రూ.339కే రోజుకు 3జీబి డేటా నెలంతా కాల్స్

ప్రయివేటు టెల్కోలకు ధీటుగా బీఎస్ఎన్ఎల్ ఆఫర్ సరికొత్త ఆఫర్‌ను అనౌన్స్ చేసింది. కొత్త ప్లాన్‌లో భాగంగా బీఎస్ఎన్ఎల్ యూజర్లు రూ.339 చెల్లించి స్పెషల్ టారిఫ్ వోచర్‌ను రీచార్జ్ చేసుకోవటం ద్వారా 28 రోజుల పాటు రోజుకు 3జీబి 3జీ డేటా లభిస్తుంది.

Read More : అమెరికా అత్యంత రహస్యంగా వాడిన టెక్నాలజీ ఇదే...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కాల్స్ కూడా ఉచితం...

ఈ ప్లాన్‌లో ఉంటే బీఎస్ఎన్ఎల్ టు బీఎస్ఎన్ఎల్ మధ్య ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. బయట నెట్‌వర్క్‌లకు కాల్స్ చేసుకునేందకు 25 నిమిషాల కాల్స్ అందుబాటులో ఉంటాయి. గతంలో ఇదే ప్లాన్ లో భాగంగా రోజుకు 2జీబి 3జీ డేటాను మాత్రమే ఆఫర్ చేసేవారు.

మరో మూడు కొత్త ప్లాన్‌లు...

రిలయన్స్ జియో ధన్ దనా ధన్ ఆఫర్‌కు పోటీగా BSNL మూడు కొత్త ప్లాన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసిన కొత్త ప్లాన్‌ల వివరాలు.. , దిల్ కోల్ కి బోల్ (STV349), ట్రిపుల్ ఏస్ (STV333), నెహెల్ పె దేహ్లా (STV395).

దిల్ కోల్ కి బోల్ రూ.349

దిల్ కోల్ కి బోల్ రూ.349 ప్లాన్ గురించి చర్చించుకున్నట్లయితే, ఈ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకున్న వారికి 28 రోజుల పాటు రోజుకు 2జీబి డేటా అందబాటులో ఉంటుంది. అంతేకాకుండా, హోమ్ సర్కిల్ పరిధిలో లోకల్ అలానే ఎస్‌టీడీ కాల్స్ ఉచితంగా అందుబాటులో ఉంటాయి.

ట్రిపుల్ ఏస్ రూ.333 ప్లాన్

ట్రిపుల్ ఏస్ రూ.333 ప్లాన్ గురించి చర్చించుకున్నట్లయితే, ఈ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకున్న వారికి 90 రోజుల పాటు రోజుకు 3జీబి డేటా అందుబాటులో ఉంటుంది.

నెహెల్ పె దేహ్లా రూ.395 ప్లాన్

నెహెల్ పె దేహ్లా రూ.395 ప్లాన్ గురించి చర్చించుకున్నట్లయితే, ఈ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకున్న వారికి రోజుకు 2జీబి డేటా అందుబాటులో ఉంటుంది. BSNL టు BSNL నెట్‌వర్క్‌ల మధ్య 3000 నిమిషాల పాటు ఉచితంగా మాట్లాడుకోవచ్చు. ఇతర నెట్‌వర్క్‌ల మధ్య 1800 నిమిషాల పాటు ఉచితంగా మాట్లాడుకునే వీలుటుంది ప్లాన్ వ్యాలిడిటీ 71 రోజులు (10 వారాలు). ఉచిత టాక్‌టైమ్ పూర్తి అయిన తరువాత నిమిషానికి 20 పైసలు ఛార్జ్ చేస్తారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Tariff war: BSNL offers 3 GB data per day for 28 days. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot