జియోతో చాలా ప్రమాదం, ఎంతలా అంటే..?

Written By:

యూజర్లు ఇప్పుడు జియోకి సలాం కొడుతున్నారు. మార్కెట్లోకి రావడంతోనే సంచలనాలకు వేదికైన జియో దెబ్బకు టారిఫ్ లు భాగా తగ్గిపోయాయి. అప్పటిదాకా టారిఫ్‌ల మోత మోగిస్తున్న దిగ్గజ టెల్కోలు పూర్తిగా కిందకు దిగొచ్చాయి. గత ఏడాదిగా వినియోగదారుల మొబైల్ బిల్లులు భారీగానే తగ్గినట్లు తెలిసింది. టెలికాం ఇండస్ట్రీలో ప్రస్తుతం నెలకొన్న ధరల యుద్ధంతో మరింత స్థాయిలో ధరలు కిందకి పడిపోనున్నాయని ఇండస్ట్రి నిపుణులు చెబుతున్నారు.

వాట్సప్ యూజర్లు.. ముందుగా ఈ నిజాన్ని తెలుసుకోండి !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

25-30 శాతం టారిఫ్‌లు కిందకి

వచ్చే ఏడాది సగటున 25-30 శాతం టారిఫ్‌లు కిందకి పడిపోవచ్చని విశ్లేషకులు, ఇండస్ట్రి ఇన్‌సైడర్స్‌ అంచనావేస్తున్నారు. ఒకవేళ మీరు ఎక్కువ డేటా వాడే వారైతే, మరింత లబ్ది పొందవచ్చంటూ పేర్కొంటున్నారు.

గతేడాదిగా టారిఫ్‌ ధరలు

రిలయన్స్‌ జియో మార్కెట్‌లోకి ప్రవేశించిన అనంతరం గతేడాదిగా టారిఫ్‌ ధరలు కనీసం 25-32 శాతం కిందకి పడిపోయాయి. ఎక్కువ డేటా వాడేవారికి ధరల నుంచి 60-70 శాతం ఉపశమనం లభించిందని తెలిసింది.

మార్కెట్‌లోకి ప్రవేశిస్తూనే

జియో మార్కెట్‌లోకి ప్రవేశిస్తూనే.. ఉచిత లాంచ్‌ ఆఫర్లు, ఆల్ట్రా చీఫ్‌ టారిఫ్‌లతో ఇండస్ట్రిని అదరగొట్టింది. ఈ కొత్త టెల్కోకు కౌంటర్‌ ఇవ్వడానికి, తమ కస్టమర్లు, జియోకు తరలిపోకుండా ఆపేందుకు భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సెల్యులార్‌లు తమ ధరలను తగ్గించాయి.

మరో ఏడాది పాటు ఈ వార్‌

జియో, ఇతర టెల్కోలకు మధ్య నెలకొన్న ధరల యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదని, మరో ఏడాది పాటు ఈ వార్‌ కొనసాగే అవకాశం ఉందని ఇండస్ట్రి బాడీ సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా రాజన్‌ మ్యాథ్యూస్‌ చెప్పారు

ఈ ఏడాది మొబైల్‌ బిల్లులు 25-18 శాతం తగ్గుతాయని

సగటున ఈ ఏడాది మొబైల్‌ బిల్లులు 25-18 శాతం తగ్గుతాయని డెలాయిట్ హాస్కిన్స్‌ అండ్‌ సెల్స్‌ ఎల్‌ఎల్‌పీ పార్టనర్‌ హేమంత్‌ జోషి అన్నారు. 

వచ్చే ఏడాది 30 శాతం పడిపోయే అవకాశాలు

వచ్చే ఏడాది 30 శాతం పడిపోయే అవకాశాలున్నాయని అంచనావేస్తున్నారు. రెండంకెల స్థాయిలో కూడా ధరలు పడిపోవచ్చని కేపీఎంజీ చెబుతోంది.

పాపులర్‌ ప్యాకేజీ ధరల ట్యాగ్‌లు

పాపులర్‌ ప్యాకేజీ ధరల ట్యాగ్‌లు రూ.250 నుంచి రూ.500 మధ్యలో ఉండగా...వీటి వాలిడిటీ 28 రోజుల నుంచి 84 రోజుల మధ్యలో ఉంది.

 

రోజుకు 8జీబీ డేటా వాడేవారు

ఇకపై రోజుకు 8జీబీ డేటా వాడేవారు అత్యధికంగా లబ్ధి పొందనున్నారు. 2016లో రూ.250గా ఉన్న సగటు జీబీ డేటా, ప్రస్తుతం రూ.50కు పడిపోయింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Tariffs likely to drop 25-30 per cent over the next year as price war intensifies: Experts Read more At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot