రూ.148 చెల్లిస్తే, నెలంతా కాల్స్

జియో రాకతో టెలికం ఆపరేటర్ల మధ్య టారిఫ్ యుద్ధం ముదిరిపాకన పడింది. ముఖ్యంగా ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోల మధ్య ఢీ అంటే ఢీ అనే స్థాయిలో పరిస్థితులు నెలకున్నాయి. టెలికం మార్కెట్ పై విరుచుకు పడుతుతోన్న జియో సునామీని నిలువరించే ప్రయత్నంలో ఎయిర్‌టెల్ రోజుకో సరికొత్త ఆఫర్‌‌ను మార్కెట్లో లాంచ్ చేస్తోంది.

Read More : టచ్‌స్ర్కీన్ పై మరకలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో ఆఫర్‌కు పోటీగా..

డిసెంబర్ 31, 2016 వరకు జియో సేవలు ఉచితంగా అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఆ తరువాత నుంచి జియో సేవలు పొందాలంటే కనీసం రూ.149 పెట్టి రీఛార్జ్ చేయించుకోవల్సి ఉంటుంది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ నెల రోజులు ఉంటుంది. జియో ఆఫర్ చేస్తున్న ఫ్రీ వాయిస్ కాల్ ఆఫర్‌తో పోటీపడేందుకు, ఎయిర్‌టెల్ ఓ అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్ ఆఫర్‌తో ముందుకు వచ్చింది.

రూ.149 పెట్టి రీఛార్జ్ చేయించినట్లయితే..

జియో సిమ్ లేకపోయినా, జియో యాప్స్ వాడుకోవటం ఎలా..?

ఈ ఆఫర్‌లో భాగంగా రూ.149 పెట్టి రీఛార్జ్ చేయించినట్లయితే లోకల్ ఎయిర్‌టెల్ నెంబర్ల మధ్య నెల రోజుల పాటు అపరిమితంగా మాట్లాడుకోవచ్చు. ప్రీపెయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ప్లాన్‌ను పొందుందుకు ఎయిర్‌టెల్ యూజర్లు పాటించివల్సిన సూచనలు..

స్టెప్ 1

ముందుగా మీ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ నెంబర్ నుంచి *121*1#కు డయల్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్టెప్ 2

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్యాక్ వివరాలతో కూడిన ఓ పాపప్ మెసేజ్, మీ ఫోన్ స్ర్కీన్ పై ప్ర్యత్యక్షమవుతంది. కీప్యాడ్‌లో 1 అంకెను ప్రెస్ చేసి ప్యాక్‌ను కన్ఫర్మ్ చేయండి.

స్టెప్ 3

మీ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ నెంబర్ పై, ఈ ప్యాక్‌ను యాక్టివేట్ చేయమంటారా..? అంటూ, ఓ పాపప్ మెసేజ్ వస్తుంది. కీప్యాడ్‌లో 1 అంకెను ప్రెస్ చేసినట్లయితే, మీ మెయిన్ బ్యాలన్స్ అకౌంట్ నుంచి ప్యాక్ యాక్టివేషన్ నిమిత్తం రూ.148 డిడక్ట్ అయినట్లు మెసేజ్ వస్తుంది. కాబట్టి, సరిపగా బ్యాలన్స్ ముందుగానే మీ ఫోన్‌లో ఉంచుకోవల్సి ఉంటుంది.

మైఎయిర్‌టెల్ యాప్ అప్‌డేట్ అయ్యింది

6జీబి ర్యామ్ , 256జీబి స్టోరేజ్‌తో సామ్‌సంగ్ ఫోన్?

తన MyAirtel యాప్‌ను ఎయిర్‌టెల్ తాజాగా అప్‌డేట్ చేసింది. కొత్తవర్షన్ మైఎయిర్‌టెల్ యాప్ ద్వారా యూజర్లు అనేక సదుపాయాలను పొందవచ్చు. కొత్తగా యాడ్ అయిన న్యూ-ఎయిర్‌టెల్ డైలర్ సెక్షన్ ద్వారా ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ పరిధిలో ఉచిత కాల్స్ చేసుకునే వెసలబాటు ఉంటుంది. అదనంగా 2జీ క్లౌడ్ స్లోరేజ్ స్పేస్ కూడా లభిస్తుంది.

V-Fiber బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు

పెద్ద పెద్ద వీడియో ఫైల్స్‌ను VLC ప్లేయర్‌లో కంప్రెస్ చేయటం ఎలా..?

V-Fiber technology పేరుతో సరికొత్త బ్రాడ్‌బ్యాండ్ సర్వీసును ఎయిర్‌టెల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను పొందుతున్న యూజర్లు V-Fiberకు అప్‌డేట్ అవటం ద్వారా 100Mbps వరకు బ్రౌజింగ్ స్పీడ్‌లను అందుకోవచ్చు. కొత్త కస్టమర్‌లు V-Fiber బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు డేటా బెనిఫిట్లను మూడు నెలల పాటు ఉచితంగా ఆస్వాదించవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Tariff War Gets Better: Airtel offers Unlimited Voice Calls At Just Rs. 148. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot