తైవాన్‌లో భారీ భూకంపం.. ఆపిల్ ఐఫోన్, మ్యాక్‌బుక్ తయారీపై తీవ్ర ప్రభావం.. ఎందుకంటే..?
తైవాన్‌లో బుధవారం భారీ భూకంపం (Taiwan Earthquake) వచ్చింది. రిక్టార్ స్కేల్‌పైన 7.4 నమోదైంది. గత 25 సంవత్సరాల్లో ఇంత భారీ భూకంపం ఎప్పుడూ రాలేదని తెలుస్తోంది. భూకంపం కారణంగా 9 మంది మరణించగా.. సుమారు 1000 కి పైగా గాయపడ్డారు. దీంతోపాటు తైవాన్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ భవనాలు దెబ్బతిన్నాయి.
అయితే తైవాన్‌లో భూకంపం కారణంగా TSMC (తైవాన్ సెమీ కండక్డర్ కంపెనీ) సంస్థ ప్లాంట్‌లు దెబ్బతిన్నాయి. ఈ సంస్థ అనేక ప్రముఖ సంస్థలకు చిప్‌సెట్‌లు సరఫరా చేస్తుంది. ఈ జాబితాలో ఆపిల్ సంస్థ కూడా ఉంది. TSMC సంస్థ ఆపిల్‌కు కావాల్సిన కస్టమ్ చిప్‌లను సరఫరా చేస్తుంది. ఇందులో A సిరీస్ చిప్‌సెట్‌లను ఐఫోన్లు, ఐప్యాడ్, ఆపిల్‌టీవీలో ఉపయోగించారు.

ఈ కారణంగా ఆపిల్ ఐఫోన్లు మరియు మ్యాక్‌బుక్‌ల తయారీ కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఫలితంగా ఆపిల్ కొత్త ఉత్పత్తుల లాంచింగ్ ఆలస్యం కానుంది. MacRumors రిపోర్టు ఆధారంగా తైవాన్ సెమీ కండర్డర్ కంపెనీకి చెందిన N3 ప్యాబ్రికేషన్ ప్లాన్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
కంపెనీలోని EUV (Extreme Ultraviolet) మెషిన్లు కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు పరిశోధన, అభివృద్ధికి సంబంధించిన ల్యాబోరేటరీలు కూడా భారీగా డ్యామేజీ జరిగినట్లు తెలుస్తోంది. దీంతోపాటు మరో ప్యాబ్రికేషన్ ప్లాంట్‌లోనూ పైప్‌లైన్లు సహా ఇతర ప్రాంతాల్లో డ్యామేజీ జరిగింది. ఈ ప్రభావం ఉత్పత్తి మీద పడుతుంది.
ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మరియు ప్రో మ్యాక్స్‌లో వినియోగిస్తున్న 3nm A17 ప్రో చిప్‌ల తయారికి వారాలపాటు స్థిరమైన వ్యవస్థలు అవసరం. ప్రస్తుతం ప్లాంట్‌లు సహా ఇతర పరికరాలు డ్యామేజీ కావడం వల్ల ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. దీనిపై TSMC చర్యలు ప్రారంభించింది. ఇవాళ్టి నుంచే ఉత్పత్తి ప్రారంభించేలా ప్లాన్ చేస్తోంది.
అయితే తైవాన్ భూకంపం కారణంగా TSMC సంస్థ డ్యామేజీ కావడం ఆపిల్ ఉత్పత్తులపై ఎంత ప్రభావం చూపుతుందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆపిల్ సంస్థ విజన్ ప్రో ఉత్పత్తిలో వేగం పెంచేలా ప్రయత్నం చేస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో భారీగా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.
దీంతోపాటు ఐపిల్ 16 సిరీస్ పైన ఆపిల్ పనిచేస్తోంది. ఈ సంవత్సరం లోనే ఈ స్మార్ట్‌ఫోన్లు విడుదల కానున్నాయి. దీంతోపాటు ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్ స్టూడియో, మ్యాక్ ప్రో, ఆపిల్ వాచ్ సిరీస్ 10 మరియు ఆపిల్ వాచ్ అల్ట్రా 3 పైన ప్రస్తుతం పనిచేస్తోంది.
తైవాన్‌లో భూకంపం కారణంగా సునామీ అలెర్ట్ కూడా జారీ చేశారు. అనంతరం ఆ ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. గత 25 సంవత్సరాల్లో తైవాన్‌లో ఇంత భారీ తీవ్రతలో భూకంపం రావడం ఇదే తొలిసారి తెలుస్తోంది. తైవాన్.. భూకంపాలు ఎక్కువగా ఉండే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉంది. ఫలితంగా అక్కడ ప్రభుత్వం, ప్రజలు ఎల్లప్పుడూ దీనిపై అప్రమత్తంగా ఉంటారు.
అయితే బుధవారం ఉదయం 7.58 గంటలకు భారీ స్థాయిలో ఒక్కసారిగా భూకంపం వచ్చింది. ఫలితంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్కూల్స్, కాలేజీల్లోని విద్యార్థులను సమీపంలోని గ్రౌండ్‌లకు తరలించారు. రోడ్లు, భవనాలు, బ్రిడ్జిలు కూడా ధ్వంసం అయ్యాయి. తొలుత సునామీ హెచ్చరికలు జారీచేశారు. అనంతరం మధ్యాహ్న సమయానికి ఉపసంహరించుకున్నారు.


Click it and Unblock the Notifications