గ్లోబల్-500 బ్రాండ్స్ జాబితా... టాప్-50లో టాటా గ్రూప్

By Super
|
Google
న్యూయార్క్: అంతర్జాతీయ కార్పొరేట్ ప్రపంచంలో టాటా గ్రూప్ మరో విశిష్ట ఖ్యాతిని సొంతం చేసుకుంది. బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ రూపొందించిన 'గ్లోబల్-500 బ్రాండ్స్" 2011 జాబితాలో తొలి 50 ర్యాంకుల్లో టాటా గ్రూప్‌నకు స్థానం దక్కింది. దీంతో టాప్-50లో చోటు పొందిన తొలి భారతీయ కంపెనీగా రికార్డు సృష్టించింది. 2010లో 65వ స్థానంలో ఉన్న టాటా ఇప్పుడు 50వ ర్యాంకుకు ఎగబాకింది. టాటా గ్రూప్ బ్రాండ్ విలువ 11.2 బిలియన్ డాలర్ల నుంచి 15.08 బిలియన్ డాలర్లకు పెరిగింది.

గతేడాది 108 ర్యాంకును చేజిక్కించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) ఇప్పుడు 133 స్థానానికి పడిపోయింది. బ్రాండ్ విలువ 6.99 బిలియన్ డాలర్లకు తగ్గింది. కాగా, భారత్ నుంచి తాజా జాబితాలో మొత్తం 9 కంపెనీలకు చోటు లభించింది. ఐసీఐసీఐ బ్యాంక్, బీపీసీఎల్‌ల ర్యాంకులు ఈ ఏడాది దిగజారగా... ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌లు తమ ర్యాంకులను మెరుగుపరచుకున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ), భారతీ ఎయిర్‌టెల్, విప్రో కంపెనీలు గ్లోబల్-500లో కొత్తగా చోటు దక్కించుకున్నాయి.

ఈ ఏడాది ర్యాంకింగ్స్‌లో ఇంటర్నెట్ సెర్చి ఇంజన్ దిగ్గజం గూగుల్ 44.29 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో నంబర్ 1 బ్రాండ్ స్థానాన్ని కైవసం చేసుకుంది. గతేడాది టాప్‌లో నిలిచిన వాల్-మార్ట్ మూడో ర్యాంకుకు తగ్గింది. మైక్రోసాఫ్ట్ మాత్రం నం.5 నుంచి నం.2 ర్యాంకుకు ఎగబాకింది. దీని బ్రాండ్ విలువ 42.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఐబీఎం 4, వొడాఫోన్ 5వ ర్యాంకులలో నిలిచాయి. గతేడాది జాబితాలో 20వ స్థానంలో ఉన్న యాపిల్ ఎనిమిదో స్థానానికి దూసుకెళ్లింది.

తొలిసారి టాప్-10 నుంచి కోక-కోలా నిష్ర్కమించడం గమనార్హం. గతేడాది ర్యాంకింగ్స్‌లో మూడో స్థానం పొందిన కోక-కోలా ఈసారి 16వ ర్యాంక్‌కు పడిపోయింది. ఈ కంపెనీ బ్రాండ్ విలువ 9 బిలియన్ డాలర్లు క్షీణించి 25.8 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు బ్రాండ్ ఫైనాన్స్ తాజా నివేదిక పేర్కొంది. టాప్-10 బ్రాండ్‌లలో 5 కంపెనీలు టెక్నాలజీ రంగానికి చెందినవే కావడం విశేషం.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X