బెస్ట్ Airtel ఆఫర్స్ కోసం చూస్తున్నారా..? ఇక్కడ ఆగండి

ఉచిత ఆఫర్లతో భారత టెలికం రంగంలో పెను సంచలనానికి తెరతీసిన రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్ టెల్ సరికొత్త ఆఫర్లతో ముందుకొస్తోంది. తాజాగా, రిలయన్స్ జియోకు కౌంటర్‌గా 90 రోజుల ప్లాన్‌లతో ఎయిర్‌టెల్ దూసుకొచ్చింది. తన 4జీ యూజర్ల కోసం రూ.1,494 టారిఫ్‌లో స్పెషల్ డేటా ప్లాన్‌ను ఎయిర్‌టెల్ లాంచ్ చేసింది.

Read More : మీ ఫోన్‌లో జియో ఇంటర్నెట్ నెమ్మదిగా ఉందా..? స్పీడ్ పెరగాలంటే ఇలా చేయండి

బెస్ట్ Airtel ఆఫర్స్ కోసం చూస్తున్నారా..? ఇక్కడ ఆగండి

ఈ ప్యాక్‌ను పొందే ఎయిర్‌టెల్ యూజర్లు 90 రోజుల పాటు ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది. ఈ స్పెషల్ 4జీ డేటా ప్యాక్‌కు ఫెయిర్ యూసేజ్ పాలసీ వర్తిస్తుందని ఎయిర్‌టెల్ వెల్లడించింది. 90 రోజుల ప్లాన్ వ్యాలిడిటీలో మొదటి 30 జీబి వరకు 4జీ స్పీడ్ వర్తిస్తుందని, లిమిట్ దాటిన తరువాత ఇంటర్నెట్ వేగం 2జీకి పడిపోతుందని ఎయిర్‌టెల్ చెబుతోంది. అన్ని వర్గాల యూజర్లకు, అన్ని రకాల కమ్యూనికేషన్ అవసరాలను తీర్చే విధంగా మార్కెట్లో సిద్దంగా ఉన్న 10 బెస్ట్ Airtel ప్లాన్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం...

Read More : జనవరి నుంచే BSNL ఉచిత వాయిస్ కాల్స్..రూ.2కే?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.18కే 150 లోకల్ ఎస్ఎంఎస్‌లు

మీరు Airtel అందిస్తోన్న బెస్ట్ మెసెజ్ ఆఫర్ కోసం చూస్తున్నారా..? అయితే, ఈ ప్లాన్‌ను ట్రై చేయడి. రూ.18 చెల్లిస్తే 150 ఎస్ఎంఎస్‌లు మీకు లభిస్తాయి. ప్లాన్ వ్యాలిడిటీ వచ్చేసరికి 14 రోజులు.

రూ.21కే ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్

మీరు తరచూ ప్రయాణాలు చేస్తుంటారా..? అయితే, ఈ ఉచిత ఇన్‌కమింగ్ ప్లాన్ మీకు ఉపయోగపడొచ్చు. రూ.21 చెల్లించినట్లయితే మీరు బయట ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఇన్‌కమింగ్ కాల్స్ పూర్తిగా ఉచితం. అవుట్ గోయింగ్ కాల్స్‌కు నిమిషానికి 80 పైసులు ఛార్జ్ చేస్తారు. STD కాల్స్ పై 1.15 పైసలు వసూలు చేస్తారు. ప్లాన్ వ్యాలిడిటీ వచ్చేసరికి 5 రోజులు.

అన్ని కాల్స్‌కు సెకనుకు పైసా పడాలంటే

మీరు రోజు ఎక్కువ కాల్స్ చేస్తుంటారా..? అయితే, ఈ సెకనుకు పైసా ప్లాన్ మీకు ఉపయోగపడొచ్చు. ప్లాన్ క్రింద రూ.27 చెల్లించినట్లయితే ఏ నెట్‌వర్క్‌కు కాల్ చేసినా సెకనుకు పైసా చొప్పున ఛార్జ్ చేస్తారు. ప్లాన్ వ్యాలిడిటీ వచ్చేసరికి 28 రోజులు.

రూ.46 చెల్లిస్తే 120ఎంబి 2G/3G/4G డేటా

పొదుపైన 2G/3G/4G ఇంటర్నెట్ ప్యాక్ కోసం చూస్తున్నారా..? ? అయితే, ఈ ప్లాన్ మీకు ఉపయోగపడొచ్చు. ప్లాన్ క్రింద రూ.46 చెల్లించినట్లయితే 120ఎంబి 2G/3G/4G డేటా 28 రోజుల వ్యాలిడిటీతో మీకు లభిస్తుంది. రూ.47 చెల్లించినట్లయితే 180ఎంబి 2G/3G/4G డేటా మీకు లభిస్తుంది. వ్యాలిడిటీ 5 రోజుల మాత్రమే.

రూ.100 రీఛార్జ్ చేస్తే రూ.83.96 పైసల టాక్‌టైమ్

Airtel యూజర్లు రూ.100 రీఛార్జ్ చేస్తే రూ.83.96 టాక్‌టైమ్ లభిస్తుంది. సిమ్ గడువు ముగిసేంత వరకు ఈ టాక్‌టైమ్‌కు వ్యాలిడిటీ ఉంటుంది.

రూ.249కే స్పెషల్ రీఛార్జ్ కాంబో ప్లాన్

మీరు బెస్ట్ Airtel కాంబో ప్లాన్ కోసం చూస్తున్నారా..? అయితే, ఈ ప్లాన్ మీకు ఉపయోగపడొచ్చు. రూ.249పెట్టి రీఛార్జ్ చేయించుకున్నట్లయితే మీకు ఫుల్ టాక్‌టైమ్ మీకు లభించటంతో పాటు Airtel to Airtel నైట్ ఎస్ఎంఎస్‌లను రెండు రోజుల పాటు ఉచితంగా పంపుకోవచ్చు.

మరో కాంబో ప్లాన్‌లో భాగంగా...

మరో కాంబో ప్లాన్‌లో భాగంగా రూ.257 పెట్టి రీఛార్జ్ చేయించుకున్నట్లయితే రూ.100 టాక్ టైమ్‌తో పాటు 500 ఎంబి 3G/4Gడేటా మీకు లభిస్తుంది. డేటా వ్యాలిడిటీ వచ్చే సరికి 30 రోజులు.

ఫుల్ టాక్ టైమ్

రూ.350 పెట్టి రీఛార్జ్ చేయించుకున్నట్లయితే ఫుల్ టాక్ టైమ్ మీకు లభిస్తుంది.

రూ.199కి మూడు ప్యాక్స్ (పోస్ట్ పెయిడ్)

Airtel పోస్ట్ పెయిడ్ యూజర్లు రూ.199 చెల్లించి మూడు ప్యాక్‌లను యాక్టివేట్ చేసుకోవచ్చు. వాటిలో 120 ఎంబి డేటా, 270 నిమిషాల లోకల్ కాల్స్, 80 నిమిషాల STD కాల్స్, 120 నిమిషాల రోమింగ్ కాల్స్ (అవుట్ గోయింగ్), 200 నేషనల్ SMS, 6 నిమిషాల అంతర్జాతీయ కాల్స్ (US/UK/Canada).

11 పోస్ట్ పెయిడ్ ప్యాక్స్ రూ.399కే

Airtel పోస్ట్ పెయిడ్ యూజర్లు రూ.399 చెల్లించి ద్వారా మీ అవసరాలకు అనుగుణంగా 11 ప్యాక్‌లను యాక్టివేట్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Tariff Offers: Top 10 Airtel Internet, Voice Calls, Roaming Plans for Students, Priced Under Rs.400. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting