అందాలను ఎరచూపి.. ఆపై వలపన్ని.. ఉగ్రవాదుల తాజా ప్లాన్!

Posted By: Staff

అందాలను ఎరచూపి.. ఆపై వలపన్ని.. ఉగ్రవాదుల తాజా ప్లాన్!

 

 

తెలివితేటలను ఏఏ సందర్భాల్లో ఏలా ఉపయోగించాలా తాలిబన్ ఉగ్రవాదులకు బాగా వంటపట్టినట్లుంది.  ఎంతవారైనా కాంతదాసులే అన్న సామెతను గ్రహించిన ఉగ్రవాదులు తమ పై దాడులకు దిగుగున్న సంకీర్ణదళాల  వ్యూహాలను రాబట్టేందుకు ఫేస్‌బుక్‌ను సాధనంగా చేసుకున్నారు. ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయిల నకిలీ ప్రొఫైల్‌ను పెట్టి సైనికులతో స్నేహం చేస్తున్నట్లు  నటిస్తూ వారినుంచి  సమాచారాన్ని సుకరిస్తున్నారని  ఆస్ట్రేలియా వెల్లడించింది.  ఫేస్‌బుక్‌లో ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయని అనుమతిలేకుండా మన సమాచారాన్ని ఎదుటివారు సేకరించలేరని అనుకోరాదని తెలిపింది.

అఫ్ఘానిస్థాన్ వెళ్లబోతున్న ఆస్ట్రేలియన్ సైనికులకు ఆదేశ రక్షణవర్గాలు ముందుగా అక్కడి పరిస్థితులతోపాటు సోషల్ నెట్‌వర్క్‌లతో ప్రమాదాన్ని వివరించాయి. సైన్యాన్ని తప్పుదోవ పట్టించడానికి శత్రువులు తప్పుడు అడ్రస్‌లతో పరిచయం పెంచుకుంటారని హెచ్చరించాయి. తమ బంధువులు, కుటుంబసభ్యులకోసం సైనికులు ఫొటోలు పంపిస్తే.. దానినిబట్టి వారు ఏ ప్రాంతంలో ఉన్నారో తెలుసుకోవడం సులభమని పేర్కొన్నాయి. వ్యకిగత సమాచారాన్ని కూడా ఆన్‌లైన్‌లో పంచుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరమని సూచించాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting