ లెవల్ నుండే మంచి అవార్డ్ విన్నింగ్ డాక్యుమెంటరీ సినిమాలను తీసేందుకు ఐడిపిఎ(ఇండియన్ డాక్యుమెంటరీ ప్రోడ్యూసర్స్ అసోసియేషన్) ప్రయత్నాలను ముమ్మరం చేసిందని తెలిపారు.

రాబోయే కాలంలో వచ్చేటటువంటి డాక్యామెంటరీ సినిమాలన్నీ కూడా టాబ్లెట్స్, మొబైల్ ఫోన్స్‌లలో వస్తాయని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆ దిశగా ప్రస్తుతం టెక్నాలజీని ఉపయోగించుకునేందుకు సర్వ సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. గతంలో మైక్ పాండే గ్రీన్ ఆస్కార్ అవార్డుని కూడా సొంతం చేసుకున్నారు. గోవాలో జరిగే 42వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌కి అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిల్మ్స్‌ని ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.

ఈ అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిల్మ్స్‌ని గతంలో ఎక్కడ కూడా మీరు చూసి ఉండకపోవచ్చు. ఈ షార్ట్ ఫిల్మ్స్‌ని స్కూల్స్, యూనివర్సిటీ విద్యార్దులు రూపొందించడం జరిగిందన్నారు. ఇదే సందర్బంలో ఇండియాలో సంవత్సరానికి సుమారు 2000 షార్ట్ ఫిల్మ్స్‌ని రూపొందిస్తున్నారని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot