యూట్యూబ్ వేదికగా దొంగనోట్లు ముద్రణ, యువతి అతి తెలివి

యూట్యూబ్ అందరికీ ఎంత ఉపయోగకరంగా ఉందో అంతే స్థాయిలో దానిపై విమర్శలు వస్తున్నాయి. అందులో అప్ డోట్ చేసే కంటెంట్ నీ వీక్షించిన వీక్షకులు సరికొత్త మార్గాల వైపు పయనిస్తున్నారు. ఇందులో భాగంగానే అప్పుల నుంచి

|

యూట్యూబ్ అందరికీ ఎంత ఉపయోగకరంగా ఉందో అంతే స్థాయిలో దానిపై విమర్శలు వస్తున్నాయి. అందులో అప్ డోట్ చేసే కంటెంట్ నీ వీక్షించిన వీక్షకులు సరికొత్త మార్గాల వైపు పయనిస్తున్నారు. ఇందులో భాగంగానే అప్పుల నుంచి తప్పించుకోవడానికి ఓ యువతి ఏకంగా యూట్యూబ్‌లో చూసి దొంగ నోట్ల ముద్రణ నేర్చుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..చెన్నై నగరంలోని మారియప్ప నగర్‌కు చెందిన భరణి కుమారి ఎంబీఏ పూర్తి చేసి ఇంటి వద్దనే ఖాళీగా ఉంటుంది.

యూట్యూబ్ వేదికగా దొంగనోట్లు ముద్రణ, యువతి అతి తెలివి

అయితే కుటుంబ ఇబ్బందుల కారణంగా ఇరుగు పొరుగు వారి వద్ద పెద్ద ఎత్తున అప్పులు చేసింది. కానీ వాటిని తీర్చలేకపోయింది. దీంతో అప్పులు ఇచ్చిన వారు భరణి కుమారిని ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేయడం ప్రారంభించారు.

దొంగ నోట్ల ముద్రణ

దొంగ నోట్ల ముద్రణ

ఈ అప్పుల ఊబి నుండి ఎలా బయటపడాలో తెలియక భరణి కుమారి యూట్యూబ్‌లో దొంగనోట్లు ఎలా ముద్రించాలో అప్ లోడ్ చేసిన వీడియోలు చూసి దొంగ నోట్ల ముద్రణ నేర్చుకుంది. ఆ తరువాత ఇంట్లోనే దాదాపు రూ. లక్ష విలువ చేసే నకిలీ నోట్లను ముద్రించసాగింది.

అక్కడక్కడ మారుస్తూ

అక్కడక్కడ మారుస్తూ

ఇలా ముద్రించిన వాటిని సమీపంలోని కడలూరులో అక్కడక్కడ మారుస్తూ వచ్చింది. ఇలా కొంత కాలం బాగా సజావుగా నడిచింది. అయితే కడలూరులోని ఓ దుకాణానికి వెళ్లి సామాన్లు కొన్న భరణి నకిలీ రెండు వేల రూపాయల నోటును దుకాణ యజమానికి ఇచ్చింది. నోటు క్వాలీటిలో తేడా గమనించిన..దుకాణదారు.. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు

సమాచారం అందుకున్న పోలీసులు

సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.. పోలీసుల రాకతో బిత్తర పోయిన భరణి.. దగ్గరలోని బస్టాండ్‌కు వెళ్లి చిదంబరం వెళ్లే బస్సు ఎక్కి కూర్చుంది.

పోలీసులు బస్టాండ్‌ అంతా వెతికి బస్సులో ఉన్న భరణిని అరెస్ట్‌ చేసి విచారణ చేయగా అప్పుల భారం నుంచి తప్పించుకోవడానికే ఇలా నకిలీ నోట్ల ముద్రణ ప్రారంభించినట్లు విచారణలో వెల్లడించింది.

యూట్యూబ్ ద్వారా ఇలాంటి పనులు

యూట్యూబ్ ద్వారా ఇలాంటి పనులు

దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు భరణి ఇంటి నుండి.. నకిలీ రెండు వేల రూపాయల నోట్లను..దాంతో పాటు ప్రింటర్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. యూట్యూబ్ ద్వారా ఇలాంటి పనులు కూడా సాగగుతున్నాయా అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Best Mobiles in India

English summary
Tamil Nadu woman makes counterfeit notes watching videos, arrested

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X