ప్రపంచంలో కెల్లా ఖరీదైన యాపిల్ స్టోర్ ఆ దేశంలో..

Posted By: Staff

ప్రపంచంలో కెల్లా ఖరీదైన యాపిల్ స్టోర్ ఆ దేశంలో..

యాపిల్ ఇటీవలే చైనాలోని హాంగ్ కాంగ్‌లో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అత్యంత ఖరీదైన యాపిల్ స్టోర్‌ని ప్రారంభించింది. ఈ యాపిల్ స్టోర్‌ని చూసిన ప్రతి ఒక్కరు కూడా వారి నొటి నుండి వావ్ అని అనాల్సిందే. ఈ యాపిల్ స్టోర్ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు పాఠకుల కొసం ప్రత్యేకంగా...

* మొత్తం ప్లోర్ అడుగు భాగాన వైశాల్యం 15,000 sq/ftతో, రెండంతస్దుల భవనం కట్టడం జరిగింది. ఇలా మొత్తం 407 మిలియన్ sq/ft చదరపు వైశాల్యంలో కట్టడం జరిగింది.

* ఈ యాపిల్ స్టోర్‌ని ప్రతి రోజుకి సుమారుగా 40,000 మంది కస్టమర్స్ విజిట్ చేయవచ్చు. సాధారణంగా అమెరికాలో ఉన్న షాపింగ్ మాల్స్‌లో రోజు వచ్చేటటువంటి జనాభాకి ఇది నాలుగు రెట్లుతో సమానం.

* ఈ యాపిల్ స్టోర్‌ని యాపిల్ కంపెనీ పది సంవత్సరాల పాటు లీజ్‌కి తీసుకొవడం జరిగింది. ఇందుకు గాను యాపిల్ కంపెనీ సంవత్సరానికి $9.4 మిలియన్లను చెల్లించనుంది.

* అంతేకాకుండా ఈ స్టోర్‌ని సుందరంగా తీర్చిదిద్దడానికి యాపిల్ ప్రత్యేకంగా $20 మిలియన్లు ఖర్చుపెట్టింది.

ఇంత ఖరీదైన యాపిల్ స్టోర్‌ని చైనాలో నిర్మించడానికి గల కారణం ప్రపంచంలో చైనా పాపులేషన్ ఎక్కవ కాబట్టి. అక్కడున్న జనాభాని ఆకర్షించాలంటే ఆమాత్రం స్టోర్ ఉండాలని అన్నారు. ఈ యాపిల్ స్టోర్‌పై యాపిల్ అధికార వర్గాలు చాలా ఆశలను పెట్టుకున్నారు. సాధారణంగా చైనాలో నకిలీ ఉత్పత్తులను ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు.

అలాంటి వారి నుండి చైనీయులను కాపాడి ఓరిజినల్ యాపిల్ ప్రోడక్ట్స్‌ని అందించాలంటే వారిని ఆకర్షించడమే మా ముందున్న ప్రధాన అస్తం అని యాపిల్ ప్రతినిధి ఒకరు అన్నారు. అంతేకాకుండా యావత్ చైనా ప్రజలకు యాపిల్ యొక్క విశిష్టతలను తెలియజేయడం, తిరిగి చైనాలో యాపిల్ పూర్వవైభవాన్ని తెచ్చుకునేందుకు ఇదో మార్గంగా అభివర్ణించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot