పండుగ స్పెషల్... మొబైల్ యూజర్‌లకు భలే టాక్‌టైమ్ ఆఫర్లు!

Posted By: Prashanth

పండుగ స్పెషల్... మొబైల్ యూజర్‌లకు భలే టాక్‌టైమ్ ఆఫర్లు!

 

పండుగ సీజన్ ను పురస్కరించుకుని ప్రముఖ టెలికమ్ ఆపరేటర్లు తమ వినియోగదారులను ఆకర్షించే క్రమంలో సిరకొత్త టాక్ టైమ్ ఇంకా ఇంటర్నెట్ డాటా ఆఫర్ లతో మందుకొచ్చాయి. వాటి వివరాలు..

డొకొమో ఫుల్ టాక్‌టైమ్ ఆఫర్!

ప్రముఖ టెలికమ్ ఆపరేటర్ టాటా డొకొమో ఆంధ్రప్రదేశ్ యూజర్ల కోసం దీపావళి స్పెషల్ రీఛార్జ్ ఆఫర్ లను ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక ఆఫర్ లలో భాగంగా తన ప్రీపెయిడ్ జీఎస్ఎమ్ కస్టమర్ ల కోసం ఆర్ సీవీ 222, ఆర్ సీవీ 250 ప్యాక్ లను అందుబాటులోకి తెచ్చింది. వివరాల్లోకి వెళితే... ఆర్ సీవీ 222ను ఎంపిక చేసుకున్న యూజర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కూడిన పూర్తి టాక్ టైమ్ ను పొందుతాడు. 30 రోజుల పాటు అన్ని లోకల్, ఎస్ టీడీ కాల్స్ పై రెండు సెకన్లకు ఒక పైసా చొప్పున చార్జ్ చేస్తారు. ఈ టారిఫ్ సదుపాయాలను ఉపయోగించుకోవాలనుకునే డొకొమో జీఎస్ఎమ్ యూజర్లు తమ మొబైల్ ద్వారా *141*651#కి డయిల్ చేసి ఆఫర్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు. మరో రీఛార్జ్ వోచర్ 250 పై పూర్తి టాక్ టైమ్ తో కూడిన 2జీబి ఇంటర్నెట్ ను పొందవచ్చు. ఈ ఆఫర్ లో భాగంగా 10కేబీ ఇంటర్నట్ వినియోగానికి 10పైసా వసూలు చేస్తారు. ఈ సందర్భంగా టాటా డొకొమో ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి ఎస్. రామక్రిష్ణ స్పందిస్తూ తమ వినియోగదారులను పండుగ వేళ మిత్రులు ఇంకా శ్రేయోభిలాషులతో నిరాటకంగా కమ్యూనికేషన్ సాగించాలనే సదుద్ధేశ్యంతో సరికొత్త ఆఫర్ లను వెలుగులోకి తెచ్చిన్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

బీఎస్‌ఎన్‌ఎల్ టాక్‌వాల్యూ ఆఫర్!

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని తమ జీఎస్‌ఎం మొబైల్ ప్రి పెయిడ్ వినియోగదారుల కోసం లిమిటెడ్ పీరియడ్ ప్రమోషనల్ ఆఫర్‌ను అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ బీఎస్‌ఎన్‌ఎల్ టెలికాం సర్కిల్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. రూ.6,000 టాపప్ రీచార్జ్‌కు రూ.7,200 విలువైన టాక్ వాల్యూని పొందవచ్చని పేర్కొంది. ఈ ఆఫర్ ఈ నెల 12 నుంచి ప్రారంభమై 21 వరకూ అమల్లో ఉంటుందని వివరించింది.

వొడాఫోన్ రూ.145 బోనస్ కార్డ్ ఆఫర్!

హైదరాబాద్: ప్రి-పెయిడ్ వినియోగదారుల కోసం అన్‌లిమిటెడ్ డేటా యూసేజినందించే రూ.145 బోనస్‌కార్డ్ ఆఫర్‌ను అందిస్తున్నామని వొడాఫోన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్‌లో 2 జీబీ డేటాను 2జీ స్పీడ్‌తో వినియోగదారులు యాక్సెస్ చేయవచ్చని వివరించింది. ఈ బోనస్ కార్డ్ వ్యాలిడిటీ 28 రోజులని పేర్కొంది. వినియోగదారులు వెచ్చించే సొమ్ముకు మరింత విలువనందించేలా ఆఫర్లనందించడం తమ ప్రత్యేకత అని వొడాఫోన్ ఇండియా బిజినెస్ హెడ్(ఆంధ్రప్రదేశ్) మందీప్‌సింగ్ భాటియా పేర్కొన్నారు.

వొడాఫోన్ రూ.145 బోనస్ కార్డ్ ఆఫర్

ప్రి-పెయిడ్ వినియోగదారుల కోసం అన్‌లిమిటెడ్ డేటా యూసేజినందించే రూ.145 బోనస్‌కార్డ్ ఆఫర్‌ను అందిస్తున్నామని వొడాఫోన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్‌లో 2 జీబీ డేటాను 2జీ స్పీడ్‌తో వినియోగదారులు యాక్సెస్ చేయవచ్చని వివరించింది. ఈ బోనస్ కార్డ్ వ్యాలిడిటీ 28 రోజులని పేర్కొంది. వినియోగదారులు వెచ్చించే సొమ్ముకు మరింత విలువనందించేలా ఆఫర్లనందించడం తమ ప్రత్యేకత అని వొడాఫోన్ ఇండియా బిజినెస్ హెడ్(ఆంధ్రప్రదేశ్) మందీప్‌సింగ్ భాటియా పేర్కొన్నారు.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot